మా విద్యార్థుల పిహెచ్.డి.పరిశోధనల సమర్పణ
నా పర్యవేక్షణలో ముగ్గురు పరిశోధకులు తమ పిహెచ్డి సిద్ధాంత గ్రంథాలను యూనివర్సిటీ కి (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్) సమర్పించారు. సాంకేతికంగా 1.8.2025 వ తేదీన ఆన్లైన్ లలో సమర్పించి, నిన్న (4.8.2025) ఆ గ్రంథాలను డిపార్ట్మెంట్ కి తీసుకొచ్చారు. పంబాల పర్వతాలు ‘పంబ ప్రదర్శన కళ - సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాల అధ్యయనం’ (‘pamba pradarśana kaḷa - sāhitya, sānskr̥tika,sāmājika anśāla adhyayanaṁ’) అనే అంశంపై పరిశోధన చేశాడు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతాలను సందర్శించే అభిలాష కలిగిన మిత్రుడు పంబాల పర్వతాలు ఉభయ రాష్ట్రాల్లోని పంబ కళాకారుల జీవితాలను తన సిద్ధాంత గ్రంథంలో పొందుపరిచాడు. తెలుగు అంటే కేవలం ఉద్యోగాలు లేని చదువు అనుకోవడం పొరపాటని ఋజువు చేస్తూ తానే పదిమందికి ఉపాథి కల్గించగలిగిన స్థాయికి చేరుకున్నాడు.
జి.కృష్ణవేణి ‘తెలుగులో సాహిత్య చరిత్రను పరిశీలన’ ( ‘telugulō sāhitya caritralu- pariśīlana) అనే అంశంపై పరిశోధన చేసింది. ఇంటిగ్రేటెడ్ ఎం. ఏ. నుండి పీహెచ్డీ వరకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోనే చదివింది. మధ్యలో ఒక ఎం.ఫిల్. మాత్రం మద్రాస్ విశ్వవిద్యాలయంలో చేసింది. తెలుగు సాహిత్య చరిత్రలలో విమర్శనాంశాలపై పరిశోధన చేయించాలని అనుకున్నాను. అయితే ఆమెను కొంతమంది భయ పెట్టి, ఆ అంశాన్ని పక్కదోవ పట్టించారు. అయినా, తెలుగు సాహిత్య చరిత్రలు, వికాస చరిత్రలు, కవుల చరిత్రలు, సాహిత్య చరిత్ర స్వభావం గల రచనలను తన సిద్ధాంత గ్రంథంలో అధ్యయనం చేసింది.
దారిశెట్టి పుష్పిణి ‘మరుపూరి కోదండ రామరెడ్డి జీవితం రచనలు సమగ్ర పరిశీలన’ (mārupūrukōdaṇḍarāmareḍḍi jīvitaṁ racanalu - samagra pariśīlana) అనే అంశంపై పరిశోధన చేసింది. ఆయన తొలి తరం రచయిత అయినప్పటికీ ఆయనపై పరిశోధన జరగకపోవడం ఒక విచిత్రం. ఆయన రచనా శైలి ఎంతో కఠినంగా ఉంటుంది. అనేక రచనలను అనువాదం కూడా చేశాడు. జవహర్ లాల్ నెహ్రూ గారి The Glimpses of World History అనే ఆంగ్ల గ్రంథాన్ని సంక్షిప్తంగా తెలుగువాళ్ళకు అందించాడు. ఆయన అనువాదం అనేక ప్రయోగాలతో కూడింది.
కృష్ణవేణి, పుష్పిణీ ఇద్దరూ కూడా మా ఇంట్లో మా అమ్మాయిల్లా మెలిగిన వాళ్ళు.
ఈ ముగ్గురికీ ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 5.8.2025.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి