ఎం.ఏ.,తెలుగు లో Techniques of Writing a Thesis/Dissertation అనే కోర్సు తీసుకున్న విద్యార్ధులు తమ ప్రాజెక్టు రిపోర్టులను ఏప్రిల్ 28 వతేదీలోగా కోర్సు ఇన్ స్ట్రక్టర్ డా.దార్ల వెంకటేశ్వరరావుగార్కి సమర్పించాలి. ప్రాజెక్టుకి రాయాల్సిన సర్టిఫికెట్, డిక్లరేషన్ సర్టిఫికేషన్ ల మోడల్ కోసం ఈ https://vrdarla.blogspot.in/2017/04/project-submission-model.html లింకుని చూడండి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు విశ్వవిద్యాలయంలో పి.జి., పిహెచ్.డి., ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి 5 మే 2017 చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు http://acad.uohyd.ac.in/ వెబ్ సైట్ ని దర్శించవచ్చు.

సెంట్రల్ యూనివర్సిటీ లో కలేకూరి ప్రసాద్ నివాళి సభ
నిన్న ( 29-07-13) హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ, లైబ్రరీ లాన్ లో ప్రముఖ దళిత కవి, ఉద్యమకారుడు కలేకూరి ప్రసాద్ నివాళి సభ జరిగింది.
పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ, ఫిలాసపీ విభాగంలో అసిస్టెంటు ప్రొఫెసర్ డా. పి. కేశవకుమార్ చొరవతో ఈ సభను అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారు నిర్వహించారు. సభకు ఆచార్య తుమ్మల రామకృష్ణ అధ్యక్షత వహించారు. సభలో నాతో పాటు డా. పి.కేశవకుమార్, డా. శ్రీపతిరాముడు, కత్తికళ్యాణ్ వక్తలుగా పాల్గొన్నారు. కలేకూరిప్రసాద్ పై బహుజనకెరటాలు ప్రచురించిన ప్రత్యేకసంచికను, అలాగే ఆయన రాసిన వ్యాసాల సంకలనాన్ని ఈ సందర్భంగా సభలో ఆవిష్కరించారు. మే 17వ తేదీ, 2013న మరణించిన కలేకూరి ప్రసాద్ జీవితాన్ని, ఆయన రచలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆదివారం అయినప్పటికీ, విద్యార్థినీ, విద్యార్థులు బాగానే వచ్చారు. విశ్వవిద్యాలయంలో కలేకూరిప్రసాద్ కి ఈ విధంగా నివాళి అర్పించడం నిజంగా ఆయనకిచ్చే నిజమైన గౌరవమనిపించింది.

2 comments:

surya prakash apkari said...

కలేకూరి ప్రసాద్ స్మృతికి ఒక విశ్వవిద్యాలయంలో నివాళి సమర్పించడం సముచితం!

జాన్‌హైడ్ కనుమూరి said...

ముందుగా తెలిస్తే నెనూ వచ్చేవాణ్ణి

నిన్న 28.7.2013 ఆదివారము