నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్. మహమ్మద్ హసేన రచించిన" తదేక" సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి పుస్తకాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు చేతిలో మీదుగా, హైదరాబాదులో ఆచార్య రవ్వ శ్రీహరి వేదిక పై మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ మహమ్మద్ హసేన రాసిన ఇరవై ఒక్క వ్యాసాలు పుస్తకం రూపంలో ప్రచురించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు సూర్య ధనుంజయ్, ప్రసిద్ధ కవి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, నవతెలంగాణ ఎడిటర్ కె. ఆనందాచారి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ల సంఘం రాష్ట్ర బాధ్యులు పి. మధుసూదన్ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల సంఘం రాష్ట్ర బాధ్యులు డాక్టర్ ఎస్. రాజారామ్, కవి యాకుబ్, స్కై బాబా గారు, డాక్టర్ వెల్దండ శ్రీధర్, అనంతోజు మోహన్ కృష్ణ, గ్రంథ పాలకులు దుర్గ ప్రసాద్, బూర్గు గోపికృష్ణ, పల్లె సతీష్ తదితరులు పాల్గొన్నారు.
తదేక ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక, 14.2.2024 సౌజన్యంతో
నేటి నిజం దినపత్రిక, 14.2.2024 సౌజన్యంతో
తదేక ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
నేటి నిజం దినపత్రిక, 14.2.2024 సౌజన్యంతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి