విజ్ఞాన విజయుడితఁడు
తే.గీ.
రామునికితండు లక్ష్మణ ధాముడనఁగ!
భ్రాతృ వాత్సల్య నిధియైన బంధువితడు!
నీడవలె విడువక వెంట నెపుడు దిరుగు!
సుగుణధాము విజయకుమార్ సోదరుండు!
తే.గీ.
చేయుపనులందు నెప్పుడు చేవజూపు!
దీక్ష తోడను విజయాన్ని తీర్చికూర్చు!
పట్టువదలక కార్యము పదనుబెట్టు!
తమ్ముడగు విజయకుమారు దక్షుడనగ!
తే.గీ.
పలుకు లందున తేనెలు పంచునితడు!
సంస్కృతాంధ్రములందున సన్నుతుండు!
సభల నూగించు వాగ్ధాటి సరసభాషి!
మురిసిపోవగ శ్రోతలు మురిపె మమర!
తే.గీ.
పరుల మేలును గాంచును భక్తి తోడ!
విహిత ధర్మము విడువక విందు జేయు!
సకల కార్యము సాధించు సవ్యసాచి!
విజయుడనుపేర సార్థక విజ్ఞుడితడు
తే.గీ.
తమ్ముడనదగు నాప్తుడు తరచిజూడ!
మంచి గుణముల భూషితు మమత మెరయ!
తెలుగు వెలుగుల మొనగాడు తెలిసికొనగ!
నాదు హృదయాన నిలచిన నమ్మకమ్ము!
(డా.పి.విజయకుమార్ కి శుభాశీస్సులతో..)
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు -
- 18-01-2026

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి