"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

25 మార్చి, 2026

బానిసత్వ విముక్తి దినోత్సవం

 బానిసత్వ విముక్తి దినోత్సవం 



కారు చీకటి బ్రతుకున గాలి పీల్చి

కళ్ళ నీళ్ళతో కాలము గడిపిరాడు

కంచు గొలుసుల బంధాల కలుగు నొప్పు

కడలి దాటిన బానిస కష్టమదియె!


గతము గుర్తింప బానిస వ్యధల నెంచి

మార్చి ఇరువది ఐదున మనము నేడు

నైచ్య బంధాల వీడిన నవ యుగాన

దీప మెలిగింప వలెనులే దిక్కు లెరుగ!


కులము మతమును వర్ణము గొడవ లేక

మనుజులందరు ఒక్కటె మహిని నేడు

బంధనాలెన్ని తెంచిన బాట లోన

స్వేచ్ఛ వాయువు లందెడి సృష్టి యిదియె!


బానిసత్వము పోవలె బ్రతుకు నుండి

ప్రేమ సోదర భావముల్ పెరగ వలెను

మమత నిండిన లోకము మనకు దక్కు

శాంతి మార్గము పయనింప సౌఖ్య మబ్బు!



ఓడ లెక్కిరి సంద్రము దాటి పోయి

సరకు వలెనమ్మ బడిరపు డవని పైన!

మానవత్వము మరచిన మనుజ మృగము

ధనమునాశించి అమ్మెను ధరణి పైన!

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

25.3.2026

(అంతర్జాతీయ బానిసత్వ బాధితుల స్మారక దినం: ప్రతి ఏటా మార్చి 25న బానిసత్వం & అట్లాంటిక్ బానిస వ్యాపారానికి గురైన బాధితులను స్మరించుకోవడానికి ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది)


కామెంట్‌లు లేవు: