"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

21 నవంబర్, 2024

Story telling as a Pedagogy... Lecture on 19.11.2024




భారతీయ భాషల ప్రచారం & బహుభాషావాదానికి మద్ధతు ఇవ్వడంపై రంగారెడ్డి జిల్లాలో గల నవోదయ లీడర్ షిఫ్ శిక్షణాసంస్థలో  18.11.2024 నుండి 22.11.2024 వరకు టి.జి.టి (తెలుగు) ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో నా ఎం.ఏ. క్లాస్మేట్స్ డా.ఎస్.ఎల్ .వి.ఉమామహేశ్వరరావు, వెలగా ఈశ్వరరావులతో పాటు మా సీనియర్స్ డా.దంటు హేమలత, డా.రామకృష్ణలు, మా జూనియర్ మిత్రుడు డా.మొయిలి శ్రీరాములు, నాకు తెలియని ఉపాధ్యాయులు దీనిలో పాల్గొిన్నారు. నేను రీసోర్స్ పెర్సన్ గా స్టోరీ టెల్లింగ్ ఏజ్ ఏ పెడగాజీ ( ఒక బోధనాశాస్త్రంగా కథాకథనం) అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజంటేషన్ చేశాను. 

ప్రసంగిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, పూర్వ శాఖాధ్యక్షులు, తెలుగుశాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్. 
 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగార్ని పరిచయం చేస్తున్న  డా.ఎస్.ఎల్.వి. ఉమామహేశ్వరరావు

ఈ కార్యక్రమం నా జీవితంలో ఒక కొత్త అనుభవాన్నిచ్చింది. నా క్లాస్మేట్స్ కీ, నా సీనియర్స్ కీ, వయసులో ఎంతో పెద్దవాళ్ళకీ నేను నా ప్రసంగాన్ని వినిపించే అవకాశం వచ్చింది. మా శాఖాధ్యక్షులు  ఆచార్య పిల్లలమర్రి రాములుగారు నన్ను ఈ ప్రసంగానికి ఎంపికచేశారు. నాతో పాటు మా శాఖ నుండి నలుగురు అధ్యాపకులు ప్రసంగించారు.  పాఠం చెప్పడమెలాగో ఒక కథాకథన పద్ధతిని వివరించే ప్రయత్నం నా ప్రసంగంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చేశాను. ఈ సందర్భంగా నన్ను పరిచయం చేసిన ఉమాను, స్పందన తెలిపిన నా ఆత్మీయ మిత్రుడు ఈశ్వర్ కీ కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం వచ్చింది. మేమంతా ఎం.ఏ . తెలుగు చదువుకొనేటప్పుడు మేమంతా రూమ్మేట్స్.  కుల,మతాలకు అతీతంగా నన్ను ఎంతగానో ఆదరించారు. నాకు ఆరోగ్యం బాగుండేది కాదు. ఆ సమయంలో నన్ను చూసుకున్న తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ విషయాలు కూడా చెప్పుకొనే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషించాను.  ఈ సందర్భంగా నా వ్యక్తిత్వం, నేను కష్టపడే తీరు, రాసే కవిత్వం, సాహిత్యం గురించి మా మిత్రులు చెప్పిన విషయాలు నన్ను ఎంతో ఆనందాన్నిచ్చాయి. 

ప్రసంగిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, పూర్వ శాఖాధ్యక్షులు, తెలుగుశాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్. 
 

శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు.


ప్రతిస్పందన తెలియజేస్తూ  వెలగా ఈశ్వరరావు మా ఎం.ఏ . ఎంట్రన్స్ ప్రస్తావన చేశాడు. ఆంధ్రాయూనివర్సిటీ. ఎం.ఏ తెలుగు ఎంట్రన్స్ లో  నేను త్వరగా పరీక్ష రాసి, పేపర్ ఇచ్చేసిన సంఘటన గుర్తుచేశాడు. ఆ ఎంట్రన్స్ లో నాకు రెండో ర్యాంకు రావడాన్ని కూడా చెప్పాడు. 
ఈ ప్రసంగం  నాకొక తీపిగుర్తునిచ్చింది.  ఈ ప్రసంగం కోసం బి.యిడి.,, టి.పి.టి   వంటి శిక్షణా కార్యక్రమాలేవీ చేయకపోయినా టీచింగ్ మెథడ్స్ బాగా అధ్యయనం చేయాల్సి వచ్చింది.  మూడు మోడల్స్ లో నా ప్రసంగాన్ని వివరించాను. నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఆ సంస్థవారికి సమర్పించాను. నా ప్రసంగం కూడా అందరినీ ఆలోచింపజేసిందని భావిస్తున్నాను.

కామెంట్‌లు లేవు: