"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

29 జులై, 2013

సెంట్రల్ యూనివర్సిటీ లో కలేకూరి ప్రసాద్ నివాళి సభ




నిన్న ( 29-07-13) హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ, లైబ్రరీ లాన్ లో ప్రముఖ దళిత కవి, ఉద్యమకారుడు కలేకూరి ప్రసాద్ నివాళి సభ జరిగింది.
పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ, ఫిలాసపీ విభాగంలో అసిస్టెంటు ప్రొఫెసర్ డా. పి. కేశవకుమార్ చొరవతో ఈ సభను అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారు నిర్వహించారు. సభకు ఆచార్య తుమ్మల రామకృష్ణ అధ్యక్షత వహించారు. సభలో నాతో పాటు డా. పి.కేశవకుమార్, డా. శ్రీపతిరాముడు, కత్తికళ్యాణ్ వక్తలుగా పాల్గొన్నారు. కలేకూరిప్రసాద్ పై బహుజనకెరటాలు ప్రచురించిన ప్రత్యేకసంచికను, అలాగే ఆయన రాసిన వ్యాసాల సంకలనాన్ని ఈ సందర్భంగా సభలో ఆవిష్కరించారు. మే 17వ తేదీ, 2013న మరణించిన కలేకూరి ప్రసాద్ జీవితాన్ని, ఆయన రచలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆదివారం అయినప్పటికీ, విద్యార్థినీ, విద్యార్థులు బాగానే వచ్చారు. విశ్వవిద్యాలయంలో కలేకూరిప్రసాద్ కి ఈ విధంగా నివాళి అర్పించడం నిజంగా ఆయనకిచ్చే నిజమైన గౌరవమనిపించింది.

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

కలేకూరి ప్రసాద్ స్మృతికి ఒక విశ్వవిద్యాలయంలో నివాళి సమర్పించడం సముచితం!

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

ముందుగా తెలిస్తే నెనూ వచ్చేవాణ్ణి

నిన్న 28.7.2013 ఆదివారము