అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పిఠాపురం శ్రీ పురుహూతీకాదేవి దర్శనం చేసుకోవాలని నా జీవిత భాగస్వామి డా.మంజశ్రీ కోరింది. నిజానికి ఈ జిల్లాలోనే పుట్టి పెరిగినప్పటికీ నేను ఏనాడూ ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళలేదు. నాకు కూడా దర్శనం. చేసుకొని రావాలనిపించింది. 13.5.2025 వ తేదీన మా చెల్లి కారు తీసుకొని నేను, మంజుశ్రీ, మా తనయుడు శ్రీనివాసరావు కలిసి పిఠాపురం బయలుదేరాం. అక్కడ పూజలు చేయడానికి ఎంతో మంది పురోహితులు ఉన్నారు. ఎలా చేయాలి? ఏ ఏ పూజలు చేయాలి? అనేవన్నీ దగ్గరుండి చేయిస్తారు. సుబ్రహ్మణ్య శర్మ గారు మా దగ్గరకు వచ్చి వివరాలు చెప్పారు. ఆయన్ని చూస్తుండగానే ఆయనతో పూజ చేయించుకోవాలనిపించింది. సుబ్రహ్మణ్య శర్మ గారు మొదట విఘ్నేశ్వర స్వామి దర్శనం పూజ, తర్వాత శ్రీ గురుదత్త స్వామి, శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ పురూహూతికాదేవిగార్లందరికీ దగ్గరకు తీసుకొని వెళ్ళి ప్రత్యేక పూజ, దర్శనం చేయించారు. ఆ దర్శనం చేయించిన తీరు, ప్రత్యేకంగా మా కోసం చేసిన పూజలు నేను నా జీవితంలో ఎప్పుడూ అంతలా జరగడం చూడలేదు. అందుకే ఆ పూజలు అన్నీ చేసిన ఆయనతో ప్రత్యేకించి ఫోటో కూడా తీసుకున్నాం.
తిరిగి రాజమహేంద్రవరం వస్తూ వస్తూ ఆ పరిసరాల్లోనే డాక్టర్ గా పనిచేస్తున్న మా డాక్టర్ బబ్లూ దగ్గరికి వెళ్ళాం. ఆ సందర్భంలో ఫోటో తీసుకొంటుంటే, నా మెడలో స్టెతస్కోప్ వేసి మురిపోయాడు. నా కళ్ళు ఒక్కసారిగా చెమర్చాయి...ఎందుకో!
నా కళ్ళ ముందు పుట్టిన పెరిగిన బబ్లూ (అసలు పేరు అనిల్ కుమార్) డాక్టర్ అయ్యి, పేషెంట్స్ ని చూస్తుంటే కాలం ఎలా మారిపోయిందనిపించింది.
(అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం:
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జ
యిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి