తరణం దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో
విశాలభారతి దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో
నవతెలంగాణ దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో
మన తెలంగాణ దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో
ఈనాడు దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో
ఆంధ్రప్రభ దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో
సాక్షి దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో
నమస్తే న్యూస్ దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో
ఆంధ్రజ్యోతి దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో
జన ప్రతిధ్వని (రాజమహేంద్రవరం ) దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో
ఈనాడు దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో
https://telugunewstimes.in/telugu-language-has-the-power-to-unite-the-languages-of-the-world/
‘ ప్రపంచ భాషల్ని తనలో కలుపుకోగలిగే శక్తి తెలుగు భాషకే ఉంది’
మహాసహస్రావధాని డా.మేడసాని మోహన్ వ్యాఖ్య.
ప్రపంచంలోని అనేకభాషలను తనలో కలుపుకోగలిగీ సహజత్వాన్ని కోల్పోని మహత్తరశక్తి తెలుగు భాషకు స్వంతమని మహాసహస్రావధాని డా.మేడసాని మోహన్ పేర్కొన్నారు. హెచ్ సియు తెలుగు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు (13.2.2024) మానవీయ శాస్త్రాల ఆడిటోరియంలో ‘వెయ్యేళ్ళ తెలుగు పద్య సాహిత్య వైభవం’ అనే అంశంపై ప్రత్యేక ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో డా.మేడసాని మోహన్ ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. తెలుగు వారి వారసత్వం, సంస్కృతి, సాంప్రదాయిక జ్ఞానాన్ని పొందడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆచార్య దార్ల వివరించారు. తెలుగు ద్రావిడ భాషా జన్యమే అయినప్పటికీ అధికంగా సంస్కృత ప్రభావం ఉందని, దాని వల్ల వేద సంస్కృతి తెలుగు భాషలో కనిపిస్తుందని డా.మేడసాని మోహన్ వ్యాఖ్యానించారు. తెలుగులో ఛందోబద్ధమైన పద్యం ఒక ప్రత్యేకత కాగా, అవధానం మరింత ప్రత్యేకంగా వెలుగొందుతుందని ఆయన వివరించారు. నన్నయ, తిక్కన, ఎర్రని, శ్రీనాథ, పోతన, శ్రీకృష్ణ దేవరాయల, పెద్దనాదికవుల పద్య విశష్టతలను సోదాహరణంగా ఆయన వివరించారు. మానవుల మనస్తత్వాన్ని ఆంధ్ర మహాభారతంలో ఉన్నాయనీ దాన్ని నన్నయ ఎంతో పరిశీలనతో వివిధ పాత్రల రూపంలో సృజనీకరించారని ఆయన వివరించారు.
ఇతరభాషలతో పోలిస్తే తెలుగుకి గొప్ప రామణాయికత, ఇతర భాషల్లో లేని అనేక ప్రక్రియలు ఉన్నాయని ముఖ్య అతిథిగా పాల్గొన్న మానవీయ శాస్త్రాల విభాగం డీన్ ఆచార్య వి.కృష్ణ పేర్కొన్నారు. పద్యాల్లోని భావుకత, సౌందర్యంతో పాటు ఆ పద్యం అందించే మూలధర్మాన్ని కూడా అవగాహన చేసుకోవాలని ఆయన ఉద్బోధించారు.
మన విశ్వవిద్యాలయం ఐఓఈ ప్రాజెక్టు ద్వారా ఇటువంటి సదస్సులు, ప్రత్యేక ఉపన్యాసాలకు ఆర్థిక సహాయం చేస్తారని, దాని ద్వారా విద్యార్థులు ఎప్పటికప్పుడు నూతన విషయాలను, విజ్ఞానాన్ని పొందవచ్చునని గౌరవ అతిథిగా పాల్గొన్న ఆచార్య ఎం.మురళీమనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య డి.విజయలక్ష్మి, ఆచార్య వారిజారాణి, డా.భూక్యాతిరుపతి, డా.బాణాల భుజంగరెడ్డి, డా.డి. విజయకుమారి, పరిశోధకులు,విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు న్యూస్ టైమ్స్, చెన్నై దినపత్రిక 14.2.2024 సౌజన్యంతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి