"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

13 March, 2024

పాట షికారు కొచ్చింది ' పుస్తకావిష్కరణ (10.3.2024)

 ఆకెళ్ళ రాఘవేంద్ర రచించిన"పాట షికారుకొచ్చింది"( సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవిత చరిత్ర -పాటల చరిత్ర) పుస్తకావిష్కరణ సభ ప్రసాద్ ల్యాబ్స్, హైదరాబాద్ లో 10.3.2024 వ తేదీన జరిగింది. ఈ సభా కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్టు, రచయిత గోవిందరాజు చక్రధర్  అధ్యక్షత వహించారు. ఈఆవిష్కరణ సభలో  శాంతా బయోటెక్ అధినేత "పద్మభూషణ్" వరప్రసాద్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "షికారు" అంటే హిందీలో వేట. కనుక పాట వేటాడడానికి వచ్చిందన్నారు. 

సిరాశ్రీ గార్ని  రాఘవేంద్ర ఆకెళ్ళ సత్కరిస్తున్న దృశ్యం

ఈ టైటిల్ నిర్ణయించడంలో భాగస్వాములైన  ప్రముఖ జర్నలిస్టు సిరాశ్రీ మాట్లాడుతూ ‘’ వరప్రసాద్ గారు చెప్పిన అర్ధం తనకు నచ్చిందనీ, ఎంతో ఔచిత్యమనిపించిందనీ అన్నారు. 

మనలోని అలసత్వాన్ని, అజ్ఞానాన్ని, అమానవీయతని  వేటాడడానికి వచ్చింది సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి పాట’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

తెలంగాణ రాష్ట్ర ఇంటిలిజెన్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్  ఆఫ్ పోలీస్ శ్రీమతి సుమతి (ఐ.పి.ఎస్) గారు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరులు- రచయిత శ్రీ రామశాస్త్రి గారు, సినీ డైరెక్టర్ శ్రీ ఎస్వీ కృష్ణారెడ్డిగారు, పాటల రచయిత శ్రీ సుద్దాల అశోక్ తేజ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి భార్య, కుమార్తె, కుటుంబ సభ్యులు తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆకెళ్ళ రాఘవేంద్ర గారి కుమార్తె సిరివెన్నెల రచించిన ‘India@2047’ అనే ఆంగ్ల గ్రంథాన్ని శ్రీమతి సుమతి గారు ఆవిష్కరించారు. ఆకెళ్ళ రాఘవేంద్ర ఆత్మీయమైన పిలుపుతోపాటు చక్కని వ్యాఖ్యానం సభను ఆకట్టుకుంది. 


సభలో పాల్గొన్న ఆచార్య దార్ల   వెంకటేశ్వరరావుగార్ని ఎస్వీ కృష్ణారెడ్డి గారు సత్కరిస్తున్న దృశ్యం.
గోవిందరాజు చక్రధర్ గారితో ఆచార్య దార్ల 
ఆకెళ్ళ రాఘవేంద్ర గారి అన్నయ్యకు రాఘవేంద్రగారు పాదాభివందనం చేసి సత్కరించిన తీరు సభకు హైలెట్ 

రాఘవేంద్ర గారి కుమార్తె సిరివెన్నెల రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీమతి సుమతి ( తెలంగాణ రాష్ట్ర ఇంటిలిజెన్స్ ఇన్స్పెక్టర్ జనరల్)


పాట షికారు కొచ్చింది గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న శాంతా బయోటెక్ అధినేత శ్రీ వరప్రసాద్ రెడ్డిగారు, తదీతరులు


గోవిందరాజు చక్రధర్ గారిని ఆకెళ్ళ రాఘవేంద్ర గారు సత్కరిస్తున్న దృశ్యం

పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ గార్ని ఆకెళ్ళ రాఘవేంద్ర గారు సత్కరిస్తున్న దృశ్యం






సమావేశంలో పాల్గొన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కుటుంబం, ప్రేక్షకులు 


పాట షికారు కొచ్చింది ' గ్రంథం రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర గారితో ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డిగారు, తెలుగు శాఖ, హెచ్ సియు అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సభావేదికపై ఒక ‌సెల్ఫీలో!

(దీనిపై పూర్తి నివేదికను తర్వాత రాస్తాను)



No comments: