"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

20 March, 2007

సాంబయ్య గుండి మెడ పుస్తకం పై అభిప్రాయాలు

(సాంబయ్య గుండిమెడ గారి పుస్తకం పై జరిగిన చర్చ ఒక చారిత్రక ప్రాథాన్యతను సంతరించుకున్న దృష్ట్యా దాన్ని సాధ్యమైనంత వరకూ యథాతథంగా ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాను. - దార్ల )


F A M U S said...
very nice initiative and congratulations-thelugodu
spandana said...

దార్ల గారూ,"లండన్ లో వుండీ.." అని వుండేసరికి నాకు టైటిల్ ఎత్తిపొడుపులా వినిపించిందడి. మీరు "మాదిగలపై పరిశోధన" అని చెప్పివుంటే సరిపోయేది. లండన్‌లో వుండటం అధికమైన అర్హత అన్నట్టుగా ద్వనించింది.అయితే ఇప్పుడు పుస్తకం చదువుతుంటే అర్థం అయ్యింది అతనూ దళితుడే అని.
--ప్రసాద్
http://blog.charasala.com
10:41 AM


తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం said...
బ్రాహ్మణీయ కులాలు బ్రాహ్మణత్వం అని బ్రాహ్మణుల్ని విలన్లని చేసి మాట్లాడుతున్నారేంటి ఆ పరిశోధనలో ? దళితులు ఎంత పేదవర్గమో వేలాది సంవత్సరాల నుంచి బ్రాహ్మణులు కూడా అంతే పేదవర్గం. చదువులేని బ్రాహ్మణుడికి ఏ రెడ్డీ ఏ రాజూ అన్నం పెట్టలేదు. రాజరికాల్లో కూడా బ్రాహ్మణులకి కులప్రాతిపదికమీద ఆటోమాటిక్ రిజర్వేషన్లు ఏమీ కల్పించబడలేదు. బౌద్ధంలోకి క్రైస్తవ్యంలోకి మారినవాళ్ళకి హిందువుల్ని హిందూత్వాన్ని బ్రాహ్మణుల్ని విమర్శించే అర్హత ఉందా ?
1:45 AM



spandana said...
తాడేపల్లి గారూ,భలే సెలవిచ్చారండీ! ఒకడు చచ్చినా, ఒకడు పుట్టినా బ్రాహ్మణుడికే కదా దానాలు చేయాల్సింది? వాడు చదువుకున్నోడా కాదా అని ఎక్కడా లేదే? బ్రాహ్మణ హత్యను బహ్మ హత్య అన్నారు కానీ చండాలుడి హత్యను అనలేదే?బిచ్చక వృత్తిని బ్రాహ్మణులకు పవిత్రమైందిగా ఇతరులకు నీచమైందిగా కలిపించలేదూ? కనీసం ఒక బ్రాహ్మడికైనా ఆథిద్యమిచ్చిగానీ భోంచేయొద్దన్నారు గానీ దళితుడు కనపడితే మొహం చాటు చేసుకోలేదూ? ఈ సామాజిక గౌరవాలన్నీ చదువుకున్న బాపనికే లభించాయా?మన వేల ఏళ్ళ చరిత్రలో జ్ఞానబోధను తలెత్తుకున్న బ్రాహ్మలే అసలు విలన్లు అనడంలో ఎలాంటి అనుమానమూ లేదు. క్షత్రియుల పంచను చేరి ఆచారాలు, చట్టాలు, కర్మలూ, అగ్రహారాల దానాలు అన్నింటా తమకు ఆధిక్యం లభించేలా చేసుకొన్న విరు పేదలెలా అయ్యారు?
--ప్రసాద్
http://blog.charasala.com

Dear Darla,
Please find below Mr. Subramanyam's reponse to my initial response.
Thanks,
Sambaiah

సాంబయ్యగారూ మీ ఈమెయిల్ అందింది. మీ పుస్తకం మీద అన్ రిజర్వుడు కేటగరికి చెందిన మేము వ్యాఖ్యలు చేస్తే బావుండదు. ఎందుకంటే ఆది ప్రాథమికంగా SC రిజర్వేషన్ల వర్గీకరణకి సంబంధించినది కనుక. అదీ గాక మాకు కాస్తో కూస్తో మాలవారి కష్టసుఖాల గురించి తెలుసు గాని మాదిగవారి పరిస్థితుల విషయంలో అంతగా అవగాహన లేదు. కారణం -మా ఆస్తుల్ని గత 90 సంవత్సరాలుగా మాలవారే manage చేస్తున్నారు (మేం ఊళ్ళో ఉన్నా లేకపోయినా ). రాత కోతలు అవసరం లేని పరస్పర విశ్వాసం నువ్వంటే నువ్వు అనుకునే చనువు మా మధ్య ఉన్నాయి. నేను మీ పుస్తకాన్ని ఈమెయిల్లో మా అన్నగారైన డాక్టర్ తాడేపల్లి హరికృష్ణప్రసాద్ (అమెరికా) గారికి పంపాను. ఆయన దాన్ని చదివి ఏమన్నారంటే : Nowhere does this writer concede that all instiutions and civic bodies have fundamental roles & responsibilities, even before they set out to create social justice by distributing power among the underprivileged. A democratic government & its civic bodies exist to serve everyone's common needs. By subverting those institutional obligations with genetics-based employment & empowerment policies & corruption in the name of those policies, no common good can come out of it. As a part of the process, all employees of any institution are sworn to fulfil their institutional obligations. A large number of public institutions are raped & destroyed in the name of social eq uality, only next to the destruction by political power. Also missing from the argument is the value that individuals bring their jobs & institutions through their individual merit and efforts. It is fair and open to admit what Marx had said - human history is a record of power strifes. The privileged will continue to use institutions and instruments in their hands to continue their status of comfort & superiority. In a space & country where there are only two states - the oppressor and the oppressed, every one chooses to be the oppressor. Why is it that the desire to oppress on the part of a dalit is sacred, while the same on the part of an upper castesman is deplorable? The upper caste guy has as much a right to desire and dream to be a corporate chief or top IAS officer as a dalit. Even if a million from his clan & blood group were IAS officers or cardiac surgeons, it will not diminish his personal need to fulfil his aspirations. So, instead of seeing groups, clans, castes & sexes, I would urge Sree Samabayya to look at individuals. In a sense, Sree Sambayya seems to be a rare exception in his kind for conceding that heriditary reservations, as in vogue today, are no different from the heriditary caste-based privileges enjoyed in years past. He (Sree Sambayya) has a good Telugu writing style. I will write a personal letter to this writer some time very soon. నేను మీకు ఎందుకు ఈ ఉత్తరం రాాటున్నానో తెలియజేస్తాను. మీరు ఎంత intellectual sense లో వాదానని చెప్పినా Racism కి బదులు బ్రాహ్మనిజం వాడడం highly hurtful. ఈ రకమైన వాడుక అంబేడ్కర్ యుగపు అవశేషం. ఇది అప్పుడు గాని ఇప్పుడు గాని వాస్త వాల్ని ప్రతిబింబించినది కాదు. మీరు Racism యొక్క సమానార్థకాల్ని వదిలిపెట్టి ఆ అర్థంలో బ్రాహ్మనిజం బ్రాహ్మనీయ అనే పదాల్ని ఎంచుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బ్రాహ్మనిజం ఎక్కడా Racism ని ప్రతిపాదించి ఉండలేదు. పైపెచ్చు దానికి పూర్తి వ్యతిరేకమైన తత్వశాస్త్రం దానికి ఉంది. ఒక కులంగా చూసుకున్నా బ్రాహ్మణులు Racist లు కారు. బ్రాహ్మణులు 16 కులాల వారిని పెళ్లి చేసుకోవచ్చుననే ధర్మశాస్త్రాలున్నాయి. ఆ విధంగా బ్రాహ్మాణకులం రక్త శుద్ధి (blood purity) లో విశ్వాసించి రక్త శుద్ధిని పాటించిన కులం కాదు. పైగా ఇతర జాతులవారిని ఇతర దేశీయుల్ని అన్ని కులాలకన్నా ముందు వివాహం చేసుకున్న కులం బ్రాహ్మణులు. ఈనాడు దళితుల్ని వివాహం చేసుకుంటున్న కులం కూడా బ్రాహ్మణూలే. అంబేడ్కర్ గారి కాలంలో బ్రాహ్మనీయ బ్రాహ్మనిజం బ్రాహ్మానిక్ మొదలైన పదాలు చెడ్డ అర్థంలో వాడుకలోకి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. బ్రాహ్మణులు స్వాతంత్ర్యోద్యమంలో విరివిగా పాల్గొంటున్నారనే కారణం చేత వారిని ద్వేషించిన బ్రిటీషు ప్రభుత్వం వారిమీదికి ఇతర కులాల్ని ఉసి గోల్పడం. తత్ ఫలితంగా అంతకుముందు ఎన్నడూ లేని విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు బయలుదేరడం. అప్పటికీ కొందరు బ్రాహ్మణులు భూస్వాములుగా ఉండడం కొందరు రాజాస్థానాల్లో దీవాన్లుగా ఉండడం వల్ల కూడా ఈ తిరుగుబాటు న్యాయమైందనే భావన ప్రజల్లో కల్పించబడింది. రెండో కారణం ప్రజల్ని క్రైస్తవమతంలోకి మార్చడానికి బ్రాహ్మణులు అడ్డంగా ఉన్నారనే ఉద్దేశంతో ప్రభుత్వ అండదండలు గల మిషనరీలు బ్రాహ్మణుల్ని విలనైజ్ చేస్తూ రాసి ప్రపంచమంతటా పంచిపెట్టిన పుస్తకాలు. బ్రాహ్మణులు అంత దుర్మార్గులైతే అంబేడ్కర్ అనే ఇంటిపేరు అంబేడ్కర్ కి ఇచ్చింది ఎవరు ? అంబేడ్కర్ పెళ్లి చేసుకున్నది ఎవరిని ? మీరు ఎంత intellectual sense లో వాడామని చెప్పినా సరే, సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని ఒకసారి ఆలోచించండి. పదాల అర్థాన్ని ఒక బాలసుబ్రహ్మణ్యం నిర్ణయించ లేడు. ఆ వాడుకతో ముందుగాను చివరిగాను స్ఫురించేది బ్రాహ్మణ కులం. ఎందుకంటే దానికి ఉన్న ప్రాథమికమైన సామాజిక అర్థం బ్రాహ్మణ కులమే గనుక. దీని పరిణామాలు (implications) ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఉంటాయి.
1. (బ్రాహ్మణులు కులవ్యవస్థలో అందరిలాగానే ఒక భాగం కాగా ) కుల వ్యవస్థ ని సృష్టించినది బ్రాహ్మణులనే ప్రచారానికి దారితీస్తుంది.
2. తద్వారా జనాన్ని విడదీశింది బ్రాహ్మణులు.
3. కాబట్టి బ్రాహ్మణులు దుర్మార్గులు
4. కాబట్టి బ్రాహ్మణులు చెప్పేది ఏదీ కరెక్టు కాదు.
5. కనుక బ్రాహ్మణుల సాహిత్యాన్ని సంప్రదాయాల్ని బహిష్కరించాలి.
6. బ్రాహ్మణులు అమానుషులు కనుక వారిని బతకనివ్వకూడదు.
ఇలాంటి అభిప్రాయాలు specific జాతుల పట్ల మారణహోమాలూ సృష్టించే హిట్లర్ లని వారి చేతిలో బలైపోయే యూదుల్ని సృష్టిస్తాయి. కాదంటారా ? తన అభిప్రాయాల్ని పునస్సమీక్షించుకునే అవకాశాన్ని దేవుడు అంబేడ్కర్ కి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఆరు పదులు కూడా నిండ కుండానే కాలం చేశారు కనుక. కానీ ఆ కాలం నుంచి 60 ఏళ్లు ముందుకు వచ్చిన వాళ్ళంగా మనకి అలాంటి వాడుకల్ని పునస్సమీక్షించుకునే అవకాశం ఉంది. కాలానుగుణమైన పరివర్తన మార్క్సిజానికే తప్పలేదు. ఆయన చెప్పిన విషయాలతోనే మనం ఒక మిలీనియం గడపాలంటే సాధ్యపడదు. మేమిలా ఒకపక్క అన్యాయంగా బదనాం అవుతూంటే ఎవరితో చెప్పుకోమంటారు ? ఎవరితో చేతులు కలపమంటారు ? మరీ ఎక్కువ రాసి విసిగించినట్లున్నాను. మీ థీసిస్ విజయవంతంగా submit చెయ్యాలని ఆకాంక్షిస్తూ
భవదీయుడు
తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

వడ్లూరి కేశవా చారి said...
"బ్రాహ్మణిజం" అంటే ఏమిటో సరిగ్గా తెలియని వాళ్ళకి మంచి వివరణను అందించారు. కానీ ఆ ఎరుపు రంగుని మార్చేయండి. చదవడానికి సులువుగా ఉంటుంది.
5:49 AM
సత్యసాయి కొవ్వలి said...
వివరణ బాగుంది. కానీ చదివి ఓపికగా అర్ధం చేసుకొనే సామర్ధ్యం ఉన్న వాళ్ళతో సమస్య లేదు కానీ, సామాన్య జనానికి ఈ రకమైన పదజాలం లోని నిగుఢార్ధాలు అర్ధం కావు. ఇలాంటి ప్రయోగాలు అనర్ధాలకీ, అపార్ధాలకే ఎక్కువ తావిస్తాయి.


No comments: