( దళిత సాహిత్యానికి వెన్ను దన్ను గా నిలిచిన " దళిత మేని ఫెస్టో " కవితా సంకలనాన్ని తీసుకురావటంలో తన వంతూ కృషి చేసిన కవి, కథకుడు, పరిశోధకుడు, ప్రస్తుతం పాండిచేరి విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడు గా పనిచేస్తున్న డా . కేశవకుమార్ గారు ప్రచుంరిచమని పంపిన కవితను మీ రు చదవ బోతున్నారు. - దార్ల )
ఆడుగడుగో సూడు
పంట పొలాల మీద పడగలా విప్పిన
మాయా మచ్చేంద్రుడు
ప్రపంచం మీదకే విసిరేడో వురితాడు.
నేను తప్ప
మీకు మరో రాజుండకూడదని ఆజ్ఞ
ఓ ప్రపంచ ప్రజలారా! వింటున్నారా
నేనే సత్యమూనూ,జీవమూనూ, సమస్తమూనూ...
ఒక్కనేనే మీ కోసం -
వార్ ఎగనెస్ట్ టెర్రర్
వార్ ఫర్ ఫ్రీడం
వార్ ఫర్ డెమోక్రసీ
వార్ ఫర్ పీస్
అందమైన కట్టు కతల్తో
అంతర్జాతీయ ఆయుధాల వ్యాపారి
అహింసా పరమోధర్మ అరుపులు
అదుగో చూడు
జీవితమే యుద్ధమైనోడు
అన్నీ పోగొట్టుకున్నా
ఆత్మ గౌరవాన్ని చంపుకోలేని
ఎవడో ఆ వుక్కడు
కసాయి కత్తి అంచుం మింద నుంచు
నిధిక్కార గర్జన
వెయ్యినొక్క దేశాల్ని తిన్న
బకాసురుడి ముఖం మీద లాగి గుద్దినట్టు.
అదుగదుగో
ఇప్పుడు వాడొక్కడే కాదు
పడి లేస్తున్న ఆ వుక్కడూ...
ఎవడో ఆ వుక్కడూ
ఆకలికి మాడి మసయిపోయిన దేశమా
అడవి లేని ఆదిమ జాతో
అన్నీ... అన్నీ పోగొట్టుకున్న ఆ అమ్మాయో
అదృశ్యమైన భాషల ఆఖరి అక్షరమో
ఎన్‌కౌంటర్ల చావులు గాసిన నక్సలైటో
మబ్బుల్ని చీల్చుకొస్తున్న లాటిన్
అదిమి పట్టిన ఆక్రోశాన్ని ఎత్తి పట్టిన ఖురానో
అల్లకల్లోల అలల మీద పరుచుకున్న ఆల్‌జజీరానో
ఎవడో ఒకడువుకడు
అనేకమైఅనేకం
వుక్కటైప్రజాయుద్ధ పాటై
కాగితం పులి కోరలు పీకేందుకు
ప్రపంచ పటాన్ని చదును చేస్తూ...
అదిగదిగో చూడు-- డా.పి.కేశవ్ కుమార్ ,pkesav@gmail.comలెక్చరర్, పాండిచ్చేరి యూనివర్సిటి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి