సాక్షి దినపత్రిక, 10-9-2017
హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొ.వైస్
ఛాన్సలర్ గా బాధ్యతలు
చేపట్టిన ఆచార్య పి. ప్రకాశ బాబు గార్ని శనివారం నాడు విశ్వవిద్యాలయ పూర్వ
విద్యార్థుల కార్యనిర్వహక
సంఘం (Executive Committee, University of
Hyderabad, Alumni) ఘనంగా సత్కరించింది.
ఇదే విశ్వవిద్యాలయంలో చదివి, మరలా ఇదే విశ్వవిద్యాలయానికి ఆచార్య
పి.ప్రకాశబాబుగారు ప్రొ.వి.సి.గా నియమితులు కావడం తమకెంతో సంతోషంగా ఉందని సభ్యులు
తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఈ సంఘంలో పోలీసు ఉన్నతాధికారులు ద్వారకా తిరుమలరావు,
జానకీ షర్మిల కూడా సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం
వైస్ ఛాన్సలర్ ఆచార్య అప్పారావు పొదిలె పూర్వ విద్యార్థుల పక్షాన ఆచార్య ప్రకాశ్
బాబు గార్ని దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ వార్డెన్ ఆచార్య వాసుకి
బలవాడి, డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్
ఆచార్య దేవాశిష్ ఆచార్య, డిప్యూటీ డిన్ ఆచార్య దార్ల
వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డాక్టర్ స్వరూప
రాణి, డాక్టర్ దామోదర్, డాక్టర్
నాగేశ్వరరావు, డాక్టర్ ఆరుళ్ మోజి, డాక్టర్.లవకేశ్
ద్వివేది తదితరులు పాల్గొన్నారు. తనకు జరిగిన సన్మానానికి ఆచార్య పి.ప్రకాశబాబు
కృతజ్ఞతలు తెలియజేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి