రాజశేఖరచరిత్ర నవల: వివిధ దృక్కోణాలు (విద్యార్థి సదస్సు సంచిక, 2015-16 బ్యాచ్) వెలువడింది. ముద్రిత ప్రతి కావలసిన వారు సహసంపాదకురాలు, పరిశోధక విద్యార్థిని సడ్మెక లలితను సంప్రదించవచ్చు. అలాగే, e-bookని https://archive.org/details/RajasekharaCharitraStudentsSeminarEBook అనే వెబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

డా.దార్ల వెంకటేశ్వరరావుకి ‘విహంగ’ సాహితీ పురస్కారం

అంతర్జాల తెలుగు మాసపత్రిక ‘విహంగ’  ఈ యేడాది నుండి సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. విహంగ పత్రికలో రచనలు చేస్తున్నవారికి, విహంగ విజయవంతంగా నడవడానికి కృషి చేస్తున్నవారికి ఈ పురస్కారాలను ప్రకటించారు. ఈ యేడాది విహంగ పురస్కారాలను అందుకున్నవారి వివరాలు: కె.వరలక్ష్మి ,కె .గీత ,గబ్బిట దుర్గా ప్రసాద్ , డా.దార్ల వెంకటేశ్వరరావు,
డా.షమీఉల్లా , డా.లక్ష్మి సుహాసిని , విజయ భాను కోటే , బొడ్డు మహేందర్ అందుకున్నారు.  విహంగకి సాంకేతిక సహకారం అందిస్తున్న వర్కింగ్ ఎడిటర్స్ అరసి , పెరుమాళ్ళ రవికుమార్ పురస్కారాలు అందుకున్నారు.
\No comments: