భూదేవిమాతృస్ఫర్శతో
మురిసిపోయిందీ
ఈనాడే!
విశాలత్వంతో ఆకాశమంతా
చిగురించిందీ
ఈనాడే!
నక్షత్రాలన్నీ తారాతోరణాలై
ఒక్కసారిగా కురిసిందీ
ఈనాడే!
సాగరుడు
నదీసంగమంతో
తియ్యనికెరటమైందీ
ఈనాడే!
ఐదులు పదులై..
రెండ్లొకటై
కొత్త రూపొచ్చిందీ
ఈనాడే!
- దార్ల
5 సెప్టెంబర్ 2017
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి