సాహిత్యం ఏదైనా కవి ప్రతిభ చూపించాల్సింది కేవలం హృదయానందమే కాదు! తాను సమాజంలో చూస్తున్న అవకతవకలను ఎత్తి చూపే వాడే కవి. ఏదో రూపేన చురకలు చమక్కుమనిపిస్తూనే ఉంటాడు రచయిత. ఎందుకంటే సమాజాన్ని సరైన తోవలో నడిపించాల్సిన బాధ్యత కవుల పైన రచయితలపైన ఉంటుంది. ఇక్కడ కవి, రచయితయే కాకుండా ఆచార్యులు కూడా! వీరిపై ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందుకేనేమో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు రాసిన 'దార్ల మాట శతకం'లో స్పృశించని అంశం లేదు. నేను కూడా 'శతక సాంప్రదాయంలో దార్ల మాట శతకం' అనే శీర్షికతో రాశాను. ఈ వ్యాసం మూసి పత్రికలో అచ్చయింది. అనిల్ కుమార్ దారివేముల గారు కూడా చాలా బాగా విశ్లేషించి రాశారు. అసలు ఫిబ్రవరి 21 ఎందుకు మాతృభాషా దినోత్సవం గా జరుపుకుంటున్నామనేది చాలామందికి తెలియదు.! తొలి పద్యమే మాతృభాషను గూర్చి ఎత్తుకోవడంలోనే తెలుగు భాషాభిమాని అని బోధపడుతుంది. మాతృభాష దినోత్సవం ఇతివృత్తం వివరించడం బాగుంది. దార్ల వెంకటేశ్వరరావు గారు అందమైన ఆటవెలది పద్యాలతో మా హృదయాలను హత్తుకోవడంతోపాటు సమ సమాజ తీరుతెన్నులును ఎత్తి చూపారు. అంటే ఆయనకి సమాజంపై ఉన్న బాధ్యతను మర్చిపోలేదని మనకి అర్థమవుతుంది. రక్తసంబంధాల గురించి, ఆరోగ్యం, నేడు స్త్రీలపై జరిగే అఘాయిత్యాల గురించి ఒకటేమిటి చాలా అంశాలను గూర్చి కవి చర్చించారన్నది బాగుంది. వామనావతారంలా కనిపించే పద్యం అనే మూడు పాదాలలో(మకుటం మినహా) విశ్వ భావాన్ని (బాధలను) చూపారు. ఈ వ్యాసంలో ఆఖరి పద్యం 'కవిత పద్యమైన కమనీయ భావంబు' అనే పద్యం గురించి చెబుతూ ఏ ప్రక్రియలో రాశామన్నది ముఖ్యం కాదంటారు . జాషువా కవి పద్యంలో రాసినప్పటికీ సమాజంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థ నుంచి స్త్రీ గొప్పతనం వరకు చాలా విషయాలను చర్చించారని తెలిసిందే ! సమకాలీన సమాజ పరిస్థితులను, విశ్వ భావనను గురించి చర్చించి విశ్వనరుడయ్యాడని ప్రతి సాహిత్య విద్యార్థులకు విదితమే! అదేవిధంగా దార్ల వెంకటేశ్వరరావు గారు కూడా కుల వివక్ష, ఓటుకి నోటు, నోట్ల రద్దు వలన ప్రజల ఇక్కట్లు వంటి అనేక విషయాలను ఎత్తిచూపారు. అని అనిల్ కుమార్ గారు వీరిద్దరికీ మద్య సారూప్యం చూపించడం చాలా బాగుంది. దార్ల మాట శతకానికి మీదైన విశ్లేషణ పూర్వక వ్యాసాన్ని అందించినందుకుఅభినందనలు..💐💐
వేపాడ మమత
పరిశోధక విద్యార్థిని
ఆంధ్ర విశ్వ కళాపరిషత్,
విశాఖపట్నం,10.2.2025
......,.......
హృదయపూర్వకపూల బాట - పరిమళాల మూట
ప్రియ మిత్రుడు దార్ల వెంకటేశ్వర రావు జీవితాన్ని, సమాజాన్ని మధించి, మధించి తీసిన సార రూప అమృత బిందువులే ఈ ఆటవెలది పద్యాల సమాహార రూప దార్ల మాట శతకం. దార్ల హృదయాంతరాళమున రూపుదిద్దుకున్న శుక్తిముక్తాఫలముల హారమిది.
నేటి సమాజానికి కనువిప్పు కలిగించే అంశాలలో కొన్నింటిని తెలివిగా ఒడిసి పట్టి మాతృభాష ప్రాధాన్యత, సత్వగుణ విశిష్టత, రాయలసీమౌన్నత్యం వంటి అంశాలను ఉటంకించిన అనిల్ కుమార్ చాలా సునిశితంగా అవగతం చేసుకొని, చాలా చక్కగా వివరించడం అభినందనీయం.
_ డా.జి.శ్రీనివాస రావు
అసోసియేట్ ప్రొఫెసర్
తెలుగు శాఖ
తారా ప్రభుత్వ కళాశాల,
సంగారెడ్డి
......
[09/02, 10:26 am] Dr.Vijaya Kumar HCU విజయ్: పదాలతో పద్య పారిజాతాలు పరిమళింపజేసిన పూలతోట దార్ల మాట శతకం. 'మానవత్వ విలువల మూట- దార్ల మాట' అన్న శీర్షికతో ఆచార్య దార్ల వేంకటేశ్వరరావు గారి దార్శనికతను, మానవీయతను, అక్షర తోటలో విరబూయించిన దారి వేముల అనిల్ కుమార్ గారికి శుభాభినందనలు🌹🌹🌹.
డా. పి విజయకుమార్
అసోసియేట్ ప్రొఫెసర్,
కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
......
భారతదేశ ఉద్యమం, తూర్పు పాకిస్తాన్, ఉర్దూ భాష వంటి వాటిని గురించి కూడా ఈ శతకంలో ఉందనేది తెలిశాక మీ పుస్తకం తప్పకుండా చదవాలనిపిస్తుంది సార్👏👏👏👏.. మృదుల, తెలుగు అధ్యాపకులు, ఇబ్రహీంపట్నం
.....
[09/02, 10:03 am] Darla Venkateswara Rao: ప్రముఖ సాహిత్య విమర్షకులు తమ్ముడు దారివేముల అనిల్ కు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి ,సృజన సహిత్యం ,సాహిత్యపేజీ బాధ్యులు కొమ్మవరపు విల్సన్ రావుగారికి హృదయపూర్వక అభినందనలు. దుగ్గినపల్లిఎజ్రా శాస్త్రి, కవి, రచయిత.
[09/02, 10:11 am] Darla Venkateswara Rao: వ్యాసం చాలా బాగుంది అభినందనలు sir. డా.బద్దిపూడి జయరావు, కవి, రచయిత.
.......
చాలా బావుంది సర్ వ్యాసం
అతిశయోక్తి లేకుండా simple గా చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెప్పారు..వివరించిన అన్నిటికీ పూర్వ చరిత్ర కొంత జోడించి చెప్పటం వల్ల మీ పద్యాల భావం లోతుగా అర్థం చేసుకోగలిగే అవకాశం ఎక్కువగా ఉంది. డా.మృణాళిని, తెలుగు ఉపాధ్యాయిని. సికింద్రాబాద్.
.....
సార్ మకుటం అద్భుతంగా ఉంది పద్యాలు సహజంగా సరళ సుందరంగా పామర్రులకు అర్థమయ్యే రీతిగా బాగా రాశారు లోకాభిరామం కొన్ని చమత్కారాలు కొన్ని విడుపులు మనసు చూరగొంటాయి మోహనాంగిరా పద్యం చాలా బాగుంది. ఏరులన్ని పారు పద్యకూడా చాలా బాగుంది. భూతం ముత్యాలు, ఉపాధ్యాయుడు.
...
*గురువు గారు నమస్కారం🌹🙏🏻మానవీయ విలువలపై దారి పూల బాట దార్లమాట పుస్తకంపై చాలా చక్కని విశ్లేషణాత్మకమైన వ్యాసం రాశారు.*
*వారికి నా హృదయపూర్వక అభినందనలు.*
*ఏరులన్నియు పారి ఎచట కలియును ?*
*సాగరమును చేరి శాంతి నొందు*
*మానవుండు మరలా మట్టి నటులే చేరు*👌🏻🙏🏻 డా.పి.ముకుందరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, శ్రీకాకుళం
.....
శుభోదయం మిత్రమా.
మానవ నైజాన్ని సామాజిక తత్వాన్ని అద్భుతంగా వ్యక్తపరిచాయి మీ పద్యాలు. ఇవి నేటి సమాజానికి అవుతాయి పాఠాలు. వ్యాసం కూడా బాగా రాశాడు మిత్రమా. శుభాభినందనలు.... ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి, యోగివేమన విశ్వవిద్యాలయం, కడప
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి