"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

03 ఆగస్టు, 2024

ఎస్పీ వర్గీకరణ తీర్పుపై హర్షం (2.8.2024)







ఎస్పీ వర్గీకరణ తీర్పుపై హర్షం


సుప్రీం కోర్టు  ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు పట్ల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ( హెచ్ సియు)లోని దళిత విద్యార్థి సంఘం, కొంతమంది అధ్యాపకులు హర్షం వ్యక్తం చేసి, తీర్పుని స్వాగతించారు. శుక్రవారం హెచ్ సి యు మెయిన్ గేట్ ముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి దళిత విద్యార్థి సంఘం సభ్యులు, అందుబాటులో ఉన్న మాదిగ వర్గానికి చెందిన ప్రొఫెసర్స్ ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ తీర్పు కేవలం మాదిగలకు మాత్రమే కాకుండా  అన్ని ఉప కులాలకు సామాజిక న్యాయం అందడం కోసం ఎంతగానో సహకరిస్తుందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సోషియాలజీ శాఖ అధ్యక్షులు ఆచార్య గుండిమెడ నాగరాజు, ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆచార్య మల్లయ్య, ఎక్స్ క్లూజివ్ అండ్ ఇంక్లూజివ్ సెంటర్ కి చెందిన ఆచార్య రాణీ రత్నప్రభ, కమ్యూనికేషన్ శాఖకు చెందిన ప్రొఫెసర్ జనార్దన్ రావు, హెచ్ సియు దళిత విద్యార్థి సంఘం నాయకులు వేణు,  శ్రీ చరణ్, తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు లేవు: