మీలాంటి వాళ్ళెంతోమంది మా దగ్గరకొచ్చి, మాతో మాట్లాడుతూ, ఆడుతూ పాడుతూ ఉంటే మేము అనాథలమనే మాటే మర్చిపోతామని, మాకెంతో ఆనందంగా ఉంటుందని చందానగర్ లోని సంకల్ప అనాథాశ్రమానికి చెందిన పిల్లలు చెప్పారు. స్వచ్ఛతా పక్షోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వచ్ఛతా పక్షోత్సవ కమిటీ చైర్మన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, జాతీయ సేవాపథకం కో ఆర్డినేటర్ డా.వసంత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంకల్ప అనాథాశ్రమాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా జాతీయ సేవాకార్యకర్తలు అనాథాశ్రమంలో పిల్లలకు పండ్లు పంచారు. పొద్దున్న లేచిన దగ్గరనుండీ, రాత్రి పడుకొనేవరకు శుభ్రంగా ఎలా ఉండాలో సోదాహరణంగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఆ విద్యార్థులకు వివరించారు. పిల్లలతో చాలాసేపు గడిపి, వారితోపాటలు పాడించారు. వారిలోని శక్తిసామర్థ్యాలకు ఆశ్చర్యపోయారు.
ఈ కార్యక్రమంలో జాతీయసేవాసంఘం సభ్యులు
హరికిషన్, కల్యాణి, యోగేష్, మాధవ్, కిషోర్, రాజీవ్, నిఖిల్, రమేశ్, సింధుజ, బాబు,
ఈశ్వర్, ప్రవీణ, రవికిషోర్, శ్రావణ్ తదితరులు పాల్గొని పండ్లు పంచారు. పరిసరాల
పరిశుభ్రతపై చైతన్యాన్ని నింపే మాటలు చెప్పారు. అనాథాశ్రమంలో రాజేష్ కుమార్ సింగ్,
నాని, నరేశ్ తదితర విద్యార్థులు పాడిన పాటలు, చెప్పిన డైలాగులు అందర్నీ అలరించాయి.
అనాథాశ్రమాన్ని సందర్శించిన వారితో ఆ విద్యార్థినీ విద్యార్థులు ఎంతోసంతోషంగా
సెల్ఫీలు దిగారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి