మనం పారబోసే వ్యర్ధపదార్ధాలనుండి బయోశక్తిని ఉత్పత్తి చేసుకొనే అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని శేరిలింగంపల్లి సర్కిల్ అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బిందు భార్గవి అన్నారు. స్వచ్ఛతాపక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం హైదరాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థులతో డాక్టర్ బిందు భార్గవి సమావేశమయ్యారు. హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పరిశుభ్రత పట్ల తీసుకుంటున్న చర్యలు గురించి, ఉపయోగిస్తున్న యంత్రాలు, పరికరాలు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు. నగరంలో ఒకవేళ మరుగుదొడ్లు లేకపోతే అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉన్న హోటల్స్ ని ఉపయోగించుకోవచ్చనని తెలిపారు. ఈ కార్యక్రమానికి సచ్ఛతా పక్షోత్సవ కమిటీ చైర్మన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి.చంద్రశేఖర్, శేరిలింగంపల్లి మునిసిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ కె.రవీందర్ రెడ్డి, కంప్యూటర్ టెక్నీషియన్ గాయత్రి, ఎన్.ఎస్.స్.కార్యకర్తలు ప్రవీణ, మధు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి