మధురకవి మల్లవరపు జాన్ 92 వ జయంత్యోత్సవం మరియు మల్లవరపు రాజేశ్వరరావు 71 వ జయంతి
తేదీ 27.01.2019, ఆదివారం L.G.భవన్ లో ఉదయం 10.30 గంటలకు
మధురకవి మల్లవరపు జాన్ సాహితీ పురస్కారం 2018 కి గాను ప్రముఖకవి, విమర్శకుడు బెనారస్ హిందు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడు ఆచార్య చల్లా శ్రీరామ చంద్రమూర్తికి ప్రదానం చేస్తున్నారు.
మల్లవరపు జాన్ సాహితీ పురస్కారం 2018
ప్రముఖకవి, విమర్శకుడు బెనారస్ హిందు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుడు ఆచార్య చల్లా శ్రీరామ చంద్రమూర్తికి 2018 వ సంవత్సరానికి గాను మధురకవి మల్లవరపు జాన్ సాహితీ పురస్కారాన్ని ప్రకటించారు. 2016 నుండి ఈ పురస్కారాన్నిస్తున్నారు. నిష్ణాతుల కమిటీ ఈ పురస్కారాన్ని ఎంపిక చేస్తుంది. పురస్కారానికి గాను సన్మానం, 5116/- (ఐదువేల నూట పదహారు రూపాయలు) నగదు, దుశ్శాలువా, ప్రశంసా పత్రంతో సత్కరిస్తారు.
ఈ యేడాది పురస్కారాన్ని అందుకోబోయే ఆచార్య శ్రీ చల్లా శ్రీరామచంద్రమూర్తి ప్రస్తుతం వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖలో అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. ఈయన పద్య సాహిత్యంలో విశేషమైన కృషిచేస్తున్నారు. ఈయన శ్రీరామవ్యాసాలు, తాళపత్ర గౌతమి, తెలుగు అధ్యాత్మ రామాయణాలు(తులనాత్మక విమర్శ ),శ్రీ రామ వ్యాసాలు, కాశీ మహిమ చల్లావారి గరిమ, అవధాన కళ, కాశీ చరితామృతం మొదలైన రచనలు చేశారు.
మల్లవరపు జాన్ స్మారకోపన్యాసాన్ని ప్రముఖకవి, విమర్శకులు ఆచార్య డా.దార్ల వెంకటేశ్వరరావు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వారు అందచేస్తారు.
"జానుడి" సాహిత్యపత్రిక వెలువరించిన మల్లవరపు రాజేశ్వరరావు స్మారక సంచిక ఆవిష్కరణ.
మల్లవరపు రాజేశ్వరరావు 71వ జయంతి సందర్భంగా విద్యార్థుల కు నిర్వహించిన శతక పద్య పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం
కవిసమ్మేళనం
ఆహ్వానించువారు:
మల్లవరపు ప్రభాకరరావు,
కన్వీనర్, మధురకవి మల్లవరపు జాన్ సాహిత్య భారతి, ఒంగోలు
డా. నూకతోటి రవికుమార్,
కన్వీనర్, జానుడి( Centre for Literary Studies)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి