"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

05 సెప్టెంబర్, 2024

నా ఆయుధాన్ని పదునుపెడుతునే ఉన్నా'

 'నా ఆయుధాన్ని పదునుపెడుతునే ఉన్నా...!'

నా ప్రియమైన శత్రువా!

నేను నిద్రపోలేదు

తూగుటుయ్యాలలో

నేను జోలపాటల్తో జోగడం లేదు 

నేను నా కులం గాయాల్ని 

మర్చిపోలేదు

నేను నాకలాన్ని

మూసెయ్యలేదు

నీ రాంబందుల రాజ్యంలో

నా ఆత్మ ఘోష వినేదెవరు?


నేనేది రాయాలో 

నేనెప్పుడు రాయాలో, 

నేనేది మాట్లాడాలో 

నేనెప్పుడు మాట్లాడాలో 

అది నాకు తెలుసు. 


ఎవరో రాయమంటే

నేను రాయను

ఎవరో మాట్లాడమంటేనే

నేను మాట్లాడను

ఎవరో నడవమంటేనే

నేను నడవను 

ఎవరో నిద్రపోమ్మంటేనే 

నేను నిద్రపోను

ఎవరో నిద్రలేవమంటేనే

నేను లేవను

ఎవరో ఊపిరి పీల్చమంటేనే 

నేను నా శ్వాస పీల్చుకోవట్లేదు

ఎవరో చూడమంటేని 

నా కళ్ళను తెరవట్లేదు!


నాకు కూడా చీమూ నెత్తురు ఉంది 

నాకు కూడా నా జాతి అనుభవించిన 

అవమానాల  బడబాగ్నులున్నాయి

నేనెప్పుడు  ఆయుధాన్నవ్వాలో

నాకు తెలుసు 

నేనే గాయానికి 

 ఏ ఆయింట్మెంట్లు పూసుకోవాలో 

నాకు తెలుసు 

నా ఒంటి మీదే కాదు 

గుండెల్లోనూ వాతలెన్నో తగిలిన వాణ్ణి!

గాయాల గురించి

నువ్వేమీ  నాకు కొత్తగా నేర్పొద్దు. 

అవమానాల గురించి 

నాకు నువ్వేమీ  పాఠాలేమీ చెప్పొద్దు. 

నేనెప్పుడు 

అస్త్రమవ్వాలో

నేనెప్పుడు

ఏ అస్త్రమవ్వాలో నాకు తెలుసు!



-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

5.9.2024




కామెంట్‌లు లేవు: