"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

07 ఆగస్టు, 2024

వర్గీకరణ వద్దనే వారి వాదన

 వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఎవరిని ఉద్ధరించడానికి-సమతా సైనిక్ దళ్

🔥🔥🔥🔥🔥

"దృఢచిత్తము కలిగిన మనువాదులు, అత్యధిక జనాభా బహుజనులను నియంత్రించడానికి, 24x7, 365 రోజులు కుట్రలు, కుతంత్రాలతో బహుజనులలో కలహాలు, విభేదాలు సృష్టించి వేల సంవత్సరాల నుండి తమ మనువాద ఆధిపత్యాన్ని నిలుపుకుంటున్నారు. బహుజన సమూహాలలోని ఒకరి పట్ల, మరొకరికి ఈర్ష ద్వేషాలు కలిగించడానికి, మీకు చెందిన రిజర్వేషన్లను, మీ కులానికి చెందని వాళ్లే దోచుకుంటున్నారు అనే విష బీజాన్ని, తమకు ఉన్న మనువాద మీడియా ద్వారా చాలా బలంగా ప్రజల మనసుల్లో శాశ్వత శత్రువులుగా మెలిగే విధంగా తయారు చేయటంలో వారు ఉత్తీర్ణత సాధించారు."

😭😭😭😭😭

ఈ పరీక్షలో కమ్మలు, రెడ్లు పూర్తిగా ఉత్తీర్ణత సాధించి, గత మూడు దశాబ్దాలుగా బహుజన కులాలను పాలక కులాలుగా ఎదగనీయకుండా కేవలం కమ్మలు, రెడ్లు మాత్రమే పాలన చేయడానికి ప్రధాన కారణం మాలలు, మాదిగలు శాశ్వత శత్రువులుగా మారడమే. వర్గీకరణ వ్యతిరేక, అనుకూల ఉద్యమాల వలన, ఈ 30 సంవత్సరాలలో  వేలమంది వివిధ కుల సంఘ నాయకులు పెద్ద ఎత్తున ఉద్భవించారు. ఈ నాయకులు స్వతంత్రంగా వ్యవహరించటం మాని,  తెలుగుదేశం, బిజెపి, కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, భారత రాష్ట్రీయ సమితికి అనుబంధ కుల సంఘాలుగా తయారయ్యారు. 30 సంవత్సరాలుగా మనువాద పార్టీల అండదండలతోని కుల సంఘ ఉద్యమాలు నడుపుతున్నారు. దీనివలన ఒక పెద్ద 'సామాజిక విపత్తు' ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జరిగింది.

🔥🔥🔥🔥🔥

1. 2,50,000 బ్యాక్లాగ్ వేకెన్సీస్, గత 30 సంవత్సరాల నుండి భర్తీ చేయబడలేదు.

2. ఒక లక్ష యాభై వేల మంది, నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై ఎలాంటి ఉద్యమాలు జరగడం లేదు.

3. రాష్ట్రాల బడ్జెట్లో కనీసంగా  షెడ్యూల్ కులాలకు ఖర్చు పెట్టవలసిన 30 లక్షల కోట్ల రూపాయలు, నిధుల మళ్లింపు బాహాటంగానే జరిగింది.

4. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాలు, తెగల జనాభా నిష్పత్తి ప్రకారం అసెంబ్లీ సీట్లు పెంచినారు. కానీ విద్యా, ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ఎప్పుడైనా కుల సంఘ నాయకులు ఉద్యమాలు చేశారా?

5.ఎంత ధైర్యం లేకపోతే ముఖ్యమంత్రులు ఎస్సీ, ఎస్టీల  రాజ్యాంగబద్ధమైన సంక్షేమ స్కీములను ఏకపక్షంగా రద్దు చేశారంటే, అందుకు ప్రధాన కారణం కుల సంఘ నాయకులందరూ   పాలకులైన మనువాదుల గుప్పెట్లో ఉండడమే.

❎❎❎❎❎

"సమాజం ఎప్పుడైతే తమ ఓటును అమ్ముకుందో, ఆ సమాజము తమకు అన్యాయం జరిగినప్పటికీ తిరుగుబాటు చేయకుండా, తమను నిరంతరం మోసగించే వారినే తమ ప్రతినిధులుగా భావిస్తుంది తప్ప,  తమ సమాజం నుండి అంకితభావంతో పనిచేసే మేధావుల పక్షాన అండగా ఉండ కుండా,  తమను నిరంతరం మోసగించే వారి వైపే ఉండటం వలన ఎన్ని దారుణాలు జరుగుచున్నాయి." 

❎❎❎❎❎

వర్గీకరణతో సంబంధంలేని పై అంశాలపైన మూడు దశాబ్దాల నుండి ఏ కుల సంఘ నాయకులు, పాలక కూలాలను బ్యాక్లాగ్ వేకెన్సీస్ గూర్చి, బడ్జెట్లో తమ వాటా గూర్చి, నకిలీ కుల సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు గూర్చి మరియు రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం ఎందుకు పెంచలేదని ప్రశ్నించిన దాఖలాలు లేవు. తప్పులు బహుజన చంచాలే చేస్తూ దానికి కారణమైన ఆదిపత్య కులాలను నిరంతరం విమర్శించడం కూడా సమంజసం కాదు. అమ్ముడు పోయే సమాజం ఉన్నంతకాలం, పాలక కులాలు ఈ విధంగానే వ్యవహరిస్తా ఉంటాయి.

✅✅✅✅✅

పంజాబ్ వర్సెస్ దేవిందర్ సింగ్ కేసులో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు రెండు దశాబ్దాల చర్చకు ముగింపు పలికింది. న్యాయస్థానం హేతుబద్ధమైన డేటా ఆధారంగా ఎస్సీలను వేరు చేయడానికి రాష్ట్రాలను అనుమతించింది మరియు 'క్రీమీ లేయర్'ను మినహాయించే సూత్రానికి మద్దతు ఇచ్చింది. ఇదే కేసులో మందకృష్ణ మాదిగ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. కేసు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానిది.

❎❎❎❎❎

సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిందా?

❎❎❎❎❎

సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి తీర్పు ఇవ్వాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా తనకు లేని అధికారాన్ని  తీసుకొని సుప్రీంకోర్టు ఉద్దేశపూర్వకంగా వర్గీకరణను సిఫార్సు అకారణంగా చేసింది. అందువలనే వర్గీకరణను వ్యతిరేకించే సంఘాలు ఇప్పుడు మరల సుప్రీంకోర్టు విస్తృత దర్మాసనం తలుపులను తట్టడమే కాకుండా భారత్ బంద్ కూడా పిలుపు ఇచ్చి సామాజిక ఉద్యమాలు తీవ్రం చేస్తున్నాయి.

❎❎❎❎❎

వర్గీకరణ తీర్పు 341 అధికరణ ఉల్లంఘన కిందికి రాదు అని 

జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ గారు ప్రకటించారు. ఎస్సీలు సజాతి సమూహం కాదన్న చారిత్రక సాక్ష్యాలను ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సూత్రీకరించే సమానత్వ సిద్ధాంత ఉల్లంఘన కిందికి కూడా వర్గీకరణ రాదని పేర్కొన్నారు. ఎస్సీల్లో కొత్త కులాలను చేర్చడం లేదనీ, ఉన్నవారిని తీసేయట్లేదనీ, వర్గీకరణ మాత్రమే చేస్తున్నందున అది రాజ్యాంగబద్ధ మేనని పేర్కొన్నారు. 'ఉప వర్గీకరణకు కొన్ని పరిమితులు ఉండాలి. ఎస్సీలకు రిజర్వు చేసిన సీట్లు మొత్తాన్ని వారిలో బాగా వెనుకబడినవారికి ఇవ్వడం ఒక నమూనా. కొంత శాతం సీట్లను వారిలో కొన్ని వర్గాలకు కేటాయించి, అవి భర్తీకాకుండా మిగిలిపోతే వారిలో ఇతరులకు ఇవ్వడం రెండో నమూనా' అని సీజేఐ సూచించారు. వీటిలో దేనిని అనుసరించాలనేది రాష్ట్రాలు ఎంచుకోవచ్చన్నారు.

✅✅✅✅✅

100కు 100% షెడ్యూల్ కులాలన్నీ అంటరానితనం కలిగిన ఒకే ఒక సజాతి సమూహం. ఆలయ ప్రవేశ నిషేధం, హోదా లేకపోవడం, సామీప్యత, స్పర్శ, నీడ వల్ల కూడ,   అంటరానితనం వంటి సామాజిక పరిమితులు మరియు వైకల్యాలను ప్రేరేపించే అంటరానితనం నాలుగు రెట్లు ఉండే హిందూ వర్ణ వ్యవస్థలోని సజాతి సమూహాలు. అంటరానివారు, అవర్ణులు లేదా బాహ్య కులాలకు వెలుపల ఉండటం వలన అటువంటి కుల సమూహాల యొక్క అత్యధిక అంటరాని స్థాయి కలిగిన వారు, శవాలు కాల్చేవారు, చెప్పులు కుట్టేవారు, చర్మకారులు, పందుల పెంపకం దారులు, సఫాయి కర్మచారులు. వీరందరు హిందువుల దృష్టిలో సజాతి సమూహాలే. షెడ్యూల్ కులాల అందరిపైన హిందువులు దాడులు నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఎవరినీ ఉపేక్షించడం లేదు.

✅✅✅✅✅

ఆర్టికల్ 341(1) మూడు ప్రధాన ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని కోర్టు విశ్లేషించింది: (1) ఇది కులాన్ని షెడ్యూల్డ్ కులంగా పేర్కొనే ప్రక్రియను వివరిస్తుంది; (2) ఇది ఎవరిని షెడ్యూల్డ్ కులంగా వర్గీకరించవచ్చో నిర్దేశిస్తుంది. (3) నోటిఫైడ్ తరగతులకు చట్టపరమైన హోదాను అందించే ఒక ముఖ్యమైన నిబంధనను కలిగి ఉంటుంది.

✅✅✅✅✅

రాజ్యాంగం ప్రకారం 'షెడ్యూల్డ్ తెగలు'గా వర్గీకరించబడే తెగలుగా   పేర్కొనే అధికారాన్ని పార్లమెంట్ కు  ఇచ్చింది. పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర గవర్నర్‌తో సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి ఈ అధికారాన్ని ఉపయోగించడానికి అనుమతించారు. లోకసభ, రాజ్యసభలలో 2/3వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ ద్వారా వర్గీకరణ చేసి, 50% రాష్ట్రాలలో ఏకగ్రీవంగా ఆమోదింప చేసుకోవాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు 341 రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది.

✊✊✊✊✊

వంచిత్ బహుజన్ అఘాడి ఎస్సీ ఎస్టీలలో రిజర్వేషన్లలో ఉప వర్గీకరణను మరియు క్రీమిలేయర్ ను, అది ప్రతిపాదించిన జస్టిస్ గవాయిను  వ్యతిరేకించారు.

❎❎❎❎❎

జస్టిస్ గవాయి క్రీమీలేయర్‌పై బోధిస్తున్నారు కానీ, ఆయన దివంగత తండ్రి ఆర్.ఎస్.గవాయి రాజ్యసభలో ఎంపీగా ఉన్నప్పుడు న్యాయమూర్తి అయ్యారు. అతని దివంగత తండ్రి 1964 నుండి 2011 వరకు 3 వేర్వేరు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్నారు. అలాగే, అతను లోక్‌సభ మరియు రాజ్యసభ ఎంపీలు, మహారాష్ట్రలో శాసన మండలి చైర్మన్.

🔥🔥🔥🔥🔥

"వంచనకు పాల్పడ్డారు":

షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ విధానం ఆర్థికాభివృద్ధికి సంబంధించిన విధానం కాదని, సామాజిక న్యాయం యొక్క ఆయుధమని అణగారిన బహుజన అఘాడీ బాలాసాహెబ్ ప్రకాష్ అంబేద్కర్ మళ్ళీ నొక్కిచెప్పారు. ఎస్సీ ఎస్టీలకు క్రీమీలేయరును ప్రతిపాదించడం అంటే అంతకంటే నయవంచన న్యాయవ్యవస్థలో మరొకటి లేదని చెప్పారు. జస్టిస్ చంద్రచూడ్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవ్వాలని కలలు కంటున్న వారు దళితులకు వ్యతిరేకమైన తీర్పు ఇస్తున్నారు.

✅✅✅✅✅

షెడ్యూల్ కులాల వర్గీకరణను బెహన్జీ మాయావతి, ఆజాద్ సమాజ్వాది పార్టీ (కాన్షిరాం) పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్, కేంద్ర మంత్రులు రాందాస్ అత్వాలే, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ సుప్రీం కోర్టు తీర్పును తూర్పారబట్టారు.

✅✅✅✅✅

సుప్రీం కోర్టు రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే సమయంలో కొన్ని ముఖ్యమైన నిబంధనలను సూచించింది. ముఖ్యంగా:

✅✅✅✅✅

1. న్యాయసమానత్వం: వర్గీకరణలు న్యాయ సమానత్వాన్ని పాటించాలి. ఒక వర్గాన్ని అన్యాయం చేయకూడదు.

2. తగిన కారణాలు: వర్గీకరణలు చేసే ముందు తగిన కారణాలు ఉండాలి. అర్హతలు, అవసరాలు మరియు వనరులను పరిగణనలోకి తీసుకోవాలి.

3. అధికారిక నివేదికలు: వర్గీకరణలు అధికారిక నివేదికలు మరియు డేటా ఆధారంగా ఉండాలి. కేవలం అంచనాల మీద ఆధారపడకూడదు.

4. అందరికీ సమాన అవకాశాలు: వర్గీకరణలు సమాన అవకాశాలు అందించాలి. విద్య, ఉద్యోగాలు వంటి విషయాల్లో సమానత్వం కల్పించాలి.

5. సమాజపు సంక్షేమం: వర్గీకరణలు సమాజపు సంక్షేమానికి మరియు సామాజిక న్యాయానికి తోడ్పడాలి.

6. సామాజిక మరియు ఆర్థిక ప్రతికూలతలు: వర్గీకరణలు సామాజిక మరియు ఆర్థిక ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకొని చేయాలి. ఈ నిబంధనలను అనుసరించడం ద్వారా రాష్ట్రాలు సరిగ్గా మరియు న్యాయంగా వర్గీకరణలు చేసుకోవచ్చు.

✊✊✊✊✊

వాస్తవానికి సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవాలంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) భారత రాజ్యాంగంలో ఒక భాగం. ఇది ఉపాధి మరియు విద్యలో స్థానిక ప్రజల హక్కులను రక్షిస్తుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనల తర్వాత సృష్టించబడింది.

❌❌❌❌❌

ఎస్సీ ఎస్టీలలో వర్గీకరణ చేయాలంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం షెడ్యూల్ కులాలు, తెగలలో జనాభా దామాషా ప్రకారం కాకుండా, ఆయా కులాలలో అత్యంత వెనుకబడిన కులాలను గుర్తించి వారికి ప్రత్యేకమైన  క్యాటగరైజేషన్ చేయాలని సిఫార్సు చేసింది. ఇది చంద్రబాబు నాయుడు లేక మందకృష్ణ మాదిగ  అనుకుంటున్నా వర్గీకరణ సిద్ధాంతం కాదు. కుతంత్రంతో ఏదో ఒక కులానికి మేలు చేయాలంటే మరల అది కోర్టు ధిక్కారణ కిందే వస్తుంది. ఈ సుప్రీంకోర్టు తీర్పు వలన ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం హక్కుకు భంగం కలుగుతుంది.

😭😭😭😭😭

సుప్రీంకోర్టు వర్గీకరణపై ఇచ్చిన తీర్పు వలన అన్ని రాష్ట్రాలలో అల్ప   సంఖ్యలో ప్రాతినిధ్యంలో

ఉన్నవారు లబ్ధిదారులుగాను, అధిక సంఖ్యలో ఉన్నవారు ప్రస్తుతం ప్రాతినిధ్యాన్ని కోల్పోతారు.  ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పోస్టుల భర్తీ విషయంలో  ఎస్సీ, ఎస్టీలు గరిష్టంగా తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోతారు. దేశంలోని అన్ని ఉద్యోగాలలో నామమాత్ర ప్రాతినిధ్యం కలిగిన ఎస్సీ, ఎస్టీల సంఖ్య ప్రస్తుత మనువాద ప్రభుత్వంలో జీరో స్థాయికి చేరబోతుంది. దేశంలో షెడ్యూల్ కులాలు 1664, షెడ్యూల్ జాతులు 437, ఓబీసీలు 3900 కులాలుగా ఉన్నారు. క్రీమీలేయర్ పేరుతో, వర్గీకరణ పేరుతో, సుప్రీంకోర్టు ప్రాతినిధ్యపు హక్కును హరించి వేస్తున్నది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన తీర్పు.

☸️☸️☸️☸️☸️

నమో బుద్దాయ! జై భీమ్!!

జై భారత్!!! జై సంవిధాన్!!!!

బేతాళ సుదర్శనం, భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక్ దళ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. 9491556706

 ( వర్గీకరణకు సంబంధించిన న్యూస్, ఆర్టికల్స్ దీనిలో భద్రపరచడం కేవలం చరిత్ర రికార్డు చేయడం, పరిశోధకులు, ఉద్యమకారులు ఉపయోగించుకోవడానికి వీటిని భద్రపరుస్తారు నన్నాను)

(వజ్ర భారతి పత్రిక, 7.8.2024 సౌజన్యంతో)


కామెంట్‌లు లేవు: