"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

06 డిసెంబర్, 2024

ఆత్మకథ ఒక్కరోజులోనే చదివేశాను .

 Good evening sir 

మీ 'ఆత్మకథ' నెమలి కన్నులు ఒక్క రోజులో చదివేశాను. మీకు బెల్లం జీళ్లపై ఉన్న ప్రేమ వాటిని తయారు చేయడాన్ని గమనించడం, క్లాస్ మధ్యలో లో  టీచర్ కి తెలియకుండా తినాలనే లాలస చూస్తే చాలా నవ్వొచ్చింది. కానీ మున్ముందు చదువుతున్న కొలది కన్నీళ్లు. ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టం దాగివుందో!.  అని అనుకునేదాన్ని కానీ ఇంత కష్టం ఉందని ఊహించలేదు! 



మీరు కూడా కూలి పనులు చేస్తూ చదువుకోవడం, పాలేరు గా వెళ్తుంటే సినిమాలో కూడా కథానాయకుడు కష్టాలు పడుతుంటే చూడలేక అయ్యో వెళ్లకుండా ఉంటే బాగుండనే.. ఆలోచనతో పేజీలు తిప్పుతున్నలోపే మీ ధిక్కారంతో ఆ పాచిపోయిన అన్నాన్ని ఆమె ముఖాన కొట్టినపుడు వారెవ్వా అనిపించింది . చాలా తెలివిగా ఆవులను ఇప్పి వాటితో పాటే పరుగెత్తి తప్పించుకోవడం ఆశ్చర్యం వేసింది. తల్లిదండ్రులు చేసిన మంచే బిడ్డలను కాపాడుతుంది అంటారు పెద్దలు. అది నిజమని మీ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుంది. తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ బరువు కాదు. బయట వారెందుకో ఎక్కువ సంతానం అనేసరికి వాళ్ళ కష్టార్జితం మనం తినేస్తున్నట్లు మాట విరుపులు. మా అమ్మా నాన్న గారు కూడా మేం ఆరుగురు ఆడపిల్లలం అయినా ఏరోజు భారం అనుకోలేదు . నాన్నగారు ఐతే నాకేమీ లక్ష్మీ దేవులు పుట్టారు అనేవారట. (మొన్న మీరు అన్నారు కదా.. నేను లక్ష్మీదేవిలా ఉన్నానని.. ఆ మాటలే గుర్తు వచ్చాయి సర్) మీ ఊరిని, గోదావరిని వర్ణిస్తుంటే నాకు కూడా ఆ ప్రదేశాలను చూడాలనిపించింది. పల్లె వాతావరణం, ముగ్గులు, హరిదాసు, పిండి వంటలు నా చిన్నప్పుడు మా తాతగారు ఊరిని గుర్తు చేసింది.  సమాజాన్ని గమనిస్తూ పెరిగిన వారు మీరు... అప్పటి పరిస్థితులను అద్దంలో చూపించే ప్రయత్నం చేశారు..

నీళ్ళు పుష్కలంగా ఉన్న మీ జీవన పరిస్థితులకు, మెరక ప్రాంతాల్లో ఉన్న దళితుల జీవన ప్రమాణాలలో చాలా వ్యత్యాసం ఉంది. నేను కళ్ళారా చూసాను. 

నేను కూడా  నెమలి కన్నులపై ఒక వ్యాసం రాద్దామని అనుకుంటున్నాను. అందుకే మిగతా విషయాలు చర్చించడం లేదు.. బాల్య దశ ఆత్మ కథలోనే ఇంత విషయం ఉంటే తరువాత భాగాలలో ఇంకెంత దాగి ఉందని!ఎప్పుడు చదువుతానా అని ఎదురు చూస్తున్నాను.

ఈ స్థాయికి రావడానికి మీరు చేసిన కృషికి ఎంత చెప్పినా తక్కువే ‌... 🙏🙏

Good night sir...

- Mamatha, 5.12.2024

కామెంట్‌లు లేవు: