"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

26 మార్చి, 2026

మార్చి 26 చిప్కో ఉద్యమ దినోత్సవం

 చిప్కో ఉద్యమ దినోత్సవం 


అమ్మల కౌగిలి చెట్లకు

కొమ్మల రక్షణకు నిలిచె కొండల పైనన్

నమ్మిన ధర్మము కొరకై

కమ్మని త్యాగాల బాట కదిలెను దార్లా!


చిక్కులఁ బాపగ హత్తుట

చొక్కని ప్రేమానురాగ శోభిత మయ్యెన్

ముక్కున వేలేయ గనన్

దిక్కులు పిక్కటిల జేసె ధీరత దార్లా!


హత్తుట చిప్కో యనగా

మొత్తము పర్యావరణకు ముప్పులు రాగన్

పొత్తున చెట్లను పట్టుచు

చిత్తము తోడను నిలిచెను ధీరులు దార్లా


సుందర లాల్బహు గుణుడును

ముందడుగును వేసె నాడు ముదమున గనుచున్

అందము నడవుల గావగ

పొందుగ నేర్పెను ప్రజలకు బుద్ధిని దార్లా!



గౌరమ్మ ధీర మహిళయు

పోరున నిలిచెను పొలతియు పొలుపుగ నాడున్

ధారగ నిలిచిన గొడ్డలి

చేరక మరలెను వెనుకకు చిత్రము దార్లా!


రేణిని జొచ్చిన గొడ్డలి

మానును తాకగ మహిళల మదమున గెలిచెన్

ప్రాణము నిచ్చెడి గౌరమ

పూనిక తోడను నిలిచెను పుడమిని దార్లా!

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

 26.3.2026.


(చిప్కో ఉద్యమ దినోత్సవం (Chipko Movement Day)

1974 మార్చి 26న ఉత్తరాఖండ్‌లోని రేణి గ్రామంలో చెట్లను నరకకుండా అడ్డుకోవడానికి గ్రామీణ మహిళలు చెట్లను హత్తుకుని సాగించిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పర్యావరణ పరిరక్షణలో ఈ రోజు( మార్చి, 26) ఒక మైలురాయి.)


కామెంట్‌లు లేవు: