నోటికొచ్చినట్లు మాటలాడతగదు
మాటకున్నవిలువమరువరాదు
మరచువానినెవ్వరాదరించగలరు?
దారి పూల తోట దార్ల మాట!!
ఎక్కడుంటిమయ్య యేమిబ్రతుకులయ్య!
యెఱుకలోళ్ళుయనుచు యెట్లు తిట్టు?
జాతినట్లుతిట్ట జాగృతేలేదురా!
దారి పూల తోట దార్ల మాట!!
'మంటకలిసిపోయెమానవహక్కులు'
మాటమాటకనెడిమనుషులేరి?
జాతికొక్కనీతి జాడ్యంబులేలరా!
దారి పూల తోట దార్ల మాట!!
-దార్ల వెంకటేశ్వరరావు, హైదరాబాదు
1 కామెంట్:
dear sir very good blog and very good content
Telugu News
కామెంట్‌ను పోస్ట్ చేయండి