యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారుఎం.ఏ. తెలుగులో ప్రతీ సంవత్సరం ఇచ్చే శ్రీ దార్ల అబ్బాయి (లంకయ్య) మెమోరియల్ గోల్డ్ మెడల్ ను ఈ ఏడాది కుమారి ఎం. రమ్య అందుకున్నారు. ఆమెకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
....
రమ్యకు దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ.,తెలుగు చదువుతున్న భారతీయ అలంకార శాస్త్రం, సాహిత్య విమర్శలలో మొదటి స్థానం పొందిన వారికి ఇచ్చే శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ఈ ఏడాది ఎం. రమ్యకు లభించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వారు మంగళవారం నాడు (7.10.2025) గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారి శాంతి సరోవరం, గ్లోబల్ పీస్ ఆడిటోరియం లో జరిగిన 25 వ స్నాకోత్సవంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా. కృష్ణ ఎల్లా చేతుల మీదుగా ఈ గోల్డ్ మెడల్ ను కుమారి రమ్య అందుకున్నారు. జగిత్యాలకు చెందిన కుమారి మిల్కూరి రమ్య, సెంట్రల్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎం.ఏ. తెలుగు చదివారు. ఈ గోల్డ్ మెడల్ తో పాటు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం మెమోరియల్ కోల్డ్ మెడల్ కూడా అందుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.జె.రావు, రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ తదితరులు పాల్గొన్నారు. గోల్డ్ మెడల్ అందుకున్న రమ్యను, దార్ల అబ్బాయి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్, తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు తదితర అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.
కుమారి ఎం.రమ్యను అభినందిస్తున్న శ్రీ దార్ల అబ్బాయి గారి కుమారుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు , ఆచార్య పిల్లలమర్రి రాములు తదితరులు
డా.కృష్ణ ఎల్లా నుండి శ్రీ దార్ల అబ్బాయి మెమోరియల్ గోల్డ్ మెడల్ ను అందుకుంటున్న కుమారి ఎం.రమ్య..చిత్రంలో హెచ్ సియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.జె.రావు ఉన్నారు
కుమారి ఎం.రమ్య..మూడు బంగారు పతకాలతో మెరిపోతూ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి