స్వచ్ఛతా పక్షోత్సవాల్లో భాగంగా నాల్గవరోజు సోమవారం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో వ్యాసరచన పోటీలు జరిగాయి. మన పరిసరాల పరిశుభ్రత తో పాటు, ఇతరులు కూడా పరిశుభ్రంగా ఎలా ఉండాలో వినూత్నమైన పద్ధతిలో కొన్ని సూచనలు అందించడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని స్వచ్ఛతా పక్షోత్సవ కమిటీ ఛైర్మన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఉద్భోదించారు.
ఆంధ్రజ్యొీతి దినపత్రిక, శేరిలింగంపల్లి, 6 సెప్టెంబరు 2017
హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఈ పోటీలను నిర్వహించారు. సుమారు 135 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. మూడు విభాగాల్లోనూ ప్రధమ,ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రకటిస్తారని ఆచార్య దార్ల చెప్పారు. ఈనెల 15వ తేదీన జరిగే ముగింపు ఉత్సవంలో బహుమతి ప్రదానోత్సవ సభ ఉంటుందన్నారు. భారతదేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీ లన్నీ ఈ కార్యక్రమాన్ని నిర్వఘ్నంగా కొనసాగిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఈ పోటీలు జరుగుతున్నాయని డిప్యూటీ డి ఎస్ డబ్ల్యు డాక్టర్ జి.పద్మజ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంక్షేమ విభాగం సిబ్బంది శ్రీ సతీష్ , అరవింద్ తదితరులు పాల్గొన్నారు
1 కామెంట్:
నమస్కారం _/\_
మీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/
కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి