"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

26 February, 2024

డయాస్పోరా సాహిత్యంపై మార్చి 1,2 వ తేదీల్లో అంతర్జాతీయ సదస్సు

తెలుగు భాషకు అదనపు సొగసు డయాస్పోరా సాహిత్యం


జనం దినపత్రిక 3.3.2024 సౌజన్యంతో 
జనప్రతిధ్వని దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో 

మన తెలంగాణ దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో 
తరణం దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో 
నవతెలంగాణ దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో 
తెలుగు లోకం దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో 
నమస్తే దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో 



సాక్షి దినపత్రిక, 3.3.2024 సౌజన్యంతో 



అంతర్జాలం ద్వారా అంతర్జాతీయ సదస్సులో డయాస్పోరా సాహిత్యంపై మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న డయాస్పోరా సాహిత్యం తెలుగు భాషకు అదనపు సొగసునీ, మరొక పార్శ్వాన్నీ అందించిందని హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గత రెండు రోజులుగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో, తెలుగు మల్లి సహకారంతో  ఆచార్య అయ్యగారి సీతారత్నం సమన్వయ కర్తగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో విశిష్ట అతిథిగా, విషయనిపుణుడిగా పాల్గొని  శనివారం (  02.3.2024) నాడు అంతర్జాలం ద్వారా ప్రసంగించారు. ప్రస్తుతం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతం వెళ్ళకుండా జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయనీ, అలాగే ఒక్క భాషతోనే మనలేని పరిస్థితిలో ఉన్నామనీ, ఈ తరుణంలో డయాస్పోరాసాహిత్యం కొత్త విలువల్నీ, కొత్త ఆలోచనల్నీ అందిస్తుందని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. డయాస్పోరా సాహిత్యాన్ని వలస సాహిత్యమనీ, వలసాంధ్ర సాహిత్యమనీ పిలుస్తున్నారనీ, కానీ వలస వెళ్ళినా ఇష్టపూర్వకంగా వెళ్ళి ఆ యా ప్రాంతాలు, ఆ యా దేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఆ ప్రాంతాల జీవనస్థితిగతులతో మమేకమవుతూ రాస్తున్న సాహిత్యం డయాస్పోరా సాహిత్యం అవుతుందనీ ఆచార్య దార్ల వివరించారు. ఆ దేశాల వారు రాస్తున్నదాన్ని బట్టి ఆ సాహిత్యాన్ని పిలుస్తుంటారనీ, భారతీయ డయాస్పోరా, చైనా, రష్యా, ఆఫ్రికన్ మొదలైన దేశాల పేర్లతో ఆ సాహిత్యాన్ని పిలుస్తుంటారనీ, దీని వల్ల కుల, మత భావనల స్థానంలో మానవీయత ప్రాధాన్యాన్ని వహిస్తుందన్నారు. క్రమేపీ ప్రాంతీయ భేదాలు, జాతి వైషమ్యాలు తొలగిపోయి వసుధైక భావనకు ఈ సాహిత్యం ప్రేరణనిస్తుందన్నారు. అయినప్పటికీ, సహజంగా తమ ప్రాంతం లేదా తమ దేశానికి చెందిన సంస్కృతినీ, భాషనూ మర్చిపోలేక తొలుత వాటినే గొప్పవాటిగా కీర్తిస్తుంటారనీ, కానీ, బహుళ సాంస్కృతిక వాదాన్ని అవగాహన చేసుకోవడం, ప్రాంతాలను, ప్రజల అవసరాలను అనుసరించి సంస్కృతి, భాషలలో మార్పులు వస్తుంటాయని గుర్తించాలన్నారు. తమ దేశంలో తాము అధికసంఖ్యాకవర్గం నుండి వచ్చి, ఆ దేశంలో తాము అల్పసంఖ్యాకులమైనప్పుడు పీడన, ఘర్షణ తమ జీవితంలో కనిపించడం మొదలవుతుందని, అది డయాస్పోరాసాహిత్యంలో అధికంగా కనిపిస్తుందన్నారు.  ఈ సదస్సు తొలి సమావేశానికి కృష్ణ రావిపాటి అధ్యక్షత వహించగా, ప్రపంచ దేశాల నుండి మంగిపూడి రాధిక, తూములూరి శాస్త్రి, డా.ఉష, నారాయణరెడ్డి, గొల్లపూడి విజయ, నందగిరి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






డయాస్పోరా సాహిత్యంపై మార్చి 1,2 వ తేదీల్లో విశాఖపట్నంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో రెండవరోజు (2.3.2024) న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అంతర్జాలం ద్వారా పాల్గొంటారు. తెలుగు , హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించే ఈ సదస్సు ఆంధ్రవిశ్వవిద్యాలయం, విశాఖపట్నం లో ప్రత్యక్షంగాను, అంతర్జాలం ద్వారా కూడా నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్ ఆచార్య అయ్యగారి సీతారత్నం తెలిపారు. 



No comments: