*కం*
స్మృతికృతిపైమీవ్యాసము
మతిమతులకునందజేయుమాన్యతవిలువల్
యతిలోకోత్తరమీరచన
నుతియింపగకవులహృదినున్నతిగొనగా!
డా.జె.వి.చలపతిరావు, 9.9.2024
*అభినందనలు ఆచార్యా* !💐🙏
తే.గీ.
అన్నదమ్ములు వీరొకటన్న రీతి!
అచ్చుగుద్దినట్టియు ముఖ మందమిదియె!
అమ్మభాష యందపురూప మందుకొనగ!
దార్లయింటి ఘనతను విధాతకూర్చె!
‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
28.8.2024
కం.
ఆదికవియుపేర నిలచె!
ఆదికవియు నన్నయార్య యవనిన్ విద్యల్!
ఆదియు దంపతులుగ మీ
రీదరి దర్శించె!తెలుగు నీవిశ్వంబున్!
‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
27.8.2024
కం.
మాసాంతమునందు నిదియె
భాసితమగు మీప్రసంగ పాఠవ మిదియే!
చూసితి!ఖండాంతరమున
వాసితమై తెలుగునిలచె!వర్థిత శోభల్!
ఆ.వె.
మంచి మనిషివాక్కుమహిత గుణమునిచ్చు!
మనసు మంచిదనగ మనిషి దార్ల !
విద్యనందినట్టి విజ్ఞుడితడు దార్ల!
కోరిబిలచు నితని కూర్మితోడ!
‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
31.8.2024
ఆ.వె.
తెలుగు నేలబుట్టి తేజమందెనితడు!
పంటపండుగాక పసిడినేల!
దార్లయింటనితడు దర్శింపగానిక!
పుడమితల్లిగన్న పుణ్యసుతుడు!
‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
27.8.2024
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి