ఆహారాన్ని పరిశీలిస్తున్న ఆచార్య దార్ల బృందం
హాస్టల్లలోని వివిధ వంటపాత్రలను పరిశీలిస్తున్న ఆచార్య దార్ల బృందం
వంటశాలలో దోసెలు వేసే పెనాన్ని పరిశీలిస్తున్న ఆహారాన్ని ఆచార్య దార్ల బృందం
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాధమికంగా మన వంటశాల పరిశుభ్రంగా ఉండాలి. వంట చేసే వాళ్లు కూడా పరిశుభ్రంగా ఉండటం కూడా ముఖ్యం. ముఖ్యంగా మనమందరమూ ఉపయోగించుకునే వసతి నివాసాలు అంటే హాస్టళ్లలో పరిశుభ్రత మన అందరి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.అందువల్ల ఇందులో మన అందరూ భాగస్వామ్యం కావడం ముఖ్యని స్వచ్ఛతాపక్షోత్సవ కమిటీ చైర్మన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. యూనివర్సిటీలోని జె.కె హాస్టల్స్ ని ఆయన తన బృందంతో సందర్శించారు. హాస్టల్ వంటశాల పరిశుభ్రతాదినోత్సవంలో భాగంగా సోమవారం వివిధ హాస్టళ్లలోని మెస్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో Dy.DSW డాక్టర్ జి.పద్మజ, Dy.రిజిస్ట్రార్ ఎ.శ్రీనివాసరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.చంద్రశేఖర్, j హాస్టల్ వార్డెన్ డా.డి. రామచంద్రరావు, k.హాస్టల్ వార్డెన్ డాక్టర్ శ్యామల్ బిశ్వాస్, విద్యార్థులు అధికారులు పాల్గొన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి