"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

22 జులై, 2024

ఏదైనా ఒక విశ్వవిద్యాలయానికి 'దాశరథి' పేరు పెట్టాలి'


 

విశాల భారతి దినపత్రిక 22. 7 2024 సౌజన్యంతో.
తెలుగు లోకం దినపత్రిక 22. 7 2024 సౌజన్యంతో.

తెలుగు న్యూస్ టైమ్స్ దినపత్రిక,22.7.2024 సౌజన్యంతో 

మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
సాక్షి దిన పత్రిక  22. 7 2024 సౌజన్యంతో.


తెలంగాణ నిత్య పోరాట స్ఫూర్తి దాశరథి

ఒక విశ్వవిద్యాలయానికి దాశరథి పేరు పెట్టాలి

"నిజాం నిరంకుశత్వంతో ప్రజల అల్లాడిపోతున్న సమయంలో పోరాట స్ఫూర్తితో తన సాహిత్యం ద్వారా ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన దాశరధి కృష్ణమాచార్యుల పేరుని శాశ్వతంగా నిలిచేటట్లు తెలంగాణాలోని ఒక విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెడితే బాగుంటుందని వక్తలు పేర్కొన్నారు.''

పీడన ఎక్కడ ఉంటుందో అక్కడ దాశరథి పోరాటస్ఫూర్తి ఉంటుందని, అందుకనే ఆయన వ్యక్తిత్వం, సాహిత్యం నిత్యం స్మరించుకొంటున్నారని హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు (21.7.2024) అంతర్జాల వేదిక ద్వారా భవాని సాహిత్య వేదిక, కరీంనగర్ ఆధ్వర్యంలో డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన దాశరథి కవి సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు. నిజాం పాలకుల చేతిలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు కోల్పోయి జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్న పరిస్థితుల్లో ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ, నిజాం పాలనను వ్యతిరేకిస్తూ, అక్షర శరాలు సంధించిన ధిక్కార స్వరం దాశరథి కృష్ణమాచార్యులని ఆచార్య దార్ల వెంకటేశ్వరావు అన్నారు. అటువంటి దాశరథి స్ఫూర్తిని తమ కవితల ద్వారా గుర్తు చేసుకోవడానికి ఇటువంటి కవి సమ్మేళనాలు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. దాశరథి పేరుని ఏదైనా ఒక విశ్వవిద్యాలయానికి పేరు పెట్టడం ద్వారా ఆయనకు నిజమైన నివాళిని అందించినట్లు అవుతుందని ప్రభుత్వానికి సూచించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ జూలై నెలలో దాశరథి శతజయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని, ఈ సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించి, వాటిని ఒక గ్రంథ రూపంలో కూడా తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జన్మించిన దాశరథి పేదరికం, కష్టనష్టాలతో తెలంగాణ ప్రజల తరపున అగ్నిధార కురిపించి, రుద్రవీణ పలికించిన మహాంధ్రోదయ కవి అని గౌరవ అతిథిగా పాల్గొన్న గంటా మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగులో అస్తిత్వ ఉద్యమాలు రాకముందే ఆ భావాలకు స్ఫూర్తినిచ్చే గొప్ప అభ్యుదయ కవిగా, నిజాం నవాబుని వ్యతిరేకిస్తూ విప్లవాగ్నినీ, మరొకవైపు శృంగారభావాల్ని పలికించిన ప్రతిభావంతుడైన కవిగా విశిష్ట అతిథిగా పాల్గొన్న డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు దాశరథిని అభివర్ణించారు. నిజాం నిరంకుశత్వంతో ప్రజల అల్లాడిపోతున్న సమయంలో పోరాట స్ఫూర్తితో తన సాహిత్యం ద్వారా ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన దాశరధి కృష్ణమాచార్యుల పేరుని శాశ్వతంగా నిలిచేటట్లు తెలంగాణాలోని ఒక విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెడితే బాగుంటుందని వక్తలు పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా ఒక తీర్మానాన్ని చేసి ప్రభుత్వానికి నివేదించాలని సభలో పాల్గొన్న వారందరూ అభిప్రాయపడ్డారు. సుమారు 75 మంది వరకు కవులు పాల్గొని వచన, పద్య కవితలలో దాశరథి జీవితాన్నీ, రచనలను పోరాట స్ఫూర్తినీ ప్రతిఫలించేలా వర్ణిస్తూ కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. వీరస్వామి గారి ‘రారాకృష్ణయ్య’ పాటతో ప్రారంభమైన సమ్మేళంలో కరిపే రాజకుమార్, హేమంత్ సింగ్ ఆంజనేయులు సుజాత శోభాదేశ్ పాండే, లింగయ్య అలకుంట్ల, అమర్నాథ్, చంద్రమౌళి, మానస నవీన్, నారాయణమూర్తి, పెద్దాడ సుబ్బారావు, రేవతి, ఉషారాణి తదితర కవులు పాల్గొన్నారు. 


ఈనాడు దినపత్రిక,22.7.2024 సౌజన్యంతో


జనం ప్రతిధ్వని,22.7.2024 సౌజన్యంతో 

కామెంట్‌లు లేవు: