"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

18 May, 2015

బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు

మనుస్మృతికి మారుపేరు బ్రాహ్మణుడు
------------------------------------------------------------------
1. " బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు జన్మించారు. " ( ఋగ్వేదం 10 - 90 - 12 )
2. " భూలోక విస్తారము కోరినవాడై బ్రహ్మ తన ముఖము, బాహువులు, తొడలు, పాదాల నుండి వరుసగా బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను సృష్టించెను. " ( మనుస్మృతి 1 - 31 )
3. " బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు వారి వారి ధర్ంులను ఇహపర సుఖములకై బ్రహ్మ వేరువేరుగా ఏర్పరచెను. " ( మను 1 - 87 )
4. " వేద ఆధ్యయనం - ఆధ్యాపనం, యజ్ఞాలు చేయడం - చేయించడం, దానాలు చేయడం - స్వీకరించడం అను ఈ ఆరు ధర్మములు బ్రహ్మణులకు నిర్దేశించబడ్డాయి. " ( మను 1 - 88 )
5. " క్త్షత్రియులకు పరిపాలన, ప్రజారక్షణ ధర్మంగా నిర్దేశింబడినది. వేదాద్యాయనమే కాని ఆధ్యాపన అర్హత లేదు. దానం చేయాలి కానీ దాన పరిగ్రహ అర్హత లేదు. " ( మని 1 - 89 )
6. " వ్యవసాయం, పశుపోషణ, వానిజ్యం వైశ్య ధర్మం. వేదాధ్యాయనమే కాని అధ్యాపన అర్హత లేదు. దానం ఇవ్వడమే కాని పరిగ్రహించే అర్హత లేదు. " ( మను 1 - 90 )
7. " బ్రహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యులకు గుణనింద చేయకుండా శుశ్రూష ( సేవ) చేయడం. " ( మను 1 - 91 )
8. " బొడ్డుకు క్రింది భాగం కంటే పై భాగం పరిశుద్ధమైనదని చెప్పబడెను. అందును ముఖం మిక్కిలి పరిశుద్ధమని బ్రహ్మచే చెప్పబడెను. " ( 1 - 92 )
9. " ఉత్తమాంగము నుండి పుట్టుట వలనను, Veదములు ధరించుట వలనను, అన్ని వర్ణములకు ధర్మశాసనము చెప్పడం వల్ల వర్ణములకెల్ల బ్రహ్మణుడు ప్రభువు. " ( మను 1 - 93 )
10. " ఈ చరాచర జగత్తులో ప్రణులు శ్రేష్టులు. ప్రాణులలో బుద్దిజీవులు శ్రేష్టులు. వాటిలో మనుష్యులు శ్రేష్టులు. మనుషుల్లో బ్రాహ్మణులు శ్రేష్టులు." (మను 1 - 96 )
11. " ఈ భూమియందున్న సంపద అంతా బ్రాహ్మణునిదే. ఇతరులందరూ కూడా బ్రాహ్మణుని సంపదనే అనుభవించు చున్నారు. " ( మను 1 - 100)
12. " పదేండ్ల బ్రాహ్మణుడు, నూరేండ్ల క్షత్రియుడు వరుసగా తండ్రి కొడుకులుగా ఎంచవలయును. వీరిలో బ్రాహ్మణుడే తండ్రిగా చెప్పబడెను. " ( మను 2 - 135 )
13. " బ్రాహ్మణులు ప్రథమ పెళ్ళి బ్రహ్మణ కన్యనే చేసుకోవాలి. కామము కొరకు క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలను గ్రహించవచ్చును. క్షత్రియులు క్షత్రియ కన్యను పెళ్ళాడి కామమునకు వైశ్య, శూద్ర స్త్రీలను గ్హించ వచ్చును. వైశ్యుడు వైశ్య కన్యను పెళ్ళాడి, కామమునకు శూద్ర స్త్రీని గ్రహించ వచ్చును. శూద్రునికి మాత్రం శూద్ర కన్య ఒక్జటే . " ( మను 3 - 12, 13 )
14. " ఎన్ని పాపాలు చేసినప్పటికి బ్రహ్మణున్ని ఎప్పుడూ చంపరాదు. వాని ధనమును వానికొసంగి, శారీరకంగా బాధింపక దేశం నుండి పంపించాలి. " ( మను 8 - 380 )
15. " లోకమున బ్రాహ్మణ వధ కంటే మించిన గొప్ప అధర్మం మరొకటి ఏదీ లేదు. బ్రాహ్మణున్ని చంపుట మనస్సులో కూడా తలంచకూడదు. " ( మను 8 - 381 )
16. " ఉపయోగపడినా, ఉపయోగపడకపోయినా అగ్ని ఎట్లు మహిమాన్వితమో అట్లే పండితుడైనా, మూర్ఖుడైనా బ్రాహ్మణుడు ప్రకృష్టమైన దేవుడే. ( మను 9 - 317 )
17. " బ్రాహ్మణుడు ముల్లోకాల ప్రజలను పీడించినప్పటికి , అనేక పాపములు చేసినప్పటికి, Veదములు కలగియుండుట వలన పాపమును పొందడు. " ( మను 11 - 261 )
18. " బ్రాహ్మణులు ఎన్ని నీచకార్యములు చేసినప్పటికి వారు సర్వవిధముల పూజ్యులే అగుదురు. వారు ఎల్లప్పుడు పరమోత్మ దేవతలే అగుదురు. " ( మను 9 - 319 )
19. " మానవులు శ్రుతుల యందును, స్మృతుల యందును చెప్పబడిన ధర్మము ననుసరించుచు ఇహలోక సుఖమును, పరలోక మోక్షమును పొందుదురు. అందుచే శ్రుతిస్మృతుల ధర్ంులను అనుష్టించుట విధి ( Vidhi) అని చెప్పబడినది. " ( మను 2 - 9 ).
20. " బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను సర్వజగద్రక్షణములకై తన ముఖం నుండి పుట్టించెను. " ( మనుస్మృతి : 1 - 94 )
21. " ఉత్తమాంగమయిన ముఖం నుండి పుట్టుట వలనను, Vedamulanu ధరించుట వలనను, మిగిలిన వర్ణములకు ధర్మోపదేశార్హత వల్లను బ్రాహ్మణుఉ అన్ని వర్ణములకు ప్రభువు అగుచున్నాడు. " ( మను : 1 - 93 )
22. " సకల చరాచర రాసులలో ప్రాణులు శ్రేష్ఠులు. ప్రతి అణులలో బుద్ధిజీవులు శ్రేష్ఠులు. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠులు. మానవులలో బ్రాహ్మణులు శ్రేష్ష్ఠులు. " ( మను : 1 - 96 )
23. " బ్రాహ్మణులు పుట్టుచునే భూమియందు అందరికంటే గొప్పవాడుగా పుట్టియున్నాడు. సకల ప్రాణుల సమూహమునకు సంబంధించిన ధర్మ సమూహ సంరక్షణకు ప్రభువు. " ( మను : 1 - 99 ).
24. " భూతలమందున్న సమస్తమూ బ్రాహ్మణుడిదే. బ్రహ్మ ముఖము నుండి జన్మించుట చేతను, వర్ణమున ఉత్తమవర్ణం అగుట చేతను బ్రాహ్మణుడు సర్వ ధనమునకు అర్హుడు అగుచున్నాడు. " ( మను : 1 - 100 )
25. " బ్రాహ్మణుడు తన ధనమునే తాను అనుభవించు చున్నాడు. తన వస్త్రమునేబతాను ధరించు చున్నాడు. తన ధనమునే ఇతరులకు ఇచ్చుచున్నాడు. లోకమందలి సర్వస్వము అంతా అతనిదే. బ్రాహ్మణుని దయాగుణము వలననే ఇతరులు అతని సర్వస్వమును అనుభవించు చున్నారు. ( మను : 1 - 101 )
26. " హితమైనా, అహితమైనా అగ్ని ఎట్లు మహిమాన్వితమో, అట్లే పండితుడైనా, మూర్ఖుడైనా బ్రాహ్మణుడు ప్రకృష్టమైన దేవుడు." ( మను : 9 - 317 )
27. " బహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా పై మూడు ద్విజ వర్ణాలకు గుణనింద చేయక వారికి శుశ్రూష ( సేవ ) చేయటం". ( మనుస్మృతి 1 - 91 )
28. " శూద్రుడు ధనము సంపాదించ కూడదు. అతడు ధనం సంపాదించి యెడల బ్రాహ్మనులను హింసించును. " ( మను 10 - 129 )
29. " ,బ్రాహ్మనుడు ఎప్పుడైనా సందేహచకుండా శూద్రుని సంపదు, వస్తువులను బలవంతంగానయినా స్వాధీనం చేసుకోవచ్చును. ఎందుకనగా శూద్రునికి స్వంత ధనం అంటూ ఏదీ లేదు కదా." ( మను 8 - 417 )
30. " బ్రాహ్మనులకు సేవకులుగా ఉండటమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటి రాదు. " ( 10 - 123 )
31. " జీతభత్యాల ప్రమేయం లేకుఢా బ్రాహ్మణుడు శూద్రులతో సేవలు చేయించుకోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మనులకు బానిసలుగా ఉండటానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు. " ( మను 8 - 413 )
32. " బ్రాహ్మనుడు తినగా మిగిలిన ఎంగిలి అన్నాన్ని, చికిగిపోయిన పాతబట్టలను, పాత సామానును శూద్రులకివ్వాలి. " ( మను 10 - 125 )
33. " శూద్రుడు బ్రాహ్బనున్ని దూషిస్తే ఎర్రగా కాల్చిన పది అంగుళముల ఇనుపకడ్డీతో వాని నాలుకను కాల్చాలి. " ( మను 8. 271 )
34. " ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతని నోటిలో , చెవుల్లో మరిగించిన నూనె పోయాలి. " ( మను 8 - 272 )
35. " బ్రాహ్మనునితో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులను కోసివేయాలి లేదా కాల్చిన ఇనుప కర్రుతో కాల్చాలి. " ( మను 8 - 281 )
36. "శూద్రుడు బ్రాహ్మనున్ని చూస్తూ మూత్రం పోస్తే వాని అంగమును ఛేదించి వేయాలి. ఉమ్మివేస్తే పెదవులు ఖండించాలి. పిత్తితే గుదమును కోయాలి. " ( మను 8 - 282)
37. " బ్రహ్మనున్ని శూద్రుడు ఏ అంగంతో బాధిస్తాడో ఆ అంగాన్ని ఖండించివేయాలి. " ( 8 - 283 )
38. " శూద్రుని సమక్షంలో వేదాలు పఠించరాదు. " (మను 4 - 99 )
39. " బ్రాహ్మనుని పేరు శుభప్రదమైనది గాను, క్షత్రియుని పేరు శక్తి సూచకంగానూ, వైశ్యుని పేరు సంపద సూచకంగానూ, శూద్రుని పేరు హేయమైనదిగానూ ఉండవలెను. " ( మను 2 - 31 )
40. " బ్రాహ్మనున్ని సేవించిన శూద్రుడు మరో జన్మలో ఉత్తమ కులంలో జన్మించును. " ( మను 9 - 3 35 )
41. బ్రాహ్మనోస్య ముఖమాసీత్, బాహూ రాజన్య కృతః
ఊరూ తదస్య యద్ వైశ్య పదభ్యాగ్ శూద్రో ఆజాయతః . ( ఋగ్వేదం : 10 - 90 - 12 )
విరాట్పురుషుని ముఖం నుంచి బ్రాహ్మణుడు, బాహువుల నుంచి క్షత్రియుడు, తొడల నుంచి వైశ్యుడు, పాదాల నుంచి శూద్రుడు పుట్టారు.
42. లోకానాం తు వివృద్ధ్యర్థం ముఖబాహూరుపాదతః,
బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం చ నిరవర్తయత్ . ( మనుస్మృతి : 1 - 31 )
భూలోకవిస్తారము గోరినవాడై, బ్రహ్మ తన ముఖము, బాహువు, తొడలు, పాదములు వీని నుండి వరుసగా బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, శూద్రులను సృజించెను.
43. ఏకమేవ తు శూద్రస్య ప్రభుః కర్మ సమాదిశత్,
ఏతేషా మేవ వర్ణానాం శుశ్రూషామనసూయయా. ( మనుస్మృతి : 1 - 91 )
44. ధర్మోపదేశం దర్పేణ విప్రానామస్య కుర్వతః,
తప్తమానేచయేత్తైలం వక్త్రే శ్రోత్రే చ పార్థివః. ( మనుస్మృతి : 8 -272 )
బ్రాహ్మణునికి ఎదురు ధర్మం చెపితే వాడి నోటిలో, చెవుల్లో మరిగించిన నూనె పోయాలి.
45. చండాలశ్వపచానాం తు బహిర్గ్గ్రామాత్ప్రతిశ్రయః
అపపాత్రాశ్చ కర్తవ్యా ధనమేషాం శ్వగర్దభమ్, ( మనుస్మృతి : 10 - 51 )
46. వాసాంపి మృతచేలాని భిన్నభాండేషు భోజనమ్,
కార్ష్ణాయనమలంకారః పరివ్రజ్యా చ నిత్యశః. ( మనుస్మృతి : 10 - 52 )
చండాలురు శ్వపాకులుగా గ్రామమునకు వెలుపలనే నివాసము. వీరికి కుక్కలు, గాడిదలే ధనము. పీనుగలపై గల చస్త్రములే వీరికి బట్టలు. పగిలిన కుండపెంకులలో వీరు భుజించాలి. ఇనుప సామానే వీరికి ఆభరణములు.
47. బ్రాహ్మణున్ని నిందించే శూద్రుని నాలుకను కోసివేయాలి. ఎందుకంటే అతడు నీచ జన్ముడు. ( మను : 8 - 270)
48. బ్రాహ్మణుని కులాన్ని, పేరును నిందించిన శూద్రుడి నోట్లో పదివేళ్ళ పొడుగిన్న ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి దూర్చాలి . ( మను : 8 - 271 )
49. శూద్రుడు ఆస్థి సంపాదించ రాదు. అది బ్రాహ్మణునికి అపకారం కలొగిస్తుంది. ( మను : 10 - 129 )
50. శూద్రుడు బ్రాహ్మణునితో ఆతని పక్కన కూర్చొనడానికి ప్రయత్నిస్తే వాడి ముడ్డిని కాల్చివేయాలి లేదా కోసివేయాలి. ( మను : 8 - 281)
ఇది హిందూమత ధర్మశాస్తరం అయిన మనుస్మృతి. దీని ప్రకారమే నాడు పరిపాలన జరిగేది. బ్రిటిష్ వారు వచ్వే వరకు ఇదే మనకు Penal Code. బ్రిటిష్ వాడు వచ్చి ఈ దుర్మార్గపు చట్టాన్ని రద్దు చేశాడు.
బాబాసాహెబ్ ఈ దుర్మార్గ ధర్మశాస్త్రాన్ని 1927 డిసెంబర్ 25 న తగలబెట్టి దహనం చేశాడు. అందువల్ల SC, ST, BC లకు డిసెంబర్ 25 ఒక పండుగ రోజు. ఆ పండుగను మనమందరం జరుపుకోబాలి.
-------------------------------------------------------------------
సమతా సైనిక.దళ్ సౌత్ ఇండియా సౌజన్యంతో...

No comments: