ఇప్పుడు కావాల్సింది
ధారాపాతమై కురవడం కాదు
అగ్ని నేత్రమై మండాలి!
ఇప్పుడు కావాల్సింది
గుండె ద్రవించడం కాదు
వజ్ర సంకల్పం అందించాలి!
ఇప్పుడు కావాల్సింది
జాలితో ఊడ్చేయడం కాదు
నెత్తుటి పువ్వుల్ని ధరించడం!
నిన్నటి వరకున్న "పునాది" వేరు
నేటి ఉపరితల రెపరెపలు వేరు
నిస్సారమవుతున్న వేం?
"పెంట"లో పరిమళం చేరింది
కులం వాసన గుర్తించాలి!
ఇప్పుడు కావాల్సింది
ఒంటి చేతి తప్పట్లు కాదు
కరచాలన చేసీ
విరిచే నొసటి విరులు కాదు
మేధో కార్ఖానాలు మార్మోగాలి!
--డా// దార్ల వెంకటేశ్వరరావు
( ఈ కవిత ప్రజాసాహితి మాసపత్రిక ఏప్రియల్,2006,pg:58 లో ప్రచురితం)
( వేంపెంట లో మాదిగల పై భూస్వాములు సాగించిన మారణ కాండకు ప్రతీకారం తీర్చుకున్న మావోయిష్టుల స్పందన అనంతరం...)
1 కామెంట్:
chaalaa baagaa raasaru ...
కామెంట్‌ను పోస్ట్ చేయండి