"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

04 మార్చి, 2026

కలికాలపు మనిషి. (పద్యాలు)

 



మురిపెమున ధనము పలికిన

నరలోకము నందుమాన నము మూగబడెన్!

స్థిరముగ నహంకృతియు నన

నరయగ నాత్మీయతయును నవిటిది యయ్యెన్!

(భావం: లోకంలో డబ్బు తన ప్రాభవాన్ని చాటుకోగానే మానవత్వం నోరు మూగబోయింది. ఎప్పుడైతే మనిషిలో అహంకారం స్థిరంగా తిష్ట వేసిందో, అప్పుడు ఆత్మీయత అనేది అంగవైకల్యం పొందినట్లుగా (అవిటిదై) నిస్సహాయంగా మారిపోయింది.)


కుటిలపుటడుగులు బడగా

నిట నీతియు సత్య మనుచు నెగడెడు నీడల్

పటుతరముగ గరువయ్యెను

నట మనిషియు రూప మైన నణగెడు చిత్రన్!

(భావం: సమాజంలో కుట్రలు, కుతంత్రాలు ప్రవేశించగానే.. నీతి, నిజాయితీ అనే నీడలు కూడా కనుమరుగయ్యాయి. మనిషి ఆకారం కనిపిస్తున్నా, అందులో ఉండవలసిన గుణాలు అణిచివేయబడి, కేవలం ఒక ఆకృతి మాత్రమే మిగిలింది.)


రూపము మనిషిది యైనను

లోపల మృగమున్న దెపుడు లోకము మెచ్చన్!

చాపల చిత్తుడు నేడును

రూపున నల రారు బొమ్మ రూపము దాల్చెన్!

(భావం: చూడ్డానికి మనిషి రూపమే ఉన్నా, లోపల మాత్రం క్రూరమైన మృగమే దాగి ఉంది. చపల చిత్తంతో ప్రవర్తిస్తున్న నేటి మనిషి, ప్రాణం లేని బొమ్మలా కేవలం బాహ్య రూపానికే పరిమితమైపోయాడు.)


చిత్తము స్వార్థము నిండిన

మెత్తని నలమాటియెగడె మేలని జగతిన్!

హత్తిన యాత్మీయతయును

నత్తగ నలమాటి నడచె నణగెను నీతిన్!

(భావం: మనసులో స్వార్థం నిండినప్పటికీ, పైకి మెత్తగా మాట్లాడే మాటలే లోకంలో గొప్పగా చెలామణి అవుతున్నాయి. ఒకప్పుడు గుండెలకు హత్తుకున్న ఆత్మీయత ఇప్పుడు నత్తనడకలా నెమ్మదించింది. దీనివల్ల నైతిక విలువలు పూర్తిగా అణగారిపోయాయి.)


మ‌న‌వ‌త మంట‌న గ‌లిసెను

క‌నిపెట్ట‌గ లేము మనిషి గ‌తి యిల నేడున్!

క‌నుపించు బొమ్మ యయ్యెను

ననువుగ నల మాటి జేరె నూహల చిత్రన్!

(భావం: మానవత్వం పూర్తిగా నశించిపోయింది. నేటి సమాజంలో అసలైన మనిషిని వెతికినా కనిపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. మనిషి కేవలం కంటికి కనిపించే బొమ్మగా మారి, చివరికి కవి ఊహల్లో మాత్రమే ఉండే ఒక ఊహాచిత్రంలా మిగిలిపోయాడు.)

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 4.3.2026

కామెంట్‌లు లేవు: