కవిత్వానుభూతి.
సృజన.
మనసు తోటలో
మౌనంగా మొలకెత్తె
భావ బీజము
అన్వేషణ.
పదాల వేట
భావాల సాగరాన
ముత్యం దొరికె
అక్షర రూపం.
గుండె చప్పుడు
కాగితం పైన నేడు
కవిత్వమాయె
స్పూర్తి.
కదిలే మేఘం
నేర్పెను ఒక పాఠం
కవితా వేళ
అనుభవం.
కన్నీటి చుక్క
సిరాగా మారినది
కథను చెప్పగ
నిశ్శబ్దం.
మౌన భాషలో
శబ్దాల కేరింతలు
అక్షర చిత్రాలు
శిల్పం.
పదును పెట్టి
భావాన్ని చెక్కగాను
రూపు దాల్చెను
ఆనందం.
పూర్తైన కవిత
సృష్టికర్తకు సాటి
పరమానందం
ప్రవాహం.
ఆగని ధార
భావాల సెలయేరు
కవితా లహరి
శాశ్వతం.
మనిషి మరణం
అక్షరం చిరంజీవి
కవిత్వ సాక్షి
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 17.4.2026
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి