ఎవరి శ్రమతో నిలిచినదీ ప్రపంచం?
“మాకు
దళితుల ఓట్లు అవసరం లేదు”
అని అహంకారంతో పలికిందో స్వరం
ఓ దురాంకారీ
నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని
ఒక్కసారి చూసుకో
అయితే
ఓట్లు మాత్రమే కాదు
నువ్వు మా దళితుడి శ్రమ కూడా వద్దనాలి!
పొలంలో
మట్టిని చెమటతో తడిపిన చేతులు
మీ దళితుడివే
ఆ పంట గింజను
నీ పాత్రలో పడనీయొద్దు.
కాలువల్లో
మట్టిని తొలగించి
నీటికి దారి చూపిన భుజాలు
మా దళితుడివే
ఆ నీటితో
నీ దాహం తీర్చుకోవద్దు.
రోడ్లు వేసిన చేతులు,
ఇళ్ళు కట్టిన అరచేతులు,
మురికిని మోసిన భుజాలు,
నీ నగరాన్ని శుభ్రం చేసిన అడుగులు
అన్నీ మాదళితుడివే
ఆ నాగరికత నీకు అర్హత కాదని
నువ్వే ప్రకటించాలి.
నీ ఇంటి ముందున్న
శుభ్రత కూడా
ఎవరి చేతి గాయాల నుంచో పుట్టిందని
మరిచిపోకు.
నిజంగా
మా దళితుల్నే తిరస్కరించాలంటే
మా ఓటు మాత్రమే కాదు
మా శ్రమతో నిర్మించిన
ప్రతి సౌకర్యాన్నీ వదులుకోవాలి.
అంత ధైర్యం ఉందా నీకు?
అవసరం ఉన్నప్పుడు
శ్రమను వాడుకుని,
అవసరం తీరాక
మనిషినే అవమానించే
పాత అహంకారానికి ఇంకో ముఖమా ఇది?
ఈ దేశం
ఒక్కరి గర్వంతో కాదు,
లక్షల చేతుల చెమటతో నిలిచింది.
మా దళితుడి చెమటే
నీ ఇంటిలో
నిత్యం బంగారంలా మెరుస్తుంది
మా దళితుల పనులే
నిన్ను హంసతూలికా తల్పాలు చేసింది
ఈ నేల ఇంకా మనుష్యంగా ఉండాలనే
మా దళితులంతా
నిశ్శబ్దంగా రాసిన చరిత్రను మర్చిపోకు!
డా.దార్ల వెంకటేశ్వరరావు, 26.5.2026
Upon Whose Labor Does This World Stand?
A voice, swollen with arrogance, declared:
“We do not need Dalit votes.”
O arrogant one,
look around at the world surrounding you.
Then reject not only our votes—
reject the labor of Dalits too!
The hands that soaked the soil with sweat in the fields
belong to Dalits;
then do not let a single grain
from that harvest fall into your plate.
The shoulders that cleared the canals
and guided water to flow
belong to Dalits;
then do not quench your thirst
with that water.
The hands that laid the roads,
the palms that built your houses,
the shoulders that carried away filth,
the footsteps that cleaned your cities—
all belong to Dalits.
Then proclaim yourself
unworthy of that civilization.
Do not forget
that even the cleanliness before your doorstep
was born from wounds on someone’s hands.
If you truly wish to reject Dalits,
reject not only our votes,
but every comfort
built through our labor.
Do you possess such courage?
Or is this merely another face
of that old arrogance
which uses labor when needed,
and humiliates the laborer
once the need is over?
This nation does not stand
upon the pride of one person,
but upon the sweat
of millions of hands.
The sweat of Dalits
shines like gold
within your homes every day.
The labor of Dalits
has laid you upon beds of luxury.
Do not forget
the silent history
written by Dalits,
so that this land
may continue to remain human.
— Dr. Darla Venkateswara Rao
26.5.2026


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి