డా.పట్నాల సుధాకర్ గారు చనిపోయారని ఇప్పుడే తెలిసింది. ఆయన ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారు. 110 డిగ్రీల వరకు చేశారు. ఆయనకు రావూరి భరద్వాజ గారు అంటే చాలా ఇష్టం. ఆయన జ్ఞానపీఠ పురస్కారం రావడంలో డాక్టర్ పట్నాల సుధాకర్ గారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆయనే స్వయంగా నాకు దీనికి సంబంధించిన అనేక విషయాలు చెప్పారు. ఆయన పుస్తకాలు వేసేటప్పుడు కవర్ పేజీ విషయంలో ఎక్కడా రాజీ పడేవారు కాదు. రావూరి భరద్వాజగారి గురించి ఒక చిన్న పుస్తకం వేశారు. కవర్ పేజీపై ఆయనే మన ఎదుట నిలబడ్డాడేమో అన్నంత గొప్పగా ఆ కవర్ పేజీని ఎంతో క్వాలిటీతో వేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఆయన కొన్ని డిగ్రీలు చేశారు. ఎప్పుడైనా ఆయనే ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడేవారు. ఆయన మరణించారంటే నమ్మలేకపోతున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
డా.దార్ల వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ & పూర్వ అధ్యక్షులు, తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్.
తేది: 6.8.2025
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి