"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

18 జులై, 2024

కారంచేడు మాదిగల ఊచకోత..! - అసలేం జరిగింది, ఒక పరిశీలన..!

 (What's app నుండి సేకరణ)

కారంచేడు మాదిగల ఊచకోత..!

         - అసలేం జరిగింది, ఒక పరిశీలన..!

   > ఆంధ్రప్రదేశ్ లో కుల హింసకు కారంచేడు దుర్ఘటన మొదటిదీ కాదు చివరిది కాదు,, కాని దళితులను కుల వ్యవస్థ బంధనాల నుండి బయటపడి, ఐక్య పొరాటాల వైపు సాగి రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన మొదటి ఘటనగా చెప్పవచ్చు..!!ఆంతకు ముందే ముతుకూరు, వీరారెడ్డిపాలెం, బ్రహ్మనతంగేళ్, వడమల్పేట్, దరూర్, చిల్పుర్, అలంపల్లి, వెంకటక్రిష్ణాపురం, చిలమలమర్రి, పందరికుప్పం, లాంటి ఎన్నొ ఘటనలు జరిగినప్పటికి కూడా అది దళితులను ఇంతగా జాగృతం చేసిన సంధర్భం లేదు,, ఇందుకు ముఖ్య కారణం దళితులలొ నిరక్షరాస్యత, కుల వ్యవస్థ ప్రభావం అయ్యి ఉండవచ్చు.. కారంచేడు ఘటన సమయానికి క్రిస్టియన్ మిషనరీల ప్రభావంతో చదువుకుని, విద్యావంతులై రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందుతూ గౌరవమైన జీవితాలతో సమాజంలో ఎదుగుతున్న దళితులకు కులవ్యవస్థ చేస్తున్న అవమానాలపై తిరగబడాలనే ఆలోచన కలగడం మొదలైంది


     *> కారంచేడు..!!*

   > ప్రకాశం జల్లాలోని ఒక గ్రామం కారంచేడు,, చిరాలకు 7 కి మి దూరం, 16 వార్డులు గల కారంచేడు గ్రామంలొని 6 వార్డులలో నివాసముంటున్న దళితులలో అధిక సంఖ్యాకులుగా ఉన్న మాదిగలు కర్రసాము వీరులు,, బిల్లంగోడు రాగానికి అనుగుణంగా కర్రసాము చేయడం లొ వీరిని మించిన వారు లేకుండేవారు., గ్రామంలోని మాదిగలంతా నాలుగైదు ఇంటిపేర్లతోనే ఉండేవారు, అందులో ముఖ్యమైన దుడ్డు, తెల్లా వారి పెద్దరికంలో మాదిగ పల్లె క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో నిండి ఉండేది. మరోపక్క 60% జనాభాతో 90% భూములతో కమ్మ కులస్థులు గ్రామం లొ బలమైన సామాజిక వర్గంగా ఉండేవారు.. భూస్వామ్యులుగా ఉంటూ పార్టీలన్నీంటిలో వీరి అమాయిషీ ఉండడంతో పాటు సినిమా రంగంలో ఆధిపత్యం ఉండడంతో వీరు గర్వంతో విర్రవీగేవారు... వీళ్ళకు పెద్ద N.T.రామారావు అల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి, దగ్గుబాటి చెంచురామయ్య. ఇతని అధ్వర్యంలొ గ్రామం లొ దళితుల మీద కమ్మల అన్యాయాలకు తెగబడేవారు.


   > జనాభా పరంగా బలమైన వర్గం అయినప్పటికీ, వీరులైన మదిగలను ఎదుర్కోడానికి వారు ధైర్యం చుపేవారు కాదు, చుందునాయక కుల నాయకుడు వెంకటేశ్వర్లు మీద కమ్మలు దాడి చేసిన సంధర్భంలో, అతను మాదిగల అశ్రయం పొందాడు.. ఆయనకు రక్షణగా మాదిగలు నిలిచెటప్పటికి కమ్మలు వెనక్కు తగ్గాల్సివచింది,, అల్ప సంఖ్యలొ ఉన్న మాలలను కూడా కమ్మల అన్యాయాల నుండి మాదిగలు కాపాడిన సంధర్భాలు అనేకం.. ఎరుకల కులస్తుడైన తిరుపతి కూతురిని, వెంకటేశు అనే కమ్మ కులస్తడు ఇంటి మీదకొచ్చి బలాత్కారం చేయబోతే మాదిగ యువకులు వాడిని పట్టుకుని బుద్ధి చెప్పారు,, బహిర్భుమికి వెళ్ళే దళితుస్త్రీల మీద కమ్మ యువకులు కాపుకాచి అత్యచర యత్నం చెయబోతుంటే, వారికి రక్షణగా మాదిగ యువకులు జట్లుగా ఏర్పడి బుద్ధి చెప్పారు,, అలా ఆ గ్రామంలో మాల, మదిగ, ఎరుకల లాంటి దళిత కులాలు కలిసి జీవిస్తుండగ మాదిగ వీరులు వారికి రక్షణగా నిలిచిన సంధర్భాలు అనేకం.


   > రాజకీయాలలో రెడ్ల అధిపత్యానికి వ్యతిరేకంగా కమ్మ అత్మగౌరవ నినాదంతో తెలుగు దేశం పార్టీ స్థాపించాక కమ్మ కులస్థులు అందరూ ఆ పార్టీ లొ చేరారు,, 1984 ఎలక్షన్లో చెంచురామయ్య కోరినప్పటికి దళితులు తన కొడుక్కి వోటేయకుండా కాంగ్రెస్ కు వోటువేయడంతో పోలింగ్ బూత్ ల వద్ద హింసకు దాడులకు దిగిన కమ్మలు, 300 మంది పోగై మాదిగపల్లె మీద పడి దొపిడీ చెయడానికి ప్రయత్నిస్తే మాదిగలు వారిని దైర్యంగా ఎదుర్కునేటప్పటికి పారిపోయారు.. పైవన్ని సందర్భాలను మనసులో పెట్టుకుని, కమ్మ పెత్తనానికి ఎదురొడ్డి పోరాడుతూ కంటగింపుగా మారిన మాదిగల మీద కక్ష తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూడడం మెదలెట్టారు.


   *" జూలై 16, 1985 "*

     > గ్రామం lobఉన్న రెండు చెరువులలొ దళితులొకటి, అగ్రకులాలొకటీ వాడుకునే వారు,, ఆరోజు దళితుల చెరువులో బర్రెలకు నీళ్లు తాగించడానికి వెళ్ళిన పోతిన శ్రీను, దళితులు తాగునీరు కొసం వాడే చెరువులో గేదెలు కడిగి, వాటికి కుడితి తాగించి ఆ బక్కెట్లను అందులోనే కడగడం చూసిన కత్తి చంద్రయ్య అనే పిల్లాడు వారిని వారించాడు. ఒక దళిత బాలుడు ఎదురు చెప్పడంతో అగ్రకుల గర్వం దెబ్బతిన్న శ్రీను, రావినీడు ప్రసాద్ కలిసి అతనిని బూతులు తిడుతూ కొట్టడం ప్రారంభించారు,, అప్పుడే మంచి నీళ్ళు పట్టుకోవడానికి వచ్చిన మున్నంగి సువార్థమ్మ వారిని ఆపడానికి ప్రయత్నించింది. దీంతో అహంకారం దెబ్బతిని ఆమె మీదకు గేదెలు తోలడానికి వాడే తాడులతో దాడికి దిగారు... దాంతో తన బిందెను అడ్డం పెట్టి తాడును లాక్కుని, అదే చర్నకోలుతో వారికి బుద్ది చెప్పింది ఆ వీర వనిత,, ఇంతలోపు అటుగా వచ్చిన పందిరి నాగేశ్వర్రావు కల్పించుకుని శ్రీను ప్రసాద్ లను క్షమించమని సముదాయించి పంపేసాడు, ఆ రోజు సాయంత్రం శ్రీను 20 మంది కమ్మ యువకులతో, సువార్తమ్మ ఇంటిమీదకు వచ్చి దాడికి దిగడంతో మళ్ళీ నాగేశ్వరరావు, మిగతా పెద్దలు కల్పించుకుని వారిని పంపించేయగా ,, తన కోడలు చేసిన పనికి సంజాయిషీ ఇచ్చుకోవడానికి రమ్మని సువార్తమ్మ మామ ఆంకయ్యను కమ్మ పెద్దలు పిలవడంతో అందరూ ఈ గొడవ సద్దుమనిగిందనే అనుకున్నారు. ఆ రోజు రాత్రి మద్యం దుకాణం దగ్గర పొగైన కమ్మ యువకులు మాదిగల మీద కక్ష సాధించదానికి ఇదే అదునుగా భావించారు,, వారి ఒక్కరి వల్లనే ఈ పని చేయడం వారి వల్ల కాదు కాబట్టి చుట్టు పక్కల 8 గ్రమాల కమ్మలను పోగేయాలనీ కుట్ర పన్నారు, ఆ రాత్రి , " కమ్మ మొ..కు పుట్టి ఉంటే మాతో రండి,, మాదిగ మొ...కు పుట్టి ఉంటే ఇంట్లోనే ఉండండి" అంటూ యువకులను రెచ్చగొట్టారు.


   *" జూలై 17, 1985 "*

     > ఊదయం 7 గంటలకు, అంకయ్య, ముందురొజు జరిగిన సంఘటన చెప్పడానికి తాను పని చేస్తున్న మండవ రాధాకృష్ణ ముర్తి వద్దకు వెళ్ళాడు, అప్పటికే పందిరి నాగేశ్వరరావు మీద దాడి చేసి వస్తున్న కమ్మ యువకులు మంద, కృష్ణమూర్తి ఇంటి బయటకు చేరి అంకయ్యను బైటికి తీసుకొచ్చి తమకు అప్పగించమని కృష్ణమూర్తిని ఆదేశించారు.. అందుకు కృష్ణమూర్తి నిరాకరించడంతో ( ఆ రోజు మొత్తం మీద జరిగిన ఒకే ఒక మానవీయ చర్య), కృష్ణమూర్తి ఇంటిలొకి జొరబడి అంకయ్యను బయటికి లాక్కొచి పక్కనే ఉన్న పశువుల పాకలొకి లాక్కెళ్ళి కత్తులు, బరిశలు, గొడ్డళ్ళతో తీవ్రంగా గాయపరిచి, వందల సంఖ్యలొ మాదిగ పల్లె వైపు బయల్దేరారు..దారిలో "కమ్మ మొ..కు పుట్టి ఉంటేె మాతో రండి...మదిగ మొ...కు పుట్టినవాళ్ళు మాత్రమే రాకండి" అంటూ నినాదాలు చేస్తూ 4000 మందిని పొగేసి మాదిగపల్లె మీద దాడికి తగబడ్డారు, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్ళతో మాదిగ పల్లెను నాలుగు వైపుల నుండీ కత్తులు, బరిశెలు, గొడ్డళ్ళతో, చుట్టుముట్టారు... ఒకేసారి 4000 మంది ముట్టడించదంతొ, ఆయుధాలు లేని కారణంగా మాదిగలు తమ ప్రాణాలు కాపాడుకొవడానికి కొంతమంది పొలాల్లొకి పరుగులు తీసారు, ఇంకొంతమంది ఇళ్ళల్లొ దాక్కున్నారు,, మాదిగ పల్లె మీద పడిన కమ్మలు పొలుగులలో, ఇంటి పైకప్పులు తొలగించి,, మట్టి గోడలకు రంధ్రాలు చేసి, తలుపులు పగలగొట్టి దొరికిన వారిని దొరికినట్లు విచక్షణా రహితంగా గొడ్డళ్ళతో నరకడం మొదలు పెట్టారు. పొలంలోకి పారిపోవాలని చూసిన తెల్లా ఎలీష ను వెంటబడి పట్టుకుని గొడ్డళ్ళతో, బరిశెలతో నరికి చంపారు ..దుడ్డు యేసు ఇంట్లో చొరబడి అతనిని కౄరంగా నరుకుతుండగా, అడ్డువచ్చిన 9 నెలల నిండు గర్భిణి దుడ్డు సులొచన మీద అత్యాచారానికి ఒడిగట్టారు, ప్రతిఘటించడానికి ప్రయత్నించిన ఆమె భర్త రమెష్ ని 50 గజాలు బయటికి ఈడ్చుకొచ్చి అతి కిరాతకంగా నరికి, బరిశెలతో ఒళ్ళు ఛిద్రం చేసారు.


   > అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు చోద్యం చూస్తుండడం తెలియక, తన తల్లి అలెసమ్మ దగ్గరకు వచ్చి జరిగినది చెప్పి, చిరల పొలీసు స్టేషనుకు వెల్లడానికని 10 రూపాయలు తీసుకుని బయలు దెరిన దుడ్డు వందనాన్ని పట్టుకుని అతి కిరాతకంగా ముక్కలుగా నరికారు.. చనిపోయిన వారందరిలో పెద్దవయస్కుడైన 70 సంవత్సరాల వృద్ధుడు తెల్లా మోషే ని చంపిన విధానం గమనిస్తే ఈ అగ్రకుల రాక్షసుల రక్తదాహం ప్రస్పుటమవుతుంది.. అయన భర్య 55 ఏండ్ల వీరమ్మ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినా కనికరించని ఆ క్రూర మృగాలు, పండు ముసలి అని కూడా చూడకుండా మెడ మీద నరికి, కింద పడిపోయాక ఆయన డొక్కలో బరిశె దూర్చి తిప్పారు. ఇదే విధంగా తెల్లా ముత్తయ్య, దుడ్డు అబ్రహాములను కూడా పొట్టన పెట్టుకున్నారు.


   > మాదిగ స్త్రీలను వివస్త్రలను చేసి నీచంగా ప్రవర్తించి అవమానించడమే కాకుండా, చిన్న పిల్లలు అనే కనికరం లేకుండా, 11 ఏండ్ల మరియమ్మ, 13 ఏండ్ల విక్టోరియా అనే మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం జరిపి మర్మావయవాలలో కర్రలు దూర్చి అత్యంత జుగుప్సాకారమైన చర్యలకు తెగబడి పాశవిక ఆనందం పొందారు... దాడి, హత్యాకాండతో పాటు అందినకాడికి డబ్బు బంగారం దోచుకున్నారు. మాల, ఎరుకల సోదరుల సహాయంతో, కొనప్రాణంతో ఉన్న తమవారిని, పాశవికంగా అత్యాచారం చేయబడ్డ తమ ఆడ కూతుర్లనీ తీసుకురావడానికి ప్రాణం పణంగా పెట్టి ఆ దాడికి ఎదురేగి వెళ్ళిన మాదిగ వీరుల గుండెదైర్యం వలన ఇంకా నష్టం కాకుండా నివారించడం సాధ్యమైంది.


   *> తదనంతర పరిణామాలు..!!*

     > ఈ సంఘటనలో నిజానికి 8 మంది చనిపొగా ప్రభుత్వం 6 గా నమోదు చేసింది.. దాదాపు 40 మందికిపైగా గాయపడ్డారు.. చాలామంది అంగవైకల్యానికి గురయ్యారు.. భీతావాహులైన మాదిగలు కారంచేడు ఖాళీ చేసి చీరాల చర్చిలొ తల దాచుకుంటే వారికి తిండి, మంచి నీరు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చొరవ తీసుకోకపోగా, ప్రతిదాడికి అవకాశం ఉందంటూ కమ్మల నివాసాల దగ్గర ప్రత్యేక పోలీసు క్యాంపు ఏర్పాటు చేసింది కమ్మ ప్రభుత్వం.. జులై 22 వ తెదిన కారంచేడు పోస్టుమేన్ అయిన ఒక మాదిగ యువకుని తల్లి అయిన తెల్లా రెబ్బమ్మ, తన కొడుకు తరుపున లీవ్ లెటర్ అందజేయడానికి రావడంతో పోలీసుల ఆధ్వర్యంలోనే ఆవిడ మీద దాడి చేసారు.. దీంతో తిరిగి కారంచేడు వెళ్ళలేక, చీరాలలో పట్టించుకునే యంత్రాంగం లేక తిండి, నీరు లేని పరిస్థితుల్లో కూడా రాజీలూ, నష్టపరిహారాలకు లొంగకుండా మాదిగ వీరులు తమ ఆత్మాభిమానాన్ని చాటుకున్నారు.


   > ఈ పట్టుదలే అప్పుడప్పుడే విధ్యావంతులై చైతన్యవంతులౌతున్న దళిత కులాలను ఆలోచింపజేసింది.. కులాల చట్రం నుండి బయట పడి, ఐక్యమత్యంతో, ఎదురు తిరిగి పోరాడాలి అనే ఆలోచన, రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి బాటలు వేసింది.. ఇదే దళిత మహాసభ లాంటి సంస్థలను ఏర్పాటు చేసి పోరాట స్పూర్తితో ముందుకు వెళ్ళడానికి తోడ్పడింది. కారంచేడు నుండి చీరాల వచ్చి చర్చి కాంపౌండ్ లో ఆశ్రయం పొందుతున్నప్పుడు , చీరాల లోని మాలలు, *" పేటకో పూట "* నినాదంతో భోజనాలు ఏర్పాటు చేశారు. అంతే కాక ఆశ్రయం పొందుతున్న వారు రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటుంటే చీరాలలోని మాల కులస్తులు కర్రలతో వారి చుట్టూ నిలబడి రాత్రంతా కావలి కాశారు. అంత కలసి మెలసి ఉన్న మాల మాదిగలను ఒక పథకం ప్రకారం విడగొట్టారు.


   > సమస్యను మర్చిపోయే విధంగా చేయడానికి అగ్రకులాల కొమ్ము కాసే బ్రహ్మణాధిపత్య న్యాయవ్యవస్థ కేసుని నత్తనడక నడిపించసాగింది... దళితుల ఐక్యపోరాటాలను నిర్విర్యం చేయడంలో సఫలీకృతం అయిన అగ్రకులాలు, స్వార్థ నాయకుల ద్వారా దళితుల ఐక్యతను నాశనంచేసి, దళిత కులాలను తలో అగ్రవర్ణం కొమ్ముకాస్తూ పరస్పరం శతృవులుగా భావించేలా చేయడంలో తిరుగులేని విజయం సాధించింది. 30 సంవత్సరాల తరువాత అవకాశం చూసుకుని అసలు కారంచేడులో హింసే జరగలేదని తీర్పులు ఇచ్చినా ఏమీ మాట్లాడలేని నిస్సహాయ స్థితిలోకి ఈనాడు దళిత ఉద్యమం చేరుకుంది.


   > ఇంత భయంకరమైన దాడి చేసిన కమ్మ కుల పార్టీలకు ప్రభుత్వాలకు ఈనాడు మాల మాదిగలు తమ దగాకోరు నాయకత్వం ద్వార లొంగిపోవడం అత్యంత బాధాకరమైన విషయం. రక్త క్షేత్రాలలో రుధిర క్షేత్రాలు కట్టడం స్వాభిమానం కాదు... తమ ప్రాణ త్యాగాలతో దళిత చైతన్యానికి బాటలు వేసిన దళిత అమర వీరులకు, దళితరాజ్య స్థాపనతోనే నిజమైన నివాళిలు..!!


   > దళిత ఐక్య ఉద్యమాలకు బాటలు వేసిన కారంచేడ వీరులకు బహుజన రాజ్యాధికార ఉద్యమ *జై భీములు..!! నా నీలిదండాలు..!!*

ఇలాంటి సంఘటణలు పుణరావృతం కాకుండా ఉండాలి అంటే రాజ్యాధికారమే శరణ్యం.!!


✊🏽బహుజనుల ఐక్యత వర్దిల్లాలి..!!

    ✊🏾జై భీమ్..!! జై బహుజన..!!


       *మీ..!!  శ్రేయోభిలాషి..!!*

         యన్. కళ్యాణ్ ఆదివాసీ, BA, IIPLS.

                   *పేరాలీగల్ & చైర్మన్,*

             *" సలహా " ప్రజా న్యాయ వేదిక.*

      🏹AP ఆదివాసీ హక్కుల సాధన సంఘం.

                         *( APAHSS )*

             *✊🏻5 వ షెడ్యూల్ సాధనోద్యమం.*


      [ తేది:- 17 - 07 - 2024, బుదవారం ]

కామెంట్‌లు లేవు: