తెలుగు న్యూస్ టైమ్స్, చెన్నై 13.7.2024 సౌజన్యంతో
జన ప్రతిధ్వని రాజమహేంద్రవరం 13.7.2024 సౌజన్యంతో
నమస్తే తెలంగాణ 13.7.2024 సౌజన్యంతో
ఈనాడు 13.7.2024 సౌజన్యంతో
భూమి పుత్ర దినపత్రిక 13.7.2024 సౌజన్యంతో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్ర మొఖర్జీ గారితో
ఈరోజు (12.7.2024)బిచ్కుంద లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఒక జాతీయ సదస్సులో పాల్గొనడానికి వెళ్లాను. నేను మా మిస్సెస్ తో పాటు , సదాశివపేట ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ తాడేపల్లి పతంజలి గారు కూడా మా కారులోనే వచ్చారు. నేషనల్ హైవే లో ప్రయాణం చేస్తుంటే హాయిగా అనిపించింది. కానీ, ఫాస్ట్ ట్రాక్ లేకపోవడం వల్ల టోల్ టాక్స్ లో డబుల్ చార్జి కట్టించుకున్నారు. అది పెనాల్టీ అని చెప్పారు. వెళ్లేటప్పుడు ...వచ్చేటప్పుడు కూడా ఆ పెనాల్టీ పడింది. సాధారణంగా అంత దూరం నేను ఎప్పుడు సొంత కారు డ్రైవ్ చేసుకుంటూ ప్రయాణం చేయలేదు. ఎప్పుడో మూడేళ్ల క్రితం కారు కొన్న వెంటనే యాదగిరిగుట్ట వెళ్లి వచ్చాం. ఆ తర్వాత మళ్లీ అంత దూరం నేను ఎప్పుడు కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళలేదు. కానీ ఈరోజు లింగంపల్లి నుండి సుమారు 140 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. మరలా వచ్చేటప్పుడు కూడా 140 కిలోమీటర్ల సుమారు 280 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. ఈసారి రాజమండ్రి కూడా కారు నడుపుకుంటూ వెళ్లాలని అనిపిస్తుంది. చూద్దాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి