ఇందిరా ధన్ రాజ్ గిరి మరణించారని ఈనాడు దినపత్రిక (14.1.2026)లో ఒక వార్త చదివాను. ఆమెకు గుంటూరు శేషేంద్ర శర్మ గారంటే చాలా ఇష్టం. ఆయన సాహిత్యాన్ని ప్రచారం చేయడంలో ఆమె ఎంతో కృషి చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో అనేక డిపార్ట్మెంట్ లలో స్మారకోపన్యాసం జరిగేలా నిధులను కూడా సమకూర్చారు. వారి మరణానికి వివాళ్ళులు తెలియజేస్తున్నాను.
ఈనాడు దినపత్రిక, 14.1.2026 సౌజన్యంతో
5.12.2022 వ తేదీన స్కూల్ ఆఫ్ హ్యమానిటీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో గుంటూరు శేషేంద్ర శర్మ గారి స్మారకోపన్యాసంలో భాగంగా సంస్కృత శాఖ వారు ఒక ప్రత్యేక ఉపన్యాసాన్ని ఏర్పాటు చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయం ఆచార్యుడు సుదీప్త కవిరాజ్ ఈ ప్రత్యేక ప్రసంగాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు గుంటూరు శేషేంద్ర శర్మ గారి భార్య ఇందిరా ధనరాజ్ గిరి గారు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారితో కలిసి తీసుకున్న ఫోటోలు




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి