నేనూ సొంత ఇంటి వాణ్ణయ్యానండోయ్!

మిత్రులారా!
నేనూ హైదరాబాదులో సొంతంగా ఒక ఇండిపెండెంట్ అపార్ట్ మెంటు కొనుక్కున్నాను. విజయదశమి నాడు గృహప్రవేశం చేశాను.
హైదరాబాదు చదువుకోవడానికి వచ్చింది 1995 లో...
ఉద్యోగం వచ్చింది 2001 లో....
ఇక్కడ అమ్మాయినే పెళ్ళి చేసుకున్నది 2002 లో...
ఇప్పుడు మా యూనివర్సిటీకి దగ్గర్లోనే ( శేరి లింగం పల్లి) స్వంత ఇల్లు 2009 లో...
మీ డౌట్ నాకు తెలిసిందిలే... పిల్లలే కదా... వాళ్ళకోసమే ఎదురు చూస్తున్నాం... ఇల్లంతా హడావిడి చేయాలంటే వాళ్ళే కదా కళా కాంతులు... అంత వరకూ మా విద్యార్థులే మా పిల్లలు.... మా వెలుగులు!

సదస్సులో డా.అద్దేపల్లి రామమోహనరావు గారు

జాతీయ సదస్సులో ప్రముఖ విమర్శకుడు డా. అద్దేపల్లి రామమోహన్ రావు గారు పాల్గొని మార్క్సిస్టు సాహిత్య విమర్శపై పత్రాన్ని సమర్పించారు. చివరి రోజున బాల్యం గురించి ఆయన పాడిన గజల్ అందరినీ ఆకట్టుకుంది.


జాతీయ సదస్సులో ప్రముఖ విమర్శకుడు డా. అద్దేపల్లి రామమోహన్ రావు గారు పాల్గొని మార్క్సిస్టు సాహిత్య విమర్శపై పత్రాన్ని సమర్పించారు. చివరి రోజున బాల్యం గురించి ఆయన పాడిన గజల్ అందరినీ ఆకట్టుకుంది.































జాతీయ సదస్సులో ఆచార్య అరుణకుమారి గారు!

ఆచార్య జి. అరుణకుమారి గారు సదస్సులో పాల్గొని ఒక సమావేశానికి అధ్యక్షత వహించారు. తరువాత ఒక పత్రాన్ని సమర్పించారు.
సమావేశంలో ఆచార్య అరుణకుమారి
సమావేశ వేదిక పై అరుణకుమారిగారు
పత్రసమర్పణ చేస్తున్న ఆచార్య అరుణకుమారి గారు
కొలీగ్స్ తో మాట్లాడుతున్న ఆచార్య అరుణకుమారిగారు
చూడవయ్యా... సర్టిఫికెట్ అంటే ఇలా ఉండాలని అంటున్నట్లున్న ఆచార్య అరుణకుమారిగారు

జాతీయ సదస్సులో ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎమిరిటస్ ప్రొపెసర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు జాతీయ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని, కీలకోపన్యాసం చేశారు. ఆ దృశ్యాలలో కొన్నింటిని ఇక్కడ ఇలా...

జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు
స్వాగతం పలికి అతిథులను పరిచయం చేస్తున్న ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు
సదస్సు లక్ష్యాన్ని వివరిస్తున్న డా.దార్ల వెంకటేశ్వరరావు


కీలకోపన్యాసం చేస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు

ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు మాట్లాడుతుంటే ఆలకిస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు
ప్రారంభ సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ప్రసంగాన్ని వింటున్న డా. కొలకలూరి మధుజ్యోతి తదితరులు

ప్రారంభోత్సవం సందర్భంగా చేసిన కీలకోపన్యాసం గురించి ఆచార్య ఇనాక్ గారితో చర్చిస్తున్న అధ్యాపక బృందం
ఆచార్యకొలకలూరి ఇనాక్ గారి అమ్మాయిలు డా ఆశాజ్యోతి, డా.మధుజ్యోతి గార్లతో డా. దార్ల , మంజుశ్రీ
ఆచార్యకొలకలూరి ఇనాక్ గారి అమ్మాయిలతో డా ఆశాజ్యోతి, డా.మధుజ్యోతి గార్లు
ప్రారంభోపన్యాసం చేస్తున్న ఆచార్య మోహన్ జి. రమణన్ గారు
వందన సమర్పణ చేస్తున్న డా.పిల్లలమర్రి రాములు గారు

తెలుగు సాహిత్య విమర్శ : నేటి ధోరణులు సెమినార్ లో ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు.

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ఈ సదస్సులో పాల్గొని రుబాయిత్, గజల్ ప్రక్రియల గురించి పత్రాన్ని సమర్పించారు. ఒక సదస్సుకి అధ్యక్షత వహించారు. వాటిలో కొన్ని ఫోటోలు.

తెలుగు సాహిత్య విమర్శ : నేటి ధోరణులు అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు. వేదిక పై ( ఎడమ వైపు నుండి) జె. రమేశ్ , డా. బాల శ్రీనివాసమూర్తి, డా. పిల్లలమర్రి రాములు, గుడిపాటి, భట్టు సుధాకర్
సదస్సులో పాల్గొన్న తర్వాత టీ విరామసమయంలో ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారితో ముచ్చటిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు
సదస్సులో పాల్గొన్న ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, డా. రాములు, ఆచార్య తుమ్మలరామకృష్ణ తదితరులు
టీ సేవిస్తూ విద్యార్థులతో ముచ్చటిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు మాట్లాడుతున్నప్పుడు సమావేశంలో పాల్గొన్న ప్రే క్షకులు
విద్యార్థులతో ముచ్చటిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్
ఆచార్య ఎండ్లూరి గారితో మాట్లాడుతున్న డా. జె.భీమయ్యగారు
వేదికపైకి వెళ్ళేముందు తనకెంతో ఇష్టమైన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారితో ఆచార్య ఎండ్లూరి గారు ఆనందంగామాట్లాడుతూ...
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారితో ముచ్చటిస్తున్న డా. కనకయ్య, డా. దార్ల
సభలో ప్రసంగించే ముందు
ఆచార్య ఎండ్లూరి అధ్యక్షతన డా. అద్దేపల్లి రామమోహన రావు గారు పత్ర సమర్పణ చేశారు
సాహిత్య అకాడమీ సలహాసభ్యులు ఆచార్య జి. ఉమామహేశ్వరరావు గారు తదితరులు

సభలో జనం
సభలో జనం
ఆచార్య జి. ఉమామహేశ్వరరావు , ఆచార్యఎండ్లూరి సుధాకర్ తదితరులు
జాతీయ సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించిన డీన్, సాహిత్య పీఠం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎండ్లూరి సుధాకర్ గారు
జాతీయ సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించిన డీన్, సాహిత్య పీఠం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎండ్లూరి సుధాకర్ గారు