"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

19 డిసెంబర్, 2016

నిందర్ ఘుగైణ్వి ‘ నేను జడ్జిగారి సేవకుడ్ని’ పుస్తకావిష్కరణ విశేషాలు


నిందర్ ఘుగైణ్వి తన ఆత్మకథను తెలుగులో ‘‘నేను జడ్జిగారి సేవకుడ్ని’’ పేరుతో డా. రహీమ్ పఠాన్ ఖాన్ అనువదించారు. ఈ పుస్తకాన్ని 18 డిసెంబరు 2016 వ తేేదీన రామగుండంలో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో హైదరాబాదు జిల్లా సెషన్స్ జడ్జి (రిటైర్డ్) శ్రీ వి.రవికుమార్ గారు, రామగుండం కమీషన్ ఆఫ్ పోలీస్ శ్రీ విక్రమ్ జీత్ దుగ్గల్, ఆసిఫాబాద్ ఎస్.పి. సన్ ప్రీతి సంగ్ , సెంట్రల్ యూనివర్సిటి అసోసియేట్ ప్రొఫెసర్ డా.దార్ల వెంకటేశ్వరరావు, ప్రముఖ కవి, పరిశోధకుడు డా. సంగనభట్ల నరసయ్య, డా. గండ్ర లక్ష్మణరావు, వేముల అశోక్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్లొన్నారు. జాతీయ సమగ్రతకు మాతృభాషల అనుసంధానం ఎంతగానో దోహదపడుతుందని రామగుండం కమీషన్ ఆఫ్ పోలీస్ శ్రీ విక్రమ్ జీత్ దుగ్గల్ వ్యాఖ్యానించారు. నిందర్ ఘుగైణ్వి పంజాబీలో రాసిన గ్రంథాన్ని హిందీలోకి అనువదిస్తే, దాన్ని డా.పఠాన్ రహీమ్ ఖాన్ తెలుగులోకి అనువదించారు. దానికి సెంట్రల్ వర్సిటి ప్రొఫెసర్ డా.దార్ల వెంకటేశ్వరరావు సహకరించారు. వీరికి పంజాబీ రచయిత నిందర్ ఘుగైణ్వి తరపున కృతజ్ఙతలు తెలియజేశారు. తనది పంజాబీ మాతృభాష అయినప్పటికీ తెలుగు నేర్చుకున్నానని అన్నారు.
 జాతీయ సమగ్రతను పెంపొందించుకోవడానికి మాతృభాషల్ని నేర్చుకోవాలని, దీనిక అనువాదాలు ఎంతగానో సహకరిస్తాయని ఆయన ఉద్బోధించారు. నిందర్ ఘుగైణ్వి తన పుస్తకాన్ని విక్రమ్ జీత్ దుగ్గల్ గార్కి అంకితమిచ్చి, సత్కరించారు. స్థానిక సాహిత్య, సాంస్కృతిక సంస్థలవారు కూడా కమీషనర్ ని ఘనంగా సత్కరించారు.
            తాను ఈ పుస్తకాన్ని అనువాదం చేయడానికి గల కారణాలను, ఆ నేపథ్యాన్ని అనువాదకుడు డా. పఠాన్ రహీమ్ ఖాన్ సోదాహరణంగా వివరించారు. తాను గతంలో విక్రమ్ జీత్ దుగ్గల్ గార్కి కొద్దిగా తెలుగు భాషను నేర్పానని, ఆ పరిచయంతో తనను ఈ పుస్తకాన్ని తెలుగులో అనువదించమని చెప్పారని, అందువల్ల ఈ పుస్తకాన్ని ఇలా అనువదించానని చెప్పారు. 
తన మాతృభాష పంజాబీలో మంచి పుస్తకాన్ని రాసి, తనకి అంకితమిచ్చిన నిందర్ ఘుగైణ్విని కమీషనర్ శ్రీ విక్రమ్ జీత్ దుగ్గల్ ఘనంగా సత్కరించారు.
పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యఅతిధి వి.రవికుమార్ గారు మాట్లాడుతూ, వ్యవస్థలో భిన్న దృక్కోణాలుంటాయని, మంచి చెడుల్ని బేరీజు వేసుకొని, సమాజం సక్రమంగా నడవడానికి కావాల్సిన అంశాల్ని రచయితలు పాఠకులకు అందించాలన్నారు. ఈ పుస్తకంలో జడ్జిల గురించి, వారి దగ్గర పనిచేసే సేవకులు గురించి రాసినా, అవి కేవలం జడ్జిలకు మాత్రమే చెందినవిగా భావించకూడదన్నారు. అలాంటి వాళ్ళు రకరకాల సంస్థల్లోను ఉంటారన్నారు.

 డా.దార్ల వెంకటేశ్వరరావు పుస్తకాన్ని సమీక్షిస్తూ, దానిలోని మంచిచెడులను విశ్లేషించారు. పీడన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాన్ని ఎదుర్కొనే చైతన్యం కూడా పుట్టుకొస్తుందనీ, దీనిలో భాగంగానే ఈ పుస్తకాన్ని చూడాలని అన్నారు. పీడన వివిధ స్థాయిల్లో ఉంటుందనీ, దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక మార్గాన్ని చూపిస్తుందన్నారు. పుస్తకంలోని వివిధ విషయాలను సోదాహరణంగా వివరిస్తూ, ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా వారి వారి స్థాయిల్లో సంఘర్షణను ఎదుర్కోవలసి వస్తుందనీ, అయితే, కిందిస్థాయిలో వాళ్ళు వ్యక్తం చేసినంత వేగంగా ఆ సంఘర్షణ బయటపడదనేది చాలా కొద్దిమంది మాత్రమే అవగాహన చేసుకుంటారని విశ్లేషించారు. అలాంటి సంఘర్షణలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయని, ఈ పుస్తకాన్ని రాయడంలో మూలరచయితతో పాటు, అనువాదకుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు.
పుస్తకంలోని మరికొన్ని అంశాలనుసన్ ప్రీతి సంగ్, డా.లక్ష్మణరావు, వేముల అశోక్,  డా.సంగనభట్ల నరసయ్య, తదితరులు  వివరించారు. సభలో నిందర్ ఘుగైణ్వి ప్రసంగం హిందీలో సాగింది. మిగతావాళ్లంతా తెలుగులోనే మాట్లాడారు. అయితే, నిందర్ ని పంజాబీ లోక్ గీత్ ఆలపించమని సభలోని శ్రోతులు కోరారు. వారి కోరిక మేరకు తన దగ్గర తంబూరా లేకపోయినా , ఆ సభలో ఉన్నడోలు సహాయంతో పాటపాడారు. శ్రోతులు ఉర్రూతలూగారు. సభలో నిందర ఘుగైణ్విని, డా.పఠాన్ రహీమ్ ఖాన్, డా.దార్ల వెంకటేశ్వరరావు తదితరులను కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ విక్రమ్ జీత్ దుగ్గల్ ఘనంగా సత్కరించారు. సభా నిర్వహణలో పాలు పంచుకున్న పలువుర్ని శ్రీ వి.రవికుమార్ గారు అభినందిస్తూ జ్ఞాపికలను బహూకరించారు.







నమస్తేతెలంగాణ దినపత్రిక, పెద్దపల్లి  జిల్లా 19-12-2016 సౌజన్యంతో 



సాక్షి దినపత్రిక, పెద్దపల్లి  జిల్లా 19-12-2016 సౌజన్యంతో 



ఆంధ్రభూమి దినపత్రిక, పెద్దపల్లి  జిల్లా 19-12-2016 సౌజన్యంతో 

నవతెలంగాణ దినపత్రిక, పెద్దపల్లి  జిల్లా 19-12-2016 సౌజన్యంతో 



ఈనాడు దినపత్రిక, పెద్దపల్లి  జిల్లా 19-12-2016 సౌజన్యంతో 

Ninder Ghugianvi తన Facebook లో ఇలా రాసుకున్నారు.

ਕਦੇ ਸੋਚਿਆ ਨਾ ਸੀ ਕਿ ਤੇਲਗੂ ਵਿਚ ਮੇਰੀ ਕਿਤਾਬ ਦਾ ਅਨੁਵਾਦ {ਨੈਣੂ ਜੱਜ ਗਾਰੀ ਸੇਵਕੁਡਨੀ}ਡਾ ਪਟਨ ਰਹੀਮ ਖਾਂ ਉਰਦੂ ਯੂਨੀ: ਹੈਦਰਾਬਾਦ ਦੇ ਪਰੋਫੈਸਰ ਵਲੋਂ ਹੋਵੇਗਾ, ਤੇਲੰਗਾਨਾ ਸੂਬੇ ਵਿਚ ਰਿਲੀਜ ਹੋਵੇਗੀ, ਉਥੋਂ ਦੇ ਲੋਕ ਤੇ ਵਿਦਵਾਨ ਇਕੱਠੇ ਹੋ ਕੇ ਪਰੰਪਰਾਗਤ ਢੰਗ ਨਾਲ ਸਨਮਾਨਿਤ ਪਗੜੀ ਸਿਰ ਉਤੇ ਰੱਖ ਕੇ ਏਨਾ ਪਿਆਰ ਸਤਿਕਾਰ ਦੇਣਗੇ, ਸੱਚ ਜਾਣੋ, ਬਹੁਤ ਆਦਰ ਮਿਲਿਆ। ਅਸ਼ਕੇ ਜਾਈਏ ਵੀਰ ਪਿਆਰੇ ਵਿਕਰਮਜੀਤ ਦੁੱਗਲ IPS ਕਮਿਸ਼ਨਰ ਰਾਮਾਗੁੰਡਮ ਦੇ। ਮਾਣਯੋਗ ਜੱਜ ਵਾਰੂਲੀ ਰਵੀ ਕੁਮਾਰ ਆਂਧਰਾ ਪਰਦੇਸ ਹਾਈਕੋਰਟ ਕਿਤਾਬ ਰਲੀਜ ਕਰਨ ਉਚੇਚਾ ਪਧਾਰੇ। ਡਾ ਦਾਰਲਾ ਵੈਕੇਂਟਸ਼ਵਰ ਰਾਓ ਤੇਲਗੂ ਪਰੋਫੈਸਰ ਸੈਂਟਰਲ ਯੂਨੀ: ਤੇ ਡਾ ਸੰਗਨਾ ਭਠਲਾ, ਜੀ ਲਕਸਮਣ ਰਾਓ, ssp ਸਨਪਰੀਤ ਸਿੰਘ,ਅੰਦੇ ਸਦਾ ਨੰਦ ਸਵਾਮੀ ਸਮੇਤ ਕਈ ਤੇਲਗੂ ਵਿਦਵਾਨਾਂ ਨੇ ਕਿਤਾਬ ਬਾਰੇ ਭਾਸ਼ਣ ਦਿਤੇ। ਕੀ ਗੱਲ ਕਰਾਂ ਤੇ ਕੀ ਛੱਡਾਂ? ਏਨਾ ਪਿਆਰ ਮਿਲਿਆ ਕਿ 4 ਘੰਟੇ ਸਮਾਗਮ ਨੂੰ ਮਾਣਦੇ ਸਰੋਤੇ ਅੱਕੇ-ਥੱਕੇ ਨਹੀਂ। ਕੁਝ ਝਲਕਾਂ ਤਸਵੀਰਾਂ ਦੀ ਜੁਬਾਨੀ।




కామెంట్‌లు లేవు: