"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

15 జులై, 2024

డా.సంగిశెట్టి శ్రీనివాస్ పుస్తకాల ఆవిష్కరణ (14.7.2024)



డా.సంగిశెట్టి శ్రీనివాస్ రచించిన దళితోద్యమ వేగుచుక్క 'భాగ్యరెడ్డి వర్మ’, ‘ఇమానం’ విస్మృత దళిత చైతన్యం గ్రంథాలను ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ఆచార్య లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య కాశీం ఆవిష్కరించారు. సమావేశంలో పాల్గొన్న ఇతర వక్తలు.
డా.సంగిశెట్టి శ్రీనివాస్ రచించిన దళితోద్యమ వేగుచుక్క 'భాగ్యరెడ్డి వర్మ’, ‘ఇమానం’ విస్మృత దళిత చైతన్యం గ్రంథాలను ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ఆచార్య లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య కాశీం ఆవిష్కరించారు
డా.సంగిశెట్టి శ్రీనివాస్ రచించిన‘ఇమానం’ విస్మృత దళిత చైతన్యం గ్రంథాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య కాశీం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారికి ఆచార్య దారుల వెంకటేశ్వరావు చిరు సత్కారం.
తన ఆత్మ కథను ఆచార్య సి.కాశీం గారికి అందిస్తున్న దార్ల వెంకటేశ్వరరావు 

డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గార్ని సత్కరిస్తున్న ఆచార్య లింబాద్రి గారు 

దళితుల అస్తిత్వం, చరిత్ర పునర్మూల్యాంకనంతోనే సాధ్యం


'చరిత్రనీ, సంస్కృతినీ సాహిత్యాన్నీ - పునర్మూల్యాంకనం చేయడం ద్వారానే పూడ్చుకోవాల్సిన ఖాళీల పూరింపు జరుగుతుందని వక్తలు పేర్కొన్నారు. దళిత చరిత్ర, దాని పునర్మూల్యాంకనకు నూతన ప్రతిపాదనలు, సూత్రాలు చేయాలన్నారు. సిలబస్ లో కూడా దళిత రచనలు, రచయితలను పెట్టాలని చెప్పారు. 

ఆదివారం నాడు (14.7.2024) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో  గుడిపల్లి నిరంజన్ అధ్యక్షతన జరుగుతున్న 'దళిత 'చరిత్ర - సంస్కృతి - సాహిత్యం - పునర్మూల్యాంకనం - ఖాళీల పూరింపు' రౌండ్ టేబుల్ సమావేశాన్ని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు పూర్వశాఖాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ప్రారంభించి, కీలకోపన్యాసం చేశారు.  చరిత్ర నిర్మాణం రెండు రకాలుగా ఉంటుందనీ, పాలకులు రాసే చరిత్ర. ప్రజలు రాసే చరిత్రలుగా వాటిని చెప్పుకోవచ్చుననీ, ఈ రెండింటిలోనూ దళితుల, పీడితుల బాధలు గాథలు చరిత్రలో నమోదు కాలేదనీ, ఒకవేళ అనివార్యమైన పరిస్థితుల్లో వారి గురించి ప్రస్తావించవలసి వచ్చినా, అది వక్రీకరణకు గురికావడం సర్వసాధారణమైందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. పునర్మూల్యాంకనం అంటే ఉన్న పరిస్థితులను, అవగాహనలను, లేదా అభిప్రాయాలను పునః పరిశీలించి, మళ్ళీ అంచనా వేయడం. ఇది ఒక విధమైన విశ్లేషణ, ఇందులో గతంలో చేసిన నిర్ణయాలను, అభిప్రాయాలను, లేదా విశ్వాసాలను మళ్ళీ సరిచూసుకోవడం, అవి ఇప్పటికీ సముచితమా అని పరిశీలించుకొంటూ కొత్త విషయాలను అందించడమని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. ఈ పునర్ మూల్యాంకనం వల్ల తమ శక్తి సామర్థ్యాలను గుర్తించినప్పుడు దళితుల్లో ఎంతో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక, నాగర్ కర్నూల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సభాధ్యక్షులు గుడిపల్లి నిరంజన్ సదస్సు లక్ష్యాలను, వివిధ అంశాలను వివరించారు.

అన్ని కులాల చరిత్రలు, వారి సాహిత్యం బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ఆచార్య లింబాద్రి పేర్కొన్నారు.

 డా.సంగిశెట్టి శ్రీనివాస్ రచించిన దళితోద్యమ వేగుచుక్క 'భాగ్యరెడ్డి వర్మ’, ‘ఇమానం’ విస్మృత దళిత చైతన్యం గ్రంథాలను ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ఆచార్య లింబాద్రి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య కాశీం ఆవిష్కరించారు. దళిత చరిత్రను, సాహిత్యాన్ని అన్ని ప్రక్రియలను, ఇంకా రావాల్సిన వాటిని పునర్మూల్యాంకనం చేస్తూనే, దళితులు, వెనుక బడిన తరగతులు, గిరిజనులు, ముస్లింలు వంటి వారు ఎవరికి వారు రాసుకోవడమేకాదనీ, పరస్పరం కలిసిమెలిసిన చరిత్ర, సంస్కృతినీ రాసుకోవాల్సిన అవసరాన్ని, పాఠ్యాంశాల్లో దళితులు, రచనలు పెట్టాలనీ ఆచార్య చింతకింది కాశీం తెలిపారు. సిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో మూలన పడిన దళితుల చరిత్రను పునర్మూల్యాంకనం చేసిన వారిలో బోయి భారతి తదితరాల వారి కృషిని వివరించారు. ఆచార్య పులికొండ సుబ్బాచారి మాట్లాడుతూ రి అసెస్మెంట్, రి ఎవాల్యుయేషన్ అనేది పునర్మూల్యంకనం అవుతుందని, కానీ దళితులు చేస్తున్నది ప్రతిముఖమూల్యాంకనం ( కౌంటర్ అసెస్మెంట్) అవుతుందని అన్నారు. దళితుల పేరుతో రాస్తున్న చరిత్రలో ఉపకులాల చరిత్ర విస్మరణకు గురౌతుందనీ, ఆ కులాల సాహిత్యాన్ని క్షేత్ర స్థాయిలో సేకరించాలని చూపారు. డా.ఎం.ఏ.మాలిక్ ఉద్యమాన్ని కొనసాగించడం ద్వారానే దళితులు ఆశించే సామాజిక మార్పు సాధ్యమవుతుందనీ, రచనలతో పాటు  ఏక్టివిజమ్ అవసరమని పేర్కొన్నారు. గ్రంథ రచయిత డా.సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాను గోల్కొండ, భాగ్యనగర్ పత్రికలను అన్నింటినీ సేకరించడం ద్వారా భాగ్యరెడ్డి వర్మ జీవితాన్ని, ఆయన ఉద్యమాన్ని  తెలుసుకోవడానికి కావలసిన అనేక విషయాలు లభించాయని అన్నారు. విమానం గ్రంథంలో తెలంగాణ ప్రాంతంలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు చెందిన వారి విస్మరణకు గురైన దళిత నాయకులను, సాహితీవేత్తలను, సంస్కర్తలను ఒకచోటకు చేర్చే ప్రయత్నం చేశానన్నారు. హైదరాబాదు కేంద్రంగా ఆనాడు సామాజిక రాజకీయ ఉద్యమాలు జరగడం వలన హైదరాబాద్ పరిసర ప్రాంతాలు జిల్లాలకు సంబంధించిన వారి చరిత్ర ఎక్కువగా గుర్తించగలిగానని, అలాగే ఇతర ప్రాంతాలలోని దళిత నాయకుల చరిత్రలను గుర్తించవలసిన అవసరం ఎంతో ఉందనీ, అది ఎవరైనా కొనసాగించవచ్చునని ఆయన ప్రకటించారు. ఒక బిసి కులానికి చెందిన వ్యక్తిగా ఉండడం వలన మాల, మాదిగలు, ఇతర ఉపకులాలకు సంబంధించిన వారి చరిత్రను రాసే క్రమంలో కొన్ని ప్రశంసలు, కొన్ని విమర్శలు ఎదుర్కోవడానికి తను సిద్ధమేననీ, కానీ వారి చరిత్రను బయటకు తీసుకోవాల్సిన అవసరాన్ని మాత్రమే తన లక్ష్యంగా గుర్తించానని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.  ఈ సమావేశంలో కొమ్ము రజిత, స్కైబాబ, సామిడి జగన్ రెడ్డి, మామిడి నారాయణ,  డప్పోల్ల రమేష్, డా.గాదె వెంకటేశ్,  డా.అశోక్ మోరే తదితరులు పాల్గొన్నారు. 



జనప్రతిధ్వని దినపత్రిక 15.7.2024 సౌజన్యంతో 
తెలుగు న్యూస్ టైమ్స్ దినపత్రిక 15.7.2024 సౌజన్యంతో 

ఆంధ్రజ్యోతి దినపత్రిక 15.7.2024 సౌజన్యంతో 

తెలుగు లోకం దినపత్రిక 15.7.2024 సౌజన్యంతో 
భూమి పుత్ర దినపత్రిక 15.7.2024 సౌజన్యంతో 

మన తెలంగాణ దినపత్రిక,15.7.2024 సౌజన్యంతో 


డా.సంగిశెట్టి శ్రీనివాస్ రచించిన 'ఇమానం' గ్రంథాన్ని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు కి ఇస్తున్న దృశ్యం.
మాట్లాడుతున్న ఆచార్య లింబాద్రి గారు
మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
మాట్లాడుతున్న డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్
సదస్సు లక్ష్యాలను, ఫూలే అధ్యయన వేదిక చేస్తున్న కృషిని వివరిస్తున్న గుడిపల్లి నిరంజన్ 


మాట్లాడుతున్న కొమ్ము రజిత 

సమావేశంలో ప్రసంగిస్తున్న డప్పోల్ల రమేష్

దార్ల ఆత్మకథను గుడిపల్లి నిరంజన్ కి బహూకరిస్తున్న దృశ్యం.





కామెంట్‌లు లేవు: