"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

18 ఏప్రిల్, 2026

ప్రపంచ వారసత్వ దినోత్సవం

 ప్రపంచ వారసత్వ దినోత్సవం 


పూర్వ మెందరో నిర్మించి పోయినారు

అందమైనట్టి శిల్పాలు, ఆలయాలు

మనకు వారసత్వమ్మది, మంచి నిధియె

కాపు కాచగ వలెయును గర్వమొంది!


రాతి కట్టడ మందున రక్తి నిండి

నాటి వైభవ మంతయు నాట్య మాడు

తరము తరముకు అందాలి ధన్య చరిత

మరువ తగదయ్య జాతికి మణియయౌను !


శిథిల మవ్వక మునుపే విశిష్ట బుద్ధి

చాటవలె మన ఘనతను జగతి కెల్ల

వారసుల కందగలగాలి వైభవంబు

కన్న తల్లినె కన్నట్టి కరుణ తోడ !


శిలల లోపల జీవము చిలికినారు

నాటి శిల్పులు నేర్పరి నడక తోడ

కోటి తలపుల కావ్యంబు కొలువు దీరె

చూడ కనువిందు గొలుపును చోద్యముగను !

రంగు లీనెడి చిత్రాల రాశి యొకటి

కొండ గుహలలో వెలిసెను కోమలముగ

జాతి సంపద లీ వింత జగతి యందు

ప్రేమ తోడను రక్షించు పెన్ని ధిగను !

నేటి వారల బాధ్యత నిశ్చయముగ

వరుస తప్పక కాపాడ వరుసగాను

పాత సంపద మరువని ప్రాభవమున

నిలుపు కొందాము ఖ్యాతిని నిత్యముగను !


మతము లన్నియు గలిసిన మమత కొరకు

కట్ట డమ్ములు సాక్ష్యమై కనుల ముందు

ముదము తోడుత సౌరభ మొసగు చుండె

చాట వలె దీని ఘనతను జగము కంత !


విశ్వ మంతయు మెచ్చెడి వింత లెన్నొ

నవ సమాజాన నిలవాలి నవక ముగను

ధరణి వారసత్వము మన ధర్మ మవగ

భద్ర పరచుదా మన జాతి భాగ్యములను !


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 18.4.2026

కామెంట్‌లు లేవు: