"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

10 సెప్టెంబర్, 2017

నా మదికొండ!

వ్యాకరణ కీకారణ్యాల్లో
పడిపోతున్నప్పుడు
ఈ పావురానికి
తడారిన గొంతులో
కాస్త 'రసాన్ని'రుచి చూపించిందాయనే!
పాఠం ప్రవహించడమెలాగో
విద్యార్థుల నిశ్శబ్దాన్ని ఛేదించి
చైతన్య శక్తినినింపడమెలాగో నేర్పిందాయనే!
భరతుడి చేతిలోని అమృతబంధాన్ని
నాపై కుమ్మరించిందాయనే!
ఆనందవర్ధనుడి  ఆ వెలుగు రేఖల్ని

నాకళ్ళల్లో వెలిగించిందాయనే!
కవిత్వకన్యహృదయాన్ని
జయించడానికో
సహృదయాన్నిచ్చిందాయనే!
కవిత్వం విశ్లేషణకో 

హంసవాహనాన్నిచ్చిన
సత్యం...శివం...సుందరమైందీ ఆయనే!
ఆయనే నామదికొండ !మా ముదిగొండ!!
                                        -దార్ల
                                         10 - 9 -2017

1 కామెంట్‌:

Padmarpita చెప్పారు...

అలా అందించడం మీ అదృష్టమే... ఆయనకు వందనములు.