రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఈ రోజే నాగప్పగారి సుందర్ రాజు వర్ధంతి

దఃళిత స్టూడెంట్స్ యూనియన్ వారు మాదిగ సాహిత్య ఉద్యమ కారుడు, కవి, కీ.శే. నాగప్పగారి సుందర్ రాజు వర్థంతి కార్యక్రమాన్ని హైదరాబాదు విశ్వవిద్యాలయంలో నేడు (17-7-2010) నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం గం. 3 .- 30 నిమషాలకు పరిశోధక విద్యార్ధిని హేమలత అధ్యక్షతన అంబేద్కర్ ఆడిటోరియమ్ లో జరుగుతుందని దఃళిత స్టూడెంట్స్ యూనియన్ వారు ఒక ప్రకటనలో వివరించారు. ఈ కార్యక్రమంలో డా. దార్ల వెంకటేశ్వరరావు డా.కదిరి కృష్ణ, డా. జిలుకర శ్రీనివాస్‌ , డా. శ్రీపతిరాముడు తదితరులు పాల్గంటారు. సుందర్‌ రాజుకి సంబంధించిన వివరాలు కావలసిన వారు డా. దార్ల వెంకటేశ్వరరావు రాసిన ‘‘ ఒక మాదిగ స్మృతి ( నాగప్పగారి సుందర్రాజు పరిచయం) పుస్తకాన్ని చదివి తెలుసుకోవచ్చు. అది ఇంటర్నెట్‌ లో ఉచితంగా అందుబాటులో ఉంది.
1 comment:

Afsar said...

నాగప్ప ని గుర్తు చేసినందుకు సంతోషం/దిగులూ రెండూ కలిగాయి. అతని రచనల్ని తలుచుకోవడం ఎప్పుడూ సంతోషం. అతని అర్ధాంతర నిష్క్రమణ ఎప్పుడూ దిగులు. నాగప్ప లాంటి దళిత వచనం వస్తుందా అని ఇంకా ఎదురుచూస్తున్నాను. అనంతపురం మాదిగ్గేరిని తన చక్కని వచనపు టద్దంలో ప్రతిఫలించిన నాగప్ప రచనలు సమగ్ర సంపుటంగా రావాలేమో?!

afsar
afsartelugu.blogspot.com