రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

సాహితీ సులోచనం ( దార్ల సమీక్ష వ్యాసాల పుస్తకం)

సాహితీ సులోచనం ( సాహిత్య సమీక్ష వ్యాసాలు) పుస్తకాన్ని 2006 లో ప్రచురించాను. దీనికి సంబంధించిన పరిచయాన్ని ఆ పుస్తకానికి రాసిన ముందు మాటలో రాశాను. దాన్ని ఇక్కడ పేర్కొంటున్నాను. ఈ పుస్తకాన్ని ప్రజా ప్రయోజనార్థం ఉచితంగా డౌను లోడు చేసుకోవడానికి వీలుగా కింది అందిస్తున్నాను.

--దార్ల
Sahitee Sulochanam Book Vrdarla

"వివిధ ప్రక్రియలకు సంబంధించిన రచనలను చదువుతున్నప్పుడు పుస్తకాలను ఇతరులు కూడా చదివితేబాగుంటుందనుకున్నాను. ఆ ఆలోచనతో వాటిని పత్రికలకు, ఇంటర్నెట్లో ఆన్లైన్పోర్టల్స్ కీపంపించాను. వాటిలో కొన్ని సమీక్షా వ్యాసాలను ఎంపిక చేసి పుస్తకం రూపంలో తీసుకొస్తున్నాను. దీనిలో పద్య, వచన, దీర్ఘ కవిత్వానికి సంబంధించిన పుస్తకాల పరిచయం ఉంది. నేడు పత్రికల్లోసాహిత్యానికీ, అదీ గ్రంథ సమీక్షకు చాలా తక్కువ స్థలాన్ని కేటాయిస్తున్నారు. పరిస్థితుల్లో ఒక పుస్తకంగురించే సుదీర్ఘమైన వ్యాసాలు రావడం చాలా అరుదు. అందువల్ల కేవలం సమీక్షగానే కాకుండా పూర్తివిమర్శ వ్యాసంగా కూడా ఒక్కొక్క పుస్తకం గురించి రాసిన వ్యాసాలు ఇందులో ప్రచురించడం ఒక విశేషం. సమీక్షలో వస్తు, శిల్ప విషయాలతో పాటు ప్రధానమైన దృక్పథాన్ని కూడా లోతుగా చర్చించడానికి చేసినప్రయత్నం దీనిలో కనిపిస్తుంది.

కొన్ని సార్లు పుస్తకం చిన్నదిగా కనిపించవచ్చు. కానీ, దానిలో ప్రతిపాదించిన అంశాలు చాలా బలమైనవిగా ఉండవచ్చు. అలాంటి పుస్తకాలను దీనిలో పరిచయం చేసే ప్రయత్నం చేశాను.

నా భావాలను, నాకు కలిగిన అభిప్రాయాలను మీతో పంచుకోవడానికీ, పుస్తకాల గురించి తెలియని వారికి పరిచయం చేయడానికీ ఇదొక అవకాశం అనుకుంటున్నాను. వీటిని ఇంతకుముందే పత్రికల్లో, ఇంటర్నెట్లోనూ ప్రచురించినా, అన్నీ ఒక చోట ఉంటే మరింత బాగుంటుందనీ భావించాను. వీటిని పునర్ముద్రిస్తున్నప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేశాను. అవి అక్షర వాక్యగత దోషాలను సరిచేయటమే తప్ప భావాలలో చేసిన మార్పులు కాదు. ఇన్ని ఆలోచన ఫలితమే మీ చేతిలో ఉన్న పుస్తకం. దీన్ని చదివి మీ అభిప్రాయాలను నాతో కూడా పంచుకుంటారని ఆశిస్తున్నాను.

- దార్ల వెంకటేశ్వరరావు"


No comments: