ఓ పరిమళభరిత సంతకం!
కొన్ని పుస్తకాలు
ముద్రణ పూర్తయ్యాక కూడా
ఇంకా అసంపూర్ణంగానే ఉంటాయి
మొదటి పేజీలో
ఒక పేరు చేరేవరకు.
ఆ పేరు
కేవలం అక్షరాల వరుస కాదు;
మనసు
తనకు వంగి నమస్కరించిన
చోటులా అనిపిస్తుంది.
అది ఇద్దరి శాశ్వత బంధానికి
చెరగని చిరునామాలా అనిపిస్తుంది
అంకితం అంటే
ఒక దీపం
మరొక దీపానికి
తన వెలుగులో కొంత పంచినట్టే!
ఒక చెట్టు
తన మొదటి పండును
ఎవరికో అందించినట్టే.
ఒక నది
తన మొదటి అలను
తీరానికి ముద్దుపెట్టినట్టే.
తమ జీవిత కథను
మన పేరుతో ప్రారంభించినప్పుడు
అది గౌరవం మాత్రమే కాదు
“నా ప్రయాణంలో
మీ అడుగుల శబ్దం ఉంది”
అని చెప్పే నిశ్శబ్దపు సంగీతం!
అంకితం ఇవ్వడం అంటే
హృదయం నుంచి
ఒక పువ్వు తీసి
మరో హృదయం ముందు ఉంచడమే.
అంకితం స్వీకరించడం అంటే
ఆ పువ్వు వాడిపోకుండా
స్మృతుల్లో దాచుకోవడమే!
కొన్ని బంధాలకు
రక్త సంబంధం ఉండదు
కానీ
ఒక అంకిత పేజీ చాలు
రెండు మనసులు
ఎంత దగ్గరగా ఉన్నాయో చెప్పడానికి!
గురువు–శిష్యుల మధ్యైనా
స్నేహితుల మధ్యైనా
మనసుకు మనసు చేరిన చోట
అంకితం
ఒక వంతెనలా నిలిచి పోతుంది.
కాలం గడిచాక
పుస్తకంలోని మాటలు మరచిపోయినా
మొదటి పేజీలో
ప్రేమతో వంగి నిలబడ్డ
ఆ ఒక్క అంకితం మాత్రం
ఎప్పటికీ చెరిగిపోదు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
26.5.2029
( నేను అడగకపోయినా నాకు ప్రేమతో అంకితం చేసిన వార్కి ఈ కవిత అంకితం)
….
A Fragrance-Filled Signature!
Some books,
even after the printing is complete,
still remain incomplete
until a name appears on the very first page.
That name is not merely a row of letters;
it feels like a place
where a heart has bowed in reverence.
It feels like an unerasable address
of an eternal bond between two souls.
A dedication is like
one lamp sharing a part of its light with another lamp!
Like a tree offering its very first fruit to someone dear.
Like a river letting its first wave kiss the shore.
When someone begins the story of their life with our name,
it is not merely an honour;
it is a silent melody saying,
“Your footsteps echo through my journey.”
To dedicate is to take a flower from one’s heart
and place it before another heart.
To receive a dedication is to preserve that flower
in memories without letting it fade.
Some relationships may not have a bond of blood,
yet a single page of dedication
is enough to reveal
how close two hearts truly are.
Whether between teacher and disciple,
or between friends,
where one heart reaches another,
a dedication stands forever like a bridge.
As time passes,
the words in the book may be forgotten,
but that one dedication,
standing with love on the first page,
will never fade away.
— Dr..Darla Venkateswara Rao
University of Hyderabad
26.5.2029
(This poem is dedicated to those who lovingly dedicated their works to me, even without my asking.)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి