"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

21 September, 2010

సాహిత్యాన్ని సాహిత్యంగానే ఆస్వాదిస్తున్నామా?

 
సమకాలీన సాహిత్య ధోరణుల్ని గురించి మాట్లాడు కుంటున్నప్పుడు చాలా మంది సాహిత్యా న్ని సాహిత్యంగా ఆస్వాదించగలుగుతు న్నామా అనే అభిప్రాయాల్ని వ్యక్తంచేస్తున్నారు. సాహిత్యం వివిధ వాదాల తో నిండిపోయిందంటున్నారు. ఇటువంటి స్థితి ఈ మధ్య కాలంలోనే కనబడుతోందా, లేక ఇంతకు ముందు కూడా ఉందా? అనే ప్రశ్నకు సరెైన సమాధానం రాదు. ఒక కవితనో, కథనో, నవలనో లేదా మరేదెైనా ప్రక్రియను గాని మనం చదవడానికి ఎలా ఆకర్షితులౌతున్నామనే ప్రశ్న చాలా వింతగా ఉండొచ్చు గానీ, అది పఠనా సక్తికి సంబంధించిన చర్చకు ఎంతో కీలకమైంది.

ఒక రచనను చూసినప్పుడు దాని శీర్షికని లేదా రచయిత పేరుని బట్టి ఆకర్షితులవుతుంటారు. అంటే రచ నని చదివించేందుకు పాఠకుడికి రెం డు ప్రధానమైన ప్రభావాలు ప్రేరేపిస్తా యన్న మాట. ఆ ప్రేరణ వల్ల రచన చదివిన తర్వాత పాఠకు డిపెై రక రకాలెైన ప్రభావాల్ని కలిగించవచ్చు. రచయితకు పాఠకుడు అభిమానిగా మారిపోవడమో, వ్యతిరేకిగా తయార వ్వడమో ప్రారంభమౌతుంది. ఇలాంటి ప్రభావం పాఠకుణ్ని ఏదోక వర్గంలోకి చేర్చేస్తుందన్నమాట. అప్పుడు సాహి త్యాన్ని, సాహిత్యకారుల్ని వర్గీకరించడం మొదలవుతుంది. అలాంటి వర్గీకరణ నిజానికి పాఠకుణ్నుండి ప్రారంభమైందా, పాఠకుడి కంటే ముందే రచనాకారులే వివిధ వర్గాలుగా తమ రచనల్ని కొనసాగిస్తుంటారా? అనేది ఒక చర్చనీయాంశం.

రచనాకారులే ముందుగా ఏదో ఒక దృక్పథానికి కట్టుబడి రాస్తుంటారు. దాన్ని పాఠకులు చాలా కాలం తర్వాత గాని గుర్తించలేరు. అనేక రచనల్ని చదివిన తర్వాత ఆ రచనా కారుల్ని ఆయా దృక్పథాలకు చెందిన వారుగా వర్గీకరిం చుకుని కొన్ని అభిప్రాయాల్ని రూఢి చేసుకుంటారు. అంతే తప్ప పాఠకులే ముందుగా రచనాకారుల్ని వర్గీకరించరని ఒక వాదం రావచ్చు.అలాగే రచనా కారుల నుండి కూడా ఒక వాదన వస్తుంది. ఒకటి, రెండు లేదా కొన్ని రచనల్ని ఒక దృక్పథంతో రాసి నంత మాత్రం చేత ఆ రచనాకారుడి రచనలన్నీ అవే ధోరణి తో ఉంటాయనో ఏదో ఒక వర్గంలోకి చేర్చేసి, వాటిని చద వక పోవడం వల్ల పాఠకులకే నష్టమనే వాదన కూడా రా వచ్చు. ఇటువంటి సందిగ్ధావస్థలో మనకి విమర్శ కంటే సౌందర్యాధ్యయనం సాహిత్యాన్ని సాహిత్యంగా అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతుంది.
ఇది కేవలం ఒక సాహి త్యానికి మాత్రమే కాకుండా లలితకళ లన్నింటిలోని సౌంద ర్యాన్ని అన్వేషిస్తుంది.శ్చాత్య దేశాల్లో సౌందర్యశాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా జర్మనీ దార్శనికుడు అలెగ్జాండర్‌ గాట్లీవ్‌ భౌమ్‌ గార్టెన్‌ (1714-1762) నుండే గుర్తింపుపొందింది. సాహిత్యం లలి త కళల్లో ఒకటి. కేవలం సాహిత్యానికి మాత్రమే కాకుండా అసలు కళ కున్న తత్త్వాన్ని భౌమ్‌ గార్టెన్‌ అన్వేషించాడు. ఆనా టికి తత్త్వశాస్త్రంలో ఒక భాగంగా లలితకళలల్లో గల సౌం దర్య తత్త్వం గురించి అధ్యయనం జరుగుతుండేది. అలా కాకుండా ఇదొక ప్రత్యేక శాస్త్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని చాటడానికి ‘ఈస్థటికా’ అనే గ్రంథాన్ని రాశాడు భౌమ్‌ గార్టెన్‌. ఒక కళ మంచిదీ, చెడ్డదీ అని చెప్పడానికి పాఠకుడు/ శ్రోత దేన్ని ఆధారం చేసుకుంటాడనేది భౌమ్‌ గార్టెన్‌ చేసిన ప్రధాన అన్వేషణ. దానికి మానవుని ఙ్ఞానేం ద్రియాలే కారణమని గుర్తించాడు.

ఒక కళ ఉత్తమమైందో కాదో చెప్పడానికి రసాస్వాదన, రసానుభవం ముఖ్యమని భావించాడు. రసాస్వాదన ద్వారా పాఠకుడు రచన/ కళలోని సౌందర్య అస్తిత్వాన్ని పట్టుకోగలుగుతాడు. కాబట్టి సౌందర్యం రచనలో ఉంటుందా? రచన చేసే రచయితలో ఉంటుందా? రచనను ఆస్వాదించే పాఠకుడిలో ఉంటుందా? రచనను అభి వ్యక్తీకరించడం వల్ల సౌందర్యం పుడుతుందా? సౌందర్యానికి అభివ్యక్తి కంటే తీసుకునే వస్తువే ప్రాధాన్యతను వహిస్తుందా? ఇలాంటి ప్రశ్నలన్నీ పాఠకుణ్ని, రచనాకారుణ్ని కేంద్రంగా చేసుకున్నప్పుడు రచనలోని మంచి, చెడులు బహిర్గతమ వుతాయి. అయితే ఇవన్నీ వ్యక్తికీ, వ్యక్తికీ మధ్య అనుభూతిలో వివిధ భేదాల్ని పట్టిస్తాయి.

పాఠకుడు ముందుగానే కొన్ని ఉద్దేశాల్ని నింపుకున్న దృష్టితో రచనను చదివితే నిజమైన సౌందర్యం ఆస్వాదన లోకి రాదు.అంతే కాకుండా ఒక రచన లేదా కళలో గల సౌందర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలగాలంటే ఏంచే యాలనే విషయంలో పాశ్చాత్యులే కాకుండా మన భారతీ యులు కూడా విశేషమైన కృషినే చేశారు. కాకపోతే భరతు డు రస సిద్ధాంతాన్నీ, భామహుడు అలంకారాల్నీ, దండి గుణాల్నీ, ఆనందవర్థనుడు ధ్వనినీ, అభినవగుప్తుడు సహృ దయుణ్నీ, కుంతకుడు వక్రతనీ, క్షేమేంద్రుడు ఔచి త్యాన్నీ, హేమచంద్రుడు చమత్కారాన్నీ, రాజశేఖరుడు సాహిత్య తత్త్వాన్నీ అన్వేషించడంలో ఈ దృష్టి చాలా వరకూ కనిపిస్తుంది. వీరి దృష్టి ప్రధానంగా లలిత కళల్లోని కొన్ని కళలకే పరిమితం కావడం, సౌందర్యాన్వేషణలో ఇంద్రియా నుభూతినే ముఖ్యాంశంగా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనించాల్సి ఉంది.

భారతీయులు కళల పట్ల ప్రకటించిన భావాలు సాహిత్య సిద్ధాంతాలుగా ప్రాచుర్యంలో కివచ్చాయి .రససిద్ధాంతంలో రసాస్వాదనకు సంబంధించి రసం నాయకాశ్రీతమనే భట్ట లోల్లటుని ఉత్పత్తి వాదం గానీ, నటుడిలోనే రసం ఉంటుం దనే శ్రీ శంకుకుని అనుమితి వాదం గానీ, రసం సామాజి కుడిలోనే ఉంటుందనే భట్టనాయకుని భుక్తివాదంలో గానీ, రసం సహృదయునిలోనే ఉంటుందనే అభినవగుప్తుని అభి వ్యక్తి వాదాల్ని గానీ లోతుగా పరిశీలిస్తే ఎంతలోతెైన అధ్యయనం జరిగిందో తెలుస్తుంది. ఏవో కొన్ని కళలకే సూత్రాల్ని పరిమితం చేయడం వల్ల సాహిత్య సిద్ధాంతా లుగానే ప్రచారంలోకి వచ్చాయి. పాశ్చాత్య దేశాల్లో సౌంద ర్యాస్వాదన ప్రధానంగా ఇంద్రియ చెతన్యంపెైనే ఆధారప డినట్లుగా అధ్యయనాన్ని కొనసాగించడం, దాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా పిలవడం వల్ల కళాతత్త్వ (సౌందర్య) శాస్త్రానికి భౌమ్‌ గార్టెన్‌ ఆద్యుడయ్యాడు.

వివిధ రూపకాలకు సమన్వ యమైయ్యేటట్లు రససిద్ధాంతాన్ని ప్రతిపాదించి భరతుడు (క్రీ.పూ.1- 5 వ శతాబ్ధి) పాశ్చాత్యుల కంటే ముందే ఆ రంగంలో కృషి చేసినా, రూపక ప్రదర్శన మత దృష్టితో జరిగిందనే వాదనలున్నాయి. అయినా తర్వాత ఆ సూత్రాలు చాలా వరకూ కావ్యాలకు, ఇతర ప్రక్రియలకు కూడా అన్వ యించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే నవల ను కూడా రస సూత్రంతో విశ్లేషిస్తూ ఒక గ్రంథం వెలు వడటం విశేషం! ఇలాంటి కృషి వల్ల సాహిత్యాన్ని సాహిత్యంగా అవగాహన చేసుకునే అవకాశం కలుగు తుంది. తెలుగులో పురాణం సూరిశాస్ర్తి (విమర్శక పారి జాతం) 1925 నాటికే సౌందర్య దృష్టితో సాహిత్యాన్ని చూడా ల్సిన అవసరం ఉందన్నాడు. ఆ తర్వాత పాశ్చాత్య, ప్రాచ్య సౌందర్య సూత్రాలతో కళల్ని అవగాహన చేసుకునే పద్ధతిని సంజీవ్‌దేవ్‌ అందించాడు. సౌందర్యశాస్త్ర దృష్టిని అలవరు చుకోగలిగినప్పుడు సాహిత్యాన్ని సాహిత్యంగానే చూడ గలుగుతాం.

సౌందర్య శాస్త్ర చర్చలో క్రోచీ (1866 - 1952) మరిన్ని అంశాల్ని లోతుగా చర్చకు పెట్టి ఙ్ఞానాన్ని రెండు రకాలుగా చెప్పి అతీంద్రియ ఙ్ఞానమే కళావిర్భావానికి మూలమనీ, దాన్ని అభివ్యక్తీకరించి తార్కిక ఙ్ఞానంతో సౌందర్యాస్వాదన చేస్తుంటారనీ, అది భౌతిక సౌందర్య మౌతుందనీ చెప్తాడు. అతీంద్రియ ఙ్ఞానంతో కూడిన భావుకత సహకారం లేకపోతే ఏ కళా సౌందర్య భరితం కాదంటాడు. ఇలా దీన్ని శాస్త్ర స్థాయికి తీసుకు రావడంలో విశేషమైన కృషిచేశాడు. ఈ కృషి కొనసాగించడంలో హెగెల్‌ ( 1770 - 1831) మానవ మనసులో మూడు పొరలుంటాయనే ఆలోచన ప్రభావం క్రోచీ భావాల్లో దాగి ఉంది. మానవ మనసులో మూడు దశ లుంటాయి. ఆత్మాశ్రయ మనసు, వ్యక్త్యాశ్రయ మనసు, కేవల మనసు అనే వాటిలో కేవల మనసు రాగద్వేషాలకు అతీతంగా కళని ఆస్వాదించగలిగేటట్లు చేస్తుందంటాడు హెగెల్‌.

ఇలా సౌందర్య తత్త్వం గురించి జరిగిన చర్చలో ఇమ్మానుయేల్‌ క్యాంట్‌ (1724-1804) ఒక వస్తువు కల్గించే ఆనందం అపేక్ష, అభిమానం, గౌరవం అనే అంశాలపెై ఆధారపడి ఉంటుందంటాడు. కళని ఆనందించా లంటే ప్రయోజనాపేక్ష ఉండకూడదంటాడు. శాంతాయన (1863-1952) వివరించడానికి వీలులేని స్పందనలోంచి, ప్రత్యక్షంగా మన స్వభావంలో ఉన్న అతార్కిక భూమికలోంచి కళకు విలువ ఏర్పడుతుందని, దేన్నెనా పాఠకులు/ శ్రోతలు కోరుకుంటున్నారు కనుక,అదిమంచిదవుతుందంటాడు.ఇలాంటి వాదోప వాదాలనుండే కళ కళ కోసమా, కళ ప్రజల కోసమా? అనే ఆలోచనలు ప్రారంభమైయ్యాయి.

ప్రాచీన భావాలు గల మన భారతీయులు కళల్ని ఆధ్యా త్మిక దృష్టితో చూపించే ప్రయత్నం చేశారు.ఆధునిక భావా లు గల వాళ్ళు కళకి ప్రయోజనం ఉండాలనీ, అది సామాన్యుల ప్రయోజనాల్ని కాపాడేదిగా ఉండాలన్నారు. సహజంగానే ప్రయోజనాపేక్ష ప్రవేశించినప్పుడు అది అందరిదీ అవ్వడం సాధ్యం కాదు. కాకపోతే అత్యధికులదో, అల్పసంఖ్యాకులదో అవుతుంది. అంతే కాదు, అది ఆదరణ కు కూడా నోచుకోక పోవచ్చు. ఆ రంగంలో ఆ రకమైన కళనీ లేదా రచననీ బలపరిచే మేధోపరమైన సంఖ్య లేకపోవడం ఒక ప్రధాన కారణం. అటువంటి రచనల్ని ఆదరించే సంస్థ లు లేదా వ్యక్తుల సంఖ్య పెరిగినప్పుడు ఒకానొకప్పుటి మేధా వులు పెదవులు విరిచి ఆ రచనల్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తుంటారు. అందువల్ల అంతకు ముందు కూడా తమకి నచ్చిన, తమకు అనుకూలమైన దాన్నే ప్రజలపెై రుద్దామనే స్పృహలేకుండా రచనల్లో విలువల్లేవనే తీర్పు లిస్తుంటారు. అందుకనే సాహిత్యాన్ని సాహిత్యంగా ఆదరించలేని స్థితికి చేరుకుంటారు.
మన తెలుగు సాహిత్యంలో విశ్వనాథకు దక్కిన గౌరవం గుర్రం జాషువాకి దక్కక పోవడానికీ సాహితీ మేధావుల్లో ఇలాంటి సూత్రీకరణలెన్నో ఉన్నాయి. మారుతున్న కాలంతో పాటు భావజాలంలోను మార్పులొస్తాయని గమనించ గలిగిన సాహితీ మేధావుల్లో కూడా ఇప్పుడిప్పుడే అనివా ర్యంగా అంగీకరించే స్థితి వస్తుంది. అది ఇంకొంచెం వేగవం తమైతే సాహిత్యాన్ని సాహిత్యంగా ఆస్వాదించగలిగే వారి సంఖ్య మరింతగా పెరుగుతుంది. సాహిత్యానికున్న నిజమైన ప్రయోజనం నెరవేరుతుంది.---డా దార్ల వెంకటేశ్వరరావు

3 comments:

Afsar said...

దార్ల:

మంచి వ్యాసం. ఇలాంతి విషయాలు మరింత చర్చకి రావలసి వుంది.

అఫ్సర్

vrdarla said...

thank you sir
darla

S Swaroop Sirapangi said...

Very good article, publishable in any reputated academic journal, and needless to mention, scholars can debate further.