'దృశ్యాదృశ్య జ్ఞాన సంగమమే
మానవ జీవితం'
ఆంధ్ర జ్యోతి దినపత్రిక, 2.9.2024 సౌజన్యంతో
నవతెలంగాణ దినపత్రిక, 2.9.2024 సౌజన్యంతో
కంటికి కనిపించేది మాత్రమే సత్యమనీ, మనకి కనిపించనంత మాత్రాన నిజం లేదనుకోవడానికి లేదనీ, దాన్ని ‘విశ్వర్షి’ డా. వాసిలి వసంత కుమార్ రచించిన’ఏడోఋతువు’లో కవితాత్మకంగా ఎంతో తాత్వికంగా చెప్పారని హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం, భారతీయ కాలమానం ప్రకారం శనివారం రాత్రి సమయంలో అమెరికాలోని సిరికోన సాహితీ అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాలం ద్వారా జరిగిన సమావేశంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు. ద్రావిడ విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దర్భశయనం చంద్రశేఖర్ రచించిన ‘చిగురించిన శిలాజం’ కవితా సంపుటి ఆవిష్కరణ, డా.వాసిలి వసంతకుమార్ రచించిన ‘ఏడోఋతువు’ కావ్యపరిచయాలను చేశారు. ఏడోఋతువులో తాత్విక చింతన, చిగురించిన శిలాజంలో సమకాలీన సామాజిక జీవనం, శాస్త్రవిషయాలు ఎలా ఆవిషృతమయ్యాయో వక్తలు సోదాహరణంగా విశ్లేషించారు. డా.వాసిలి రచనలపై దర్భశయనం మాట్లాడగా, దర్భశయనం రచనపై డా. వాసిలి మాట్లాడ్డం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ రెండు రచనలపై ప్రముఖ రచయితలు, రచయిత్రులు నివర్తి మోహన్ కుమార్, వేణు ఆసూరి, డా.రవూఫ్, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా.పాతూరి అన్నపూర్ణ, డా.శ్రీనివాసులు తదితరులు లోతైన విశ్లేషణలు చేశారు.
మాట్లాడుతున్న డాక్టర్ పాతూరి అన్నపూర్ణ
ఏడో ఋతువు కవితా సంపుటి ముఖచిత్రం, కవి విశ్వర్షి డా.వాసలి వసంతకుమార్
సభాధ్యక్షత వహించిన ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ
ఆహ్వాన పత్రిక
సమావేశంలో పాల్గొన్న డాక్టర్ వాసిలి వసంత కుమార్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి